Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
జుట్టు సమస్యలను నివారించే ట్రెడిషనల్ రెమెడీ: శీకాయ
కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. పూర్వకాలంతో పోల్చితే, మనిషి ఆహారాలు, అలవాట్లు మారాయి. ఇవి మాత్రమే కాదు, మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్ మీద అవగాహన పెరిగింది. మోడ్రన్ గా అందంగా కనబడుటకు ఎన్నో మెరుగులు దిద్దుకుంటున్నారు. ఈ మోడ్రన్ ప్రపంచంలో ఏ ఒక్క అమ్మాయిని చూసిన అందంగా , స్టైల్ గా డిఫరెంట్ గా కనబడాలని కోరుకుంటుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో. గతంలో పొడవుగా నల్లగా నిగనిగలాడే జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకునేది. కానీ ఇప్పుడు రోజుకో హెయిర్ స్టైల్ తో కనబడుతూ అందంగా ఉండాలని కోరుకుంటారు . అయితే జుట్టు ఉన్న వారు ఎలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినా పర్వాలేదు. కానీ జుట్టులేని వారు ఎలా?జుట్టును ఆరోగ్యంగా పెంచుకోవడానికి మార్గాలను వెదకాలి. ప్రతి అమ్మాయి పొడవాటి, నల్లజుట్టు కలిగి ఉండాలని కోరుకోవడం వారి డ్రీమ్ . కానీ ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే వాతావరణ కాలుష్యం, వేడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు .
అందమైన పొడవాటి జుట్టును కోరుకునే వారు మార్కెట్లో ఉండే వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ కొంటుంటారు . హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కానీ ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే సరైన హెర్బ్స్ మరియు పదార్థాలను ఎంపిక చేసుకుంటే మార్కెట్లో కెమికల్ ప్రొడక్ట్స్ కోసం డబ్బు ఖర్చుచేసే పని ఉండదు.
ఇంట్లో మనం చేసుకునే హెయిర్ కేర్ థెరఫిలు చాలా సింపుల్ గా ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ రోజుల్లో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ అత్యధికంగా ఉపయోగిస్తున్నారు . అయితే అందమైన జుట్టును పొందడానికి మన వంటగదిలోనే హోంరెమెడీస్ చాలా ఉన్నాయి.
హోం రెమెడీస్ లో ఒకటి శీకాయ . ఒక బెస్ట్ హెయిర్ ప్రొడక్ట్ . దీన్ని పూర్వకాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు . ఇది జుట్టు మరియు తలకు కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. ఇది జుట్టుకు మంచి క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. శీకాయ పౌడర్ ను తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టును శుభ్రం చేస్తుంది మరియు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. శీకాయతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

క్లెన్సర్
జుట్టుకు శీకాయ ఒక ఉత్తమ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఇతర హాని కలిగించే పదార్థాలుండవు కాబట్టి, జుట్టు ఆరోగ్యానికి మేలైనది.

లో పిహెచ్ లెవల్స్ కలిగి ఉంటుంది
ఈ కాలంలో కూడా జుట్టుకు సోపు ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారు. ఇలా వాడటం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. సోపు తలను డ్రైగా మరియు దురదగా మార్చుతుంది . మరియు జుట్టు సమస్యలను పెంచుతుంది. అందువల్ల శీకాయలో పిహెచ్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, సెన్సిటివ్ హెయిర్ ఉన్నవారి కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

విటమిన్స్ తో నిండి ఉంది
శీకాయ ఒక బెస్ట్ నేచురల్ హెర్బ్ . జుట్టుకు విటమిన్ డి మరియు సిలను అందిస్తుంది.

గ్రేట్ డై అబ్ సార్బర్
ఎవరైతే వారి జుట్టుకు డై వేయాలని కోరుకుంటారో వారు . శీకాయను ఖచ్చితంగా ఉపయోగించడం వల్ల హెయిర్ కు బెస్ట్ గా అబ్సార్బ్ అవుతుంది. మీరు మరింత బెటర్ గా మరియు ఎఫెక్టివ్ గా నేచురల్ కలర్ ను పొందుతారు.

చుండ్రు
వాతారవంలో మార్పులు, వేడి వల్ల తలల్లో చుండ్రు మరియు దురద ఎక్కువగా ఉంటుంది. శీకాయతో ఈ సమస్యలు చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. ఈ సమస్యలను నివారించుకోవడానికి ఎలాంటి మెడికల్ చెప్స్ అవసరం లేదు .



Click it and Unblock the Notifications
