Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ కోసం aహెయిర్ డిటాక్స్
వివిధ రకాల హెయిర్ స్టైల్ ప్రొడక్ట్స్ మరియు హెయిర్ స్ట్రెయిటనింగ్, స్మూతింగ్, మిరయు ఇతర కెమికల్ బేస్డ్ షాంపులు, కండీషనర్స్ ,ట్రీట్మెంట్స్ వల్ల జుట్టు స్ట్రక్చర్ మరియు షైనింగ్, సున్నితత్వాన్ని కోల్పోతుంది.
వాతావరణంలోని మలినాలు మరియు కాలుష్యం హెయిర్ డ్యామేజ్ కుకారణం అవుతుంది . ఫలితంగా హెయిర్ ఫాల్, హెయిర్ పల్చగా మారడం, చుండ్రు, బట్టతల మరియు జుట్టు పెరగకపోవడం వంటివి జరగుతాయి.
జుట్టు నల్లగా సహజరంగుతో నిగనిగలాడాంటే: ఆయుర్వేద టిప్స్
ఇప్పుడు , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్రతి సారి హెయిర్ స్పాలు, సలూన్స్ మరియు స్పాట్రీట్మెంట్ లను ప్రతి సారి చేయించక్కర్లేదు . ఇంట్లోని మీ జుట్టుకు అవసరమయ్యే డిటాక్సి ట్రీట్మెంట్స్ ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు . అందుకు కొన్ని నేచురల్ పదార్థాలు సహాయపడుతాయి .
జుట్టు డిటాక్సిఫై చేసుకోవడం చాలా అవసరం . దీని వల్ల జుట్టులో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . అదే విధంగా జుట్టు పెరుగదలను ప్రోత్సహిస్తుంది . జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది . హెయిర్ డిటాక్సిఫికేషన్ వల్ల జుట్టు శుభ్రపడటంతో పాటు, జుట్టు సమస్యలను నివారిస్తుంది .
చుండ్రు, హెయిర్ ఫాల్, ఇతర సమస్యలను నివారించే పసుపు...
హెయిర్ డిటాక్సిఫై చేసుకోవడానికి కొన్ని సులభ మార్గాలున్నాయి. ఈ మార్గాలను కేవలం అనుసరిస్తే చాలు . అందమైన కేశ సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు . అందుకోసం కొన్ని నేచురల్ మార్గాలను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం...

నిమ్మరసం:
హెయిర్ డిటాక్సిఫికేషన్ కోసం నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక బకెట్ వాటర్లో నిమ్మరసం మిక్స్ చేసి , ఈ నీటితో తలస్నానం చేయాలి . ఇలా చేయడం వల్ల తలలో టాక్సిన్స్ తో పాటు ఆయిల్ తొలగిపోతుంది. మరియు జుట్టును డిటాక్సిఫై చేస్తుంది.

సీసాల్ట్:
సీసాల్ట్ మరో నేచురల్ మార్గం . జుట్టును డిటాక్సిఫై చేయడానికి సీసాల్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. సీసాల్ట్ లో మినిరల్స్ నిండి ఉన్నాయి . ఇది హెయిర్ మరియు స్కిన్ ను డిటాక్సిఫై చేస్తుంది. సీసాల్ట్ ను సోడా మరియు వెనిగర్ తో మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బేకింగ్ సోడా:
జుట్టుకు బేకింగ్ సోడా వండర్ గా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగానీళ్ళు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి . బాగా మసాజ్ చేసి కొద్ది సేపటి తర్వాత వెనిగర్ తో తలస్నానం చేసుకోవాలి. ఇదితలకు డిటాక్సిఫై చేస్తుంది.

నిమ్మ మరియు కీరదోస:
నిమ్మరసం తలను శుభ్రం చేయడానికి గ్రేట్ గా ఉపయోగపడుతుంది . నిమ్మరసంలో ఉండే సిట్రిస్ యాసిడ్ తలలో డీప్ గా క్లీన్ చేస్తుంది . ఇది తలలో చల్లని స్వభావాన్ని కలిగిస్తుంది . కీరదోసకాయను పేస్ట్ చేసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి దీన్ని రెగ్యులర్ షాంపుగా ఉపయోగించడం వల్ల తలకు డిటాక్సిఫైగా చేస్తుంది.

కోకోనట్ మిల్క్:
కోకనట్ మిల్క్ లో జుట్టు పోషణగుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . జుట్టు మొదళ్ల నుండి డిటాక్సిఫై చేస్తుంది. కొబ్బరిని తురిమి, పేస్ట్ చేసి పాలు తియ్యాలి. అందులో కొద్దిగా నూనె మిక్స్ చేసి , రెగ్యులర్ షాంపులా దీన్ని వాడాలి.

తేనె:
ఏరకమైన జుట్టుకైన తేనె ఒక బెస్ట్ హోంరెమెడీ..ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు పట్టించి తర్వాత తేనె అప్లై చేసి కొన్ని నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications