Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
డూ ఇట్ యువర్ సెల్ఫ్: జుట్టు చిక్కుబడకుండా...బాదం ఆయిల్, పెరగు & హానీ మాస్క్..
అందమైన జుట్టును కలిగి ఉండటం మహిళ అందం మరింత పెరుగుతుంది. ఎంత పొడవుగా , ఒత్తైన జుట్టు కలిగి ఉన్నా, ఆ జుట్టు అందంగా, మెరుస్తూ, మ్రుదువుగా కనపడకపోతే ఆ జుట్టు చూడటానికి బాగుండదు.
ఎంత మంచిగా డ్రెస్ వేసుకొన్నా, మేకప్ అలంకరించుకున్నా, జుట్టు అందంగా లేకపోతే, చిక్కుబడి కనబడటం వల్ల మొత్తం అందమంతా పాడవుతుంది.

ఈ పరిస్థితి హెయిర్
క్యూటికల్స్ పెరిగినప్పుడు జరుగుతుంది . ఇలా జరిగినప్పుడు జుట్టుయొక్క మాశ్చరైజర్ తగ్గిపోంది . దాంతో పరిస్థితి మరింత వికారం చేస్తుంది .అంతే కాదు జుట్టు డీహైడ్రేషన్ కు గురైనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంకా తినే ఆహారం, జుట్టు పట్ల తీసుకొనే జాగ్రత్తల బట్టే జుట్టు అందం ఆధారపడి ఉంటుంది . జుట్టు అందంగా మార్చుకోవడానికి చిక్కుబడ్డ జుట్టును వదిలించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల రసాయనికి సౌందర్య ఉప్పత్తులు అందుబాటులో ఉన్నాయి . ఇవి సమస్యను తగ్గించక సమస్యను మరింత పెంచుతాయి. జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి.
అయితే మార్కెట్లోని కెమికల్ పదార్థాలకంటే, ఇంట్లో ఉండే కొన్ని
నేచురల్ పదార్థల ద్వారానే సాధారణ జుట్టు సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు.

జుట్టు చిక్కుబకుండా అందంగా, తేమగా, ఆరోగ్యకరమైన జుట్టును అందివ్వడానికి ఇంట్లో ఉండే మూడు ముఖ్యమైన పదార్థాలు గొప్పగా సహాయపడుతాయి. వాటిలో పెరుగు, తేనె మరియు బాదం నూనె.
ఈ మూడు నేచురల్ పదార్థాల్లో ఉండే గుణాల వల్ల జుట్టు చిక్కుబడకుండా మరియు డ్రైగా మారకుండా నివారిస్తుంది. జుట్టుకు నేచురల్ గా తేమను అందిస్తుంది మరియు జుట్టును మ్రుదువుగా మార్చడానికి సహాయపడే క్యూటికల్స్ ను అందిస్తుంది.
అలాంటి హెయిర్ మాస్క్ ను ఇంట్లో తయారుచేసుకోవడానికి కావల్సినవి, ప్రయోగించే పద్దతి తెలుసుకుందాం...
కావల్సినవి:
- 2 టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్
- 1/2 కప్పు పెరుగు
- 1/4 కప్పు తేనె

ఉపయోగించే విధానం:
- పైన సూచించన పదార్థాలన్ని ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కటి పేస్ట్ లా ఏర్పడే వరకూ మిక్స్ చేసి, తలకు మాస్క్ లా వేసుకొని, 15నిముషాలు మసాజ్ చేయాలి.
- తలకు మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత , తలస్నానం చేయాలి. మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల చిక్కు వదిలిపోతుంది.
- ఈ పద్దతి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కా వల్ల జుట్టు చిక్కబడదు. మరియు ఒక నెల వరకూ ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి, ఈ చిట్కాను మీరు తిరిగి అనుసరించాల్సిన పనిలేదు.
- ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు అందంగా కనడుతుంది. చిక్కు ఉండదు. ఈ హెయిర్ మాస్క్ ను నెలకొకసారి అప్లై చేస్తే చాలు, జుట్టు సాప్ట్ గా , చిక్కపడకుండా , అందంగా కనబడుతుంది.



Click it and Unblock the Notifications