Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఎలాంటి హెయిర్ అయినా..స్ట్రెయిట్ హెయిర్ గా మార్చే వండర్ ఫుల్ టిప్స్
సాధారణంగా చాలా మంది మహిళలకు తమ కేశాలను స్ట్రెయిట్ గా...సిల్కీగా ఉంచుకోడం అంటే చాలా ఇష్టం. అందుకు వారు హెయిర్ స్ట్రెయిటనింగ్ పద్దతిని పాటించడం, లేదా హెయిర్ స్ట్రెయిటనింగ్ హోం రెమడీస్ ఉపయోగించడం చేస్తుంటారు. ప్రస్తుత ట్రెండ్ లో స్ట్రెయిట్ హెయిర్ బాగా పాపులర్ గా ఉంది. ఏ అమ్మాయిని చూసిన స్ట్రెయిట్ హెయిర్ చేయించుకొని చాలా అందంగా కనబడుతున్నారు. ముఖ్యంగా స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవాడనికి కొన్ని వేలల్లో డబ్బును ఖర్చుపెడుతున్నారు. కానీ అనుకోకుండా వారి వారి ఒరిజినల్ హెయిర్ యొక్క నాణ్యతను కోల్పోవడం మరియు నేచురల్ స్ట్రక్చర్ ను కోల్పోతున్నారు. జుట్టు కూడా చూడటానికి ఆర్టిఫిషియల్ గా కనబడుతుంటుంది. కాబట్టి, స్ట్రెయిట్ హెయిర్ పొందడానికి నేచురల్ రెమెడీస్ ఒక ఉత్తమ మార్గం.
పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!
హెయిర్ స్ట్రెయిటనింగ్ లో అనేక కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలతో పాటు మరికొన్ని సహాజంగా పెరిగే జుట్టుకు హాని కలిగిస్తుంది. సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్ హెయిర్ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తెల్ల జుట్టు నివారించే హెల్తీ ఫుడ్: హోం రెమడీస్
మార్కెట్లో హెయిర్ ప్రొడక్ట్స్ ను కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకొన్నవి. కాబట్టి, హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం కొన్ని హోం మేడ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం చాలా ముఖ్యం. అవసరం కూడా .అందువల్ల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి నేచురల్ పదార్థాలు మళ్ళీ మన ముందు కొత్తవాటిలా కనిపిస్తున్నాయి. అటువంటి నేచురల్ ప్రొడక్ట్స్ కొన్ని మన వంటగదిలోనే ఉన్నాయి . ఈ పదార్థాలను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టును మెత్తగా, సాఫ్ట్ గా మరియు స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు . మరి ఇంట్లో ఉండే కొన్ని నేచురల్ హెయిర్ స్ట్రెయిటనర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

ఫ్రూట్ ప్యాక్:
ఫ్రూట్ ప్యాక్ ఆరోగ్యానికి మేలు చేయడం మాత్రమే కాదు, జుట్టుకు కూడా కొన్ని అద్భుతాలను చేస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీ లేదా అరటిపండ్లను మెత్తగా మ్యాష్ చేసి, వాటికి తేనె మరియు పాలు మిక్స్ చేసి, జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ హెయిర్ ప్యాక్ :
ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ కాంబినేషన్ హెయిర్ ప్యాక్ స్ట్రెయిట్ హెయిర్ కు కొన్ని అద్భుతాలను చేస్తుంది. రెండు గుడ్లులోని వైట్ అండ్ ఎల్లో మిక్సింగ్ బౌల్లో వేసి, మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొద్దిసమయం అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు.

ముల్తానీ మట్టి:
ముల్తానీ మట్టీ చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, కేశ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది . ఇది హెయిర్ స్ట్రెయిటనింగ్ ను పెంచుతుంది. ఒక కప్పులో ఎగ్ వైట్ మరియు ముల్తానీ మట్టి వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి . కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి.

పాలు:
జుట్టును స్ట్రెయిట్ గా మార్చడానికి పాలు ఒక గ్రేట్ పదార్థం . జుట్టుకు అవసరం అయ్యే పోషణను అందిస్తుంది మరియు జుట్టును సాఫ్ట్ గా మరియు స్ట్రెయిట్ గా మార్చుతుంది . పాలలో ఉండే ప్రోటీన్స్ జుట్టు యొక్క చిక్కును విడదీస్తుంది. జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది.

కోకనట్ మిల్క్:
కోకనట్ మిల్క్ జుట్టును స్ట్రెయిట్ గా మార్చుతుందని నమ్ముతారు . ఇది జుట్టు అవసరమయ్యే షైనింగ్ ను కూడా అందిస్తుంది. అలాగే కోకనట్ మిల్క్ లో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు తలలో చుండ్రు మరియు ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

హాట్ కొబ్బరి నూనె :
కొబ్బరి నూనెను వేడి చేసి, తలకు పట్టించాలి. హాట్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత, తలకు వేడినీటిలో ముంచిన టవల్ ను తలకు చుట్టి 20-30నిముషాలు అలాగే ఉండాలి. దాని తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత కేశాలు నేచురల్ గా ఆరనివ్వండి. మీ కేశాలు చూడటానికి గ్లాసీగా మరియు నేచురల్ గానే స్ట్రెయిట్ గా కనబడుతుంటాయి.

పెరుగు:
పెరుగు హెయిర్ కేర్ లో చాలా అద్భుతమైన వస్తువుం. ఎందుకంటే పెరుగును జుట్టుకు పట్టించడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు నివారించబడుతుంది, జుట్టు సాఫ్ట్ గా చేస్తుంది. కాబట్టి పెరుగును నిమ్మరసం మరియు గుడ్డుతో మిక్స్ చేసి, కొన్ని చుక్కల నూనె వేసి బాగా మిక్స్ చేసి, తలకు పట్టించిన తర్వాత మంచి ఫలితాలను పొందవచ్చు.



Click it and Unblock the Notifications