Latest Updates
-
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
పొడవైన మరియు ఒత్తైన జుట్టు పొందడానికి హెల్తీ డైట్ ఫుడ్స్
ఒత్తైన, పొడవైన జుట్టు కలిగి ఉండటం అంటే ప్రతి ఒక్క మహిళకూ ఇష్టమే. అలాంటి జుట్టు కలిగి ఉండటం మనందరికీ ఇష్టమే కదా మరి మీరేమంటారు? మన అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు ప్రాధానమైనది . అంతే కాదు మంచి హెయిర్ కలిగి హెయిర్ స్టైల్ కలిగి వారిలో మంచి కాన్ఫిడెంన్స్ లెవల్స్ ఉంటాయని నమ్ముతారు.
కానీ అలాంటి అందమైన జుట్టును కలిగి ఉండటం మరియు అలాంటి జుట్టును మెయింటైన్ చేయడం అంత సులభం కాదు. అలాంటి జుట్టు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే . కాబట్టి అలాంటి జుట్టు ఉన్నవారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడటం మాత్రమే కాదు..ప్రశంసల వర్షం కూడా కురిపిస్తారు.
గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్
అందమైన జుట్టు మంచి ఆరోగ్యానికి కూడా సూచిక అంటారు. అలాంటి జుట్టుకు మంచి పోషణ అవసరం.ఒత్తైన, పొడవైన జుట్టు పొందడానికి వివిధ రకాల ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి .ఇలాంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ ను పొందవచ్చు . ముఖ్యంగా ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి.
తెల్ల జుట్టును నివారించే 8 సూపర్ ఫుడ్స్
డైరీప్రొడక్ట్స్ కూడా హెయిర్ హెల్త్ ను ప్రోత్సహిస్తాయి . అంతే కాకుండా హెల్తీ...లాంగ్ హెయిర్ పొందడానికి మరిన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. అవేంటో తెలుసుకొని, రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు కూడా అందమై జుట్టును పొందగలరు. మరి ఆహారాలేంటో ఎలా ప్రయోజనాలు అందిస్తాయో చూద్దాం...

సిట్రస్ ఫ్రూట్:
హెల్తీ హెయిర్ గ్రోత్ పొందడానికి సిట్రస్ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది ఐరన్ బాగా గ్రహిస్తుంది. అందువల్ల ఆరెంజ్ మరియు నిమ్మరసం వంటి సిట్రస్ ఫ్రూట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . సిట్రస్ ఫ్రూట్స్ కేశాలు పెరిగేందుకు మరియు బలోపేతం చేసేందుకు సహాయపడుతాయి . దాంతో ఓవరాల్ హెయిర్ కండీషన్ మెరుగుపడుతుంది.

డ్రై ఫ్రూట్స్ :
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలను అందిస్తాయి . ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి కాబట్టి, రెగ్యులర్ డైట్ లో బాదం, డేట్స్, ప్రూనే మరియు వాల్ నట్స్ వంటివి చేర్చుకోవాలి. ఫిగ్స్ మరియు డేట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఫిష్:
చేపల్లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతాయి . మరియు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తాయి . జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మార్చుతాయి. హెయిర్ స్ట్రక్చర్ మారుతుంది .

సోయాబీన్స్ :
సోయాబీన్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . ఇవి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతాయి . ఇందులో 40శాతం ప్రోటీన్స్ ఉండి, జుట్టు పోషణకు మరియు పెరుగుదలకు సహాయపడుతాయి.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ :
ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి . ఇవి మినిరల్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల హెయిర్ హెల్త్ కు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా స్వీట్ పొటాటో, ఆరెంజ్, బనానా, గార్లిక్, మరియు కిడ్నీ బీన్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి జుట్టు మూలాల నుండి బలోపేతం చేస్తాయి.

పాలు:
పాలలో క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సమిస్తుంది . ఇది జుట్టు పోషణకు మంచి మూలం . ప్రతి రోజూ ఒక గ్లాసుపాలు త్రాగడం వల్ల జుట్టు స్మూత్ గా మిరయిు సిల్కీగా మారుతుంది. అంతే కాదు హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా మారుతుంది.

రొయ్యలు:
సీఫుడ్స్ లో మరో హెల్తీ ఫుడ్ రొయ్యలు. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, బి12, జింక్ మరియు ఐరన్ లు పుష్కలంగా ఉన్నాయి . ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తాయి మరియు హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారిస్తాయి . ముఖ్యంగా హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తాయి.



Click it and Unblock the Notifications











