For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్యామేజ్ హెయిర్ ను ట్రీట్ చేయడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super Admin
|

చాలా మందికి జుట్టు సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకరి జుట్టురాలే సమస్య, మరొక్కరికి చుండ్రు, ఇంకొంతమందికేమో దురద, హెయిర్ బ్రేకేజ్, డ్రైహెయిర్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా మన జుట్టు పొడి బారినట్లు, ఎండినట్లు నిర్జీవంగా కలతప్పి ఉన్నట్లైతే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడిబారడానికి మరియు హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కాలుష్యం, హార్డ్ వాటర్ వంటివి కూడా ముఖ్య కారణం కావచ్చు.

కాబట్టి పొడి జుట్టును మరియు డ్యామేజ్ అయిన జుట్టును వదిలించుకోవడానికి ఇదే మచం సమయం. పొడి జుట్టును సున్నితంగా, నునుపుగా మార్చుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో జుట్టురాలే సమస్యలు, హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉండవు . పొడి జుట్టు సమస్య పొడావాటి కేశాలు ఉన్న వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్య. పొడవు జుట్టు ఉన్న కొంత మంది మహిలళకు జుట్టు పొడిబారడంతోపాటు తల మీద హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అయ్యి, పల్చగా ఉంటాయి. కాబ్టటి ఈ సమస్యలకు వెంటనే చెక్ పెట్టాలంటే కొన్ని చక్కటి హోం రెమెడీస్ ను ఉపయోగించాలి...

గుడ్డు:

గుడ్డు:

వారానికొకసారి గుడ్డులోని పచ్చసొన అప్లై చేయడం వల్ల కొన్ని వండర్స్ జరుగుతాయి . గుడ్డులోని పచ్చసొన బాగా గిలకొట్టి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిన్స్ చేసి , తడి జుట్టుకు అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా మారడమే కాదు, మంచి షైనింగ్ తో స్మూత్ గా మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

ఆముదం:

ఆముదం:

ఆముదం నూనె బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతో జుట్టు పునరుద్దరణకు సహాయపడుతుంది . మరియు డ్యామేజ్ హెయిర్ రూట్స్ కు చాలా మేలు చేస్తుంది.

మొయోనైజ్:

మొయోనైజ్:

హెయిర్ బ్రేకేజ్ ను అరకట్టడంలో మయోనైజ్ కూడా ఒకటి. వారంలో ఒకసారి మయోనైజ్ ను జుట్టుకు పట్టించడంల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు సాప్ట్ గా మారుతుంది. తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి . మయోనైజ్ జుట్టుకు కావల్సిన కండీషన్ అందివ్వడంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది . దాంతో హెయిర్ బ్రేక్ తగ్గుతుంది.

హెన్నా:

హెన్నా:

జుట్టుకు హెన్నా ఉపయోగించడం వల్ల వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి,జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో పాటు,జుట్టును శుభ్రపరచడంలో గొప్పగా సహాయపడుతుంది. నేచురల్ గా హెయిర్ కు డైయింగ్ లక్షణాలను అందిస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, దాని మీద హాట్ టవల్ ను చుట్టాలి. 45నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె పెనిట్రేటివ్ ఆయిల్ ఇందులో విటమిన్ ఇ మరియు లౌరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు అంశాలు కలిగి ఉండటం వల్ల ఇది డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది.

బట్టర్:

బట్టర్:

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

English summary

Home Remedies To Treat Damaged Hair

Hair damage is a really common problem, specifically because of the environment we live in these days. Having long hair seems like a distant dream because of how difficult it is to nourish and maintain the hair. The first step to making your hair grow longer is to treat damaged hair and nothing better than home remedies can work for it.
Desktop Bottom Promotion