Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డ్యామేజ్ జుట్టుని హెల్తీ అండ్ షైనీగా మార్చే హోంమేడ్ కండిషనర్
మీ జుట్టు నిర్జీవంగా కనిపిస్తోందా ? పొడిబారి, చిట్లిపోయి అందవిహీనంగా కనిపిస్తోందా ? ఇవన్నీ మీ జుట్టు డ్యామేజ్ అవుతోందని తెలిపే సంకేతాలు. కొన్ని సందర్భాల్లో, కొంతమందికి హార్మోనల్ చేంజెస్, జెనటిక్స్, కాలుష్యం వంటి కారణాల వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కారణమవుతాయి.
ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతుంటే.. మీ జుట్టు డ్యామేజ్ అవకుండా హోంమేడ్ కండిషనర్ సహాయపడుతుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సింపుల్ గా తయారు చేసుకుని అప్లై చేస్తే మీ జుట్టు హెల్తీగా, షైనీగా మారుతుంది. డ్యామేజ్ ని కంట్రోల్ చేయవచ్చు. మరి హోంమేడ్ కండిషనర్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

జుట్టు డ్యామేజ్ కి కారణాలు
అలాగే హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్, డ్రైయర్స్, స్ట్రెయిటనర్స్, కర్లర్స్, ఘాడత ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించే జుట్టుకు హాని చేస్తాయి. కాబట్టి అన్ హెల్తీ లైఫ్ స్టైల్.. అన్ బ్యాలెన్స్డ్ డైట్ పాలో అవడం వల్ల జుట్టు డ్యామేజ్ కు కారణమవుతుంది. కాబట్టి వీటన్నింటి కారణంగా.. జుట్టు మొత్తం నిర్జీవంగా తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్
2 నుంచి 3 స్పూన్ల పెరుగు
2 టేబుల్ స్పూన్ల తేనె
బాగా పండిన సగం అవకాడో

తయారు చేసే విధానం
యాపిల్ సైడర్ వెనిగర్ ని మైక్రోవేవ్ లో కాస్త వెచ్చగా చేయాలి. దానికి పెరుగు, తేనె కలపాలి. ఇప్పుడు బాగా మెత్తగా చేసిన అవకాడో, పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా కలిపి పేస్ట్ తయారు చేస్తుకోవాలి.

ఉపయోగించే విధానం
జుట్టుని శుభ్రం చేసుకున్న తర్వాత ఆరాక అప్లై చేయాలి. బాగా మసాజ్ చేయాలి. జుట్టు మొత్తం అంటే చివర్లకు కూడా అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే..

ఎన్ని సార్లు
ఈ కండిషనర్ ని వారానికి ఒకసారి ఉపయోగిస్తే.. ఎఫెక్టివ్ రిజల్ట్స్ పొందవచ్చు.

బెన్ఫిట్స్
ఈ కండిషనర్ ఉపయోగించడం వల్ల.. మీ జుట్టు స్ట్రాంగ్ అండ్ హెల్తీగా మారతాయి. జుట్టుని కొత్త నిగారింపు అందిస్తాయి. అలాగే జుట్టు కుదుళ్లకు, స్పాల్ఫ్ కి పోషణను అందిస్తుంది.



Click it and Unblock the Notifications
