Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హెయిర్ లాస్ నివారించడానికి వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది ?
జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య కనిపిస్తూనే ఉంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చెప్పే కామన్ ప్రాబ్లమ్ హెయిర్ లాస్. రోజుకి వంద వెంట్రుకలు రాలడం అనేది చాలా సాధారణమని నిపుణులు చెబుతారు.
మ్యాజిక్..!! ఊడిపోయిన జుట్టు పొందడానికి టెస్టెడ్ టెక్నిక్స్
కానీ మీ జుట్టు రాలుతున్నట్టుగానే.. హెయిర్ గ్రోత్ కూడా ఉంటేనే.. మీకు బట్టతల సమస్య ఉండదు. కానీ చాలామందికి జుట్టు రాలిపోతోంది. కానీ.. కొత్త జుట్టు రావడం లేదు. దీనివల్ల బట్టతల, పలుచటి జుట్టు వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.
జుట్టు రీగ్రోత్ అవడానికి రకరకాల షాంపూలు, ఆయిల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే రకరకాల బ్రాండ్స్ ఉండటంతో.. అడ్వర్టైజ్ మెంట్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. దీనివల్ల మీరు వెంటవెంటనే వీటిని మారుస్తూ ఉంటారు. అలా తరచుగా మార్చేయడం వల్ల ఉన్న జుట్టు కాస్త ఊడిపోవడానికి కారణమవుతుంది.
తెల్లజుట్టుని నల్లగా.. నిగనిగలాడేలా మార్చే ఎఫెక్టివ్ హోం రెమిడీస్
ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఎలాంటి ఫలితం పొందలేకపోతే.. వెంటనే హోం రెమిడీస్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు ? వెల్లుల్లి రుచులే కాదు.. మీ జుట్టుకి కూడా మంచి ట్రీట్మెంట్ అట. కాబట్టి.. హెయిర్ లాస్ తో పోరాడటానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వెల్లుల్లిలోని 15 పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడే కెరాటిన్ ని ఉత్పత్తి చేయడంలో వెల్లుల్లి సహకరిస్తుంది. కాబట్టి.. ఆరోగ్యవంతమైన కురులు, హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ నివారించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. అదెలా ఉపయోగించాలో చూద్దాం..

న్యూట్రీషన్
జుట్టుకి కావాల్సిన పోషకాలు అందించడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అలాగే న్యూట్రియంట్ డెఫిసియన్సీ లోపాన్ని అధిగమించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే.. జుట్టుకి కావాల్సిన పోషకాలు అందించి.. ఆరోగ్యంగా మారుస్తుంది.

ఇన్ఫెక్షన్స్
జుట్టు విపరీతంగా రాలిపోవడానికి తలమాడులో వచ్చే బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల.. ఎలాంటి ఇన్ఫెక్షన్ నైనా నివారిస్తుంది.

బలమైన జుట్టు కుదుళ్లకు
హెయిర్ లాస్ సమస్యతో పోరాడటానికి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు డ్యామేజ్ అవకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది.

క్లీన్ స్కాల్ఫ్
జుట్టు రాలడానికి డర్టీ స్కాల్ఫ్ కూడా ఒక కారణం. తల శుభ్రం చేసుకోవడానికి షాంపూ మాత్రం సరిపోదు. వెల్లుల్లి జుట్టుని, మాడుని శుభ్రం చేసి.. హెల్తీగా, క్లీన్ గా ఉండేలా చేస్తుంది. దురగా, చిరాకుగా అనిపించే తలకు వెల్లుల్లి చక్కటి పరిష్కారం.

వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి ?
ఇన్ని పోషకాలు, రెమిడీస్ ఉన్న వెల్లుల్లిని హెయిర్ లాస్ కాకుండా నివారించడానికి ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు. సింపుల్. వెల్లుల్లి రెబ్బల నుంచి రసం తీయాలి. ఈ వెల్లుల్లి రసంను షాంపూలో కలుపుకుని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వాడటం వల్ల వచ్చే వాసన నచ్చకపోతే.. మరో విధంగా ప్రయత్నించవచ్చు. వెల్లుల్లి రసం, తేనె, కొద్దిగా అల్లం కలిపి రాసుకుంటే.. ఈ వాసన ఉండదు.

వెల్లుల్లి నూనె
కొద్దిగా కొబ్బరినూనెను, కొంచెం వెల్లుల్లి రసం మరిగించాలి. చల్లారిన తర్వాత స్కాల్ఫ్ పై మసాజ్ చేయాలి. గంట తర్వాత లేదా రాత్రి మసాజ్ చేసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవచ్చు.

మసాజ్
పైన చెప్పిన పద్ధతులు ఫాలో అయ్యేంత టైం లేదని పీలవుతున్నారా ? అయితే మరో సింపుల్ చిట్కా ఉంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా చేయాలి. వాటిని హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రాత్రి పడుకునే ముందు రుద్దుకోవాలి. తర్వాత ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications