Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డ్యామేజ్ అయిన జుట్టుని సాఫ్ట్ గా మార్చే ఎగ్ హెయిర్ ప్యాక్..
పొడి జుట్టు, డ్యామేజ్ అయిన హెయిర్ ఉంటే.. దానికి కారణం డీహైడ్రేషన్. అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుపుతుంది. అలాగే కండిషనర్స్ ఉపయోగించకపోయినా.. జుట్టు డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. అయితే డ్యామేజ్ అయిన జుట్టుని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
కండిషనర్స్ ఉపయోగించినా.. కొన్ని సార్లు.. ఫలితాలు పొందలేకపోతారు. ఒక వేళ ఫలితం ఉన్నా.. అది తాత్కాలికమే అవుతుంది. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం, పోషకాహారం తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, రెగ్యులర్ గా జుట్టుకి ఆయిల్ పెట్టడం, కనీసం వారానికి ఒకసారి ఆయిల్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

ఈ టిప్స్ మాత్రం ఫాలో అయితే.. జుట్టు హెల్తీగా, హైడ్రేట్ గా ఉండదు. జుట్టు డ్రై కాకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? కొన్ని ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తాయి. అవి కూడా మీ వంటింట్లోనే ఉంటాయి. వాటిని తేలికగా పాటించవచ్చు.
కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల జుట్టు హెల్తీగా, షైనీగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ డ్ాయమేజ్ అయిన జుట్టుని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే.. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికే.

కావాల్సిన పదార్థాలు
3 ఎగ్స్
2 టేబుల్ స్పూన్ల తేనె
2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
తయారు చేసే విధానం
ఒక గిన్నెలో ఎగ్స్ అన్నింటినీ... బాగా మిక్స్ చేయాలి. తర్వాత తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలపి పేస్ట్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకి, కుదుళ్లకి, స్కాల్ప్ కి బాగా పట్టించాలి. షవర్ క్యాప్ ధరించాలి. 25 నుంచి 30 నిమిషాలు అలానే వదిలేయాలి. ఇప్పుడు గాఢత తక్కువగా ఉన్న షాంపూ ఉపయోగించి.. కండిషనర్ కూడా ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోవాలి.
ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒకసారి ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండాలి. అంటే.. మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఎగ్స్ స్మెల్ వస్తాయని ఆందోళన పడకండి.. అది ఉండదు. షాంపూ ఉపయోగించడం వల్ల.. గుడ్డు వాసన పోతుంది.



Click it and Unblock the Notifications