Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలెన్నైనా.. పరిష్కారం ఒక్కటే..!
ఈ హెర్బల్ మాస్క్ తయారు చేయడానికి కొబ్బరి నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం, వెల్లుల్లి, నిమ్మ ఆయిల్ ఉపయోగిస్తాం.ఈ పదార్థాలన్నీ జుట్టు రాలడాన్ని, తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
మీ జుట్టు సాధారణంగా కంటే ఎక్కువ పలుచబడిపోతోందా ? సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. కానీ మీకు ఇంతకంటే.. ఎక్కువగా రాలిపోతున్నాయా ? మీ బెడ్ పై, దిండుపై ఎక్కువ జుట్టు ఉండటం గమనిస్తున్నారా ?

అలాగే బట్టతల స్పాట్ కనిపించడం మొదలుపెట్టిందా ? 20లలోనే తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోందా ? ఒకవేళ మీరు ఈ సమస్యలన్నింటితో సతమతమవుతుంటే.. ఒకే ఒక హోంమేడ్ హెయిర్ ప్యాక్ మీకున్న అన్ని రకాల జుట్టు సమస్యలనూ దూరం చేస్తుంది.
వందకు పైగా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయితే ఎలాంటి హానికారక కెమికల్స్ లేని, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని, ఆర్గానిక్ ప్రొడక్ట్ మీరే మీ చేతులతో తయారు చేసుకోవచ్చు. అది కూడా సత్ఫలితాలను అందించిన తర్వాతే.. మీకు ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేస్తున్నాం.
ఈ హెర్బల్ మాస్క్ తయారు చేయడానికి కొబ్బరి నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం, వెల్లుల్లి, నిమ్మ ఆయిల్ ని ఉపయోగిస్తాం. కొబ్బరినూనెలో ల్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుని బలంగా మారుస్తుంది. స్కాల్ప్ కి పోషణ అందించి కొత్త జుట్టు తంతువులు ఏర్పడటానికి ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషణ అందిస్తుంది. వెల్లుల్లిలో కాపర్ ఉంటుంది. ఇది తెల్ల జుట్టు లక్షణాలను అరికడుతుంది. కరివేపాకులో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఇక నిమ్మ ఆయిల్ లో విటమిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జుట్టుకి షైనింగ్ ని, జుట్టుని ఒత్తుగా మారుస్తుంది. మరి జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ న్యాచురల్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

స్టెప్ 1
ఉల్లిపాయలను పొట్టు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో నుంచి రసం తీయాలి. ఈ రసంను వడకట్టుకోవాలి.

స్టెప్ 2
ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అరకప్పు కొబ్బరినూనె వేసి సన్నని మంటపై 5 నిమిషాలు వేడి చేయాలి. కొబ్బరినూనె ఇతర ఆయిల్స్ కంటే చాలామంచిది. ఇది తేలికగా గ్రహించే గుణం కలిగి ఉంటుంది. ఇది పెట్టుకున్న తర్వాత జుట్టుని తేలికగా మారుస్తుంది.

స్టెప్ 3
4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఈ ఆయిల్ లో వేయాలి. మరో 10 నిమిషాలపాటు సన్నని మంటపై మరిగించాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ ని వడకట్టి సపరేట్ చేసుకోవాలి. ఇది తెల్ల జుట్టుని నివారించడమే కాదు.. స్కాల్ప్ ని క్లెన్స్ చేసి, చుండ్రుని నివారిస్తుంది.

స్టెప్ 4
గుప్పెడు కరివేపాకు తీసుకుని.. ఎండలో ఆరబెట్టాలి. పొడిపొడిగా మారిన తర్వాత పొడి చేసుకోవాలి. 1 టీస్పూన్ కరివేపాకు పొడిని వెల్లుల్లి, కొబ్బరినూనెతో తయారు చేసిన ఆయిల్ లో కలపాలి. తర్వాత ఉల్లిపాయ రసం కలిపి ఫోర్క్ తో బాగా మిక్స్ చేయాలి.

స్టెప్ 5
ఈ మిశ్రమంలోకి 4 నుంచి 5 చుక్కల నిమ్మ ఆయిల్ ని కలపాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ని ఒక ఎయిర్ టైట్ కంటెయినర్ లో పోసి 24గంటలపాటు అలాగే వదిలేయాలి.

స్టెప్ 6
ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. జుట్టు బ్రేక్ అవకుండా.. నెమ్మదిగా జాగ్రత్తగా చిక్కులు తీసుకోవాలి. అంతా పూర్తయిన తర్వాత మళ్లీ స్కాల్ప్ నుంచి దువ్వుకోవాలి.

స్టెప్ 7
మీ జుట్టుని 4 నుంచి 5 సెక్షన్లుగా విడదీసుకోవాలి. తర్వాత మాస్క్ అప్లై చేయాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. జుట్టంతా ఈ మాస్క్ అప్లై అయ్యేలా జాగ్రత్త పడాలి.

స్టెప్ 8
ఈ హెయిర్ ప్యాక్ ని రాత్రంతా అలాగే ఉంచుకోవడం వల్ల ఉల్లిపాయలోని థెరపీటిక్ ప్రాపర్టీస్ జుట్టు పెరుగులకు సహాయపడుతుంది. ఉదయాన్నే షాంపూ, కండిషనర్ ఉపయోగించుకుని శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 9
ఇప్పుడు తలలో ఉన్న అదనపు వాటర్ ని తొలగించుకోవాలి. మెత్తటి టవల్ తో తలలో తేమను తుడుచుకోవాలి. దీనివల్ల జుట్టు డ్రై కాకుండా, బ్రేకేజ్ కాకుండా అడ్డుకోవచ్చు. టవల్ తో స్కాల్ప్ ని రుద్దకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది.

స్టెప్ 10
జుట్టుని డ్రై చేసుకోవడానికి ఉపయోగించే హెయిర్ డ్రైయర్స్ పెట్టుకునే ముందు హీట్ ప్రొటెక్టింగ్ సిరం ఉపయోగించాలి. 6 ఇంచుల దూరంగా పెట్టుకోవాలి.

కంక్లూజన్
తెల్ల జుట్టు నివారించడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే సరైన ఫలితాలు పొందాలంటే.. ఈ ప్యాక్ అప్లై చేస్తూనే ఫైబర్ ఫుడ్స్, సరైన మోతాదులో నీటిని తీసుకోవాలి.



Click it and Unblock the Notifications