Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్..!!
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య జుట్టు తెల్లబడటం. జుట్టు తెల్లగా మారిందంటే.. నలుగురిలోకి వెళ్లడానికి, ఆఫీసు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి కూడా పిల్లలు సంకోచిస్తారు. అందుకే తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే జుట్టుకి వేసిన రంగు కొంతకాలానికే పోతూ ఉంటుంది. ఇలా వెంటనే పోవడం వల్ల.. మళ్లీ మళ్లీ జుట్టు కలర్ వేస్తారు. ఎక్కువసార్లు జుట్టుకి కలర్ వేయడం కూడా మంచిది. ఇలాంటి సమస్యతో మీరూ బాధపడుతుంటే.. ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉంటుందో చూద్దాం..
అయితే జుట్టుకి వేసిన కలర్ వెంటనే పోవడానికి మన అలవాట్లు కూడా కారణమవుతాయి. మనం చేసే పొరపాట్ల కారణంగా.. జుట్టుకి వేసిన హెయిర్ డై.. ఎక్కువకాలం ఉండదు. పార్లర్ లో జుట్టుకి కలర్ వేసిన తర్వాత.. దాన్ని ఎక్కువ కాలం జుట్టుకి ఉంచుకోవడానికి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా..

డీప్ కండిషనింగ్
హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఉండటానికి ఫాలో అవ్వాల్సిన బేసిక్ టిప్ డీప్ కండిషనింగ్. డీప్ కండిషనింగ్ వల్ల.. కుదుళ్లకు పోషణ అంది.. హెయిర్ పోకుండా ఉంటుంది. ముఖ్యంగా.. హెయిర్ కలర్ ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడుతుంది.

హాట్ వాటర్ బాత్ చేయకూడదు
హెయిర్ కలర్ జుట్టుకి అలానే ఉండాలంటే.. తలస్నానానికి మరీ వేడినీటిని ఉపయోగించకూడదు. దీనివల్ల జుట్టుకి ఉన్న రంగు ఫేడ్ అవుతుంది. హాట్ వాటర్ బాత్ వల్ల కేవలం జుట్టుకే కాదు, జుట్టుకున్న రంగుపై కూడా దుష్ర్పభావం చూపుతుంది. హెయిర్ కలర్ త్వరగా పోవడానికి కారణమవుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్
ఈ ట్రెడిషనల్ పద్ధతి పాటించడం వల్ల జుట్టుకి వేసుకున్న కలర్.. ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడుతుంది. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని, అరకప్పు నీటిలో కలిపి.. జుట్టుని ఈ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివల్ల హెయిర్ కలర్ ఫేడ్ అవకుండా జాగ్రత్త పడవచ్చు.

తరచుగా తలస్నానం చేయడంః
తరచుగా తలస్నానం చేస్తూ ఉండటం వల్ల.. జుట్టుకి ఉన్న కలర్ కూడా పోతుంది. అలాగే ఎక్కువగా షాంపూ చేసుకోవడం వల్ల కూడా.. జుట్టుకున్న కలర్ పోతుంది.

హీటింగ్ టూల్స్
మరీ ఎక్కువగా హీటింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల.. జుట్టు నిర్జీవంగా మారడం, చిట్లిపోవడమే కాదు.. జుట్టుకి ఉన్న కలర్ పోతుంది. ఇలా హీటింగ్ టూల్స్ ఉపయోగించడం కంటే.. న్యాచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది.

సన్ ప్రొటెక్షన్
ఎస్ పీఎఫ్ అనేది.. కేవలం చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకి కూడా చాలా అవసరం. ముఖ్యంగా.. జుట్టుకి కలర్ వేసుకున్న వెంటనే జుట్టుకి యూవీ కిరణాలు.. హానిచేస్తాయి. కాబట్టి.. బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం.

హెయిర్ ప్రొటెక్టింగ్ ప్రొడక్ట్స్
హెయిర్ కలర్ ని ప్రొటెక్ట్ చేసే.. హెయిర్ కలర్ ప్రొటెక్టింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం చాలా అవసరం. వీటిలో ఉండే పదార్థాలు.. జుట్టుకి వేసుకున్న కలర్ పోకుండా చేస్తాయి. షాంపూ, కండిషనర్ రూపంలో వీటిని ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications