Latest Updates
-
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి!
హెయిర్ ఫాల్ తగ్గించి, జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి కుంకుడుకాయలు..!!
‘మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలను వాడేవారు. అప్పుడే జుట్టు బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా ఊడటం, పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నాం' అంటుంటారు చాలామంది. అయితే పూర్వ కాలంలో క
'మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలను వాడేవారు. అప్పుడే జుట్టు బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా ఊడటం, పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నాం' అంటుంటారు చాలామంది. అయితే పూర్వ కాలంలో కాలుష్యం ఇంతగా లేదు. ఈ షాంపూలు, సబ్బుల వాడకమూ అంతగా లేదు. పైగా తలకు వాడే నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. కుంకుడుకాయ, షికాకాయ్‌లతో వారానికి ఒకసారి మాత్రమే తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. ఇప్పుడు జిడ్డు తక్కువగా, సుగంధాలు ఉండే నూనెలను వాడుతున్నాం.

ఆడవారికైనా, మగవారికైనా జుట్టు ఉంటేనే అందం. పాతకాలం మనుషులకు నల్లగా నిగనిగలాడే ఒత్తయిన వెంట్రుకలుండేది. అసలు ఆ రోజుల్లోనైతే జడ వేసుకోవటానికే కనీసం ఓ గంటసేపైనా పట్టేది ఆడవారికి. అప్పట్లో మనకు షాంపులు లేవు కాబట్టి తప్పని సరిగా కుంకుడు కాయలనే తలంటుకు వాడే వారు. కానీ ఇప్పుడు షాంపు లేనిదే స్నానం చేయడం లేదు. అనేక హానికరమైన రసాయానిక పదార్థాలతో ఉండే షాంపూలతో మనకు చాలా ప్రమాదం. అదే కుంకుడుకాయ పకృతి పరంగా లభిస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కుంకుడుకాయలతో నెలలో కనీసం ఒక్కసారైనా స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.
కుంకుడుకాయలతో కలిగే ప్రయోజనాలు:

నేచురల్ షాంపు :
కుంకుడుకాయ నురుగుతో తలంటుకుంటే చుండ్రు తగ్గి, తల వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. షాంపు, సబ్బులు కన్నా తలంటుకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది. కొన్ని కుంకుడు కాయలను నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానిన తర్వాత తర్వాత ఈ షాంపు వాటర్ తో తలస్నానం చేయాలి. తలనుశుభ్రం చేయడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

హెన్నాతో మంచి కండీషనర్ గా పనిచేస్తుంది
కుంకుడుకాయ రసాన్ని హెన్నాతో మిక్స్ చేసి, డీప్ గా కేశాల పొడవునా అప్లై చేయాలి. ఈ న్యూట్రీ మాస్క్ వల్ల జుట్టు సమస్యలకు మంచి ట్రీట్మెంట్ వంటింది.

ఆయిల్ హెయిర్ కు:
తలలో ఆయిల్ ను బ్యాలెన్స్ చేయడంలో ఇది గ్రేట్ రెమెడీ. రీటా షాంపును జుట్టుకు వాడటం వల్ల తలలో నేచురల్ ఆయిల్స్ పెరిగి జుట్టుకు సరిపడా తేమను అందిస్తుంది. నేచురల్ గా పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:
కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే చుండ్రు ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది. జుట్టుకు ఒది ఒక బెస్ట్ బెనిఫిట్ . 1 స్పూన్ మెంతి పిండి, 1 స్పూన్ కుంకుడుకాయ పొడి, 1 స్పూన్ వీటిని పుల్లటి పెరుగులో కలిపి గంటసేపు నానబెట్టి తలకు ప్యాక్ ల వేసి 45 నిమిషాల తర్వాత నీళ్ళతో కడగాలి. ఇది జుట్టులో ఉండే చుండ్రుని షాంపూల కంటే మెరుగ్గా నిర్ములిస్తుంది.

జుట్టు నల్లగా మారుతుంది:
ప్రతి వారం హెన్నాతో పాటు కంకుడుకాయల రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇది నేచురల్ హెయిర్ డ్రయ్యర్ గా పనిచేస్తుంది. అన్ని రకాల హెయిర్ డైలకన్నా ఇది చాలా ఉత్తమమైనది. ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాయపొడి మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరల రెండు-మూడు గంటలు నానబెట్టాలి. తరవాత మన జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

జుట్టు రాలడం తగ్గిస్తుంది:
కుంకుడుకాలను మెత్తగా పేస్ట్ చేసి, నీళ్ళలో కలిపి నురుగ్గా వచ్చే వరకూ కలిపి తర్వాత షాంపులాగా తలకు వాడాలి. ఇలా చేస్తుంటే తలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తొలగిపోయి, జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు.



Click it and Unblock the Notifications