For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి అమ్మాయి తెలుసుకోవలసిన 5 లాంగ్ హెయిర్ కేర్ టిప్స్

|

పొడవాటి శిరోజాలపై శ్రద్ధ కనబరచడం అత్యంత సులభం కానే కాదు. జుట్టును ఆరోగ్యంగా అలాగే బలంగా ఉంచుకోవటం కోసం కేవలం షాంపూ మరియు కండిషనింగ్ సరిపోదు. వీటితో పాటు మరెంతో శ్రద్ధను కనబరచాలి. స్ప్లిట్ ఎండ్స్ ను ట్రిమ్ చేయడం, సెరమ్స్ తో పాటు హెయిర్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం, హెయిర్ ఆయిల్ ను అప్లై చేయడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలి.

జుట్టు ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టే. హెయిర్ ట్రీట్మెంట్ కోసం ఎంతో డబ్బును ఖర్చు చేసే మహిళలున్నారు. వీరంతా ఆరోగ్యకరమైన జుట్టును పొందాలన్న భావనలో ఉన్నారు. నిజమే కదా మరి. శిరోజాలు అందంగా, దృఢంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు.

5 Long Hair Tips Every Girl Should Know About

కేరాటిన్ అనే ప్రోటీన్ శిరోజాల ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ప్రోటీన్ ను ప్రతి రోజూ ఆహారం ద్వారా తీసుకుంటే హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది. రెడ్ మీట్, ఆకుపచ్చని ఆకుకూరలు, చిక్ పీస్, సోయా బీన్స్, నట్స్, సెరల్స్, లెంటిల్స్ లో ఈ ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది.

కాబట్టి, ఈ పదార్థాలలోంచి రోజూ ఎదో ఒక పదార్థాన్ని మీ మీల్ లో భాగంగా చేసుకోండి. ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ లను కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఎగ్స్ లో విటమిన్ ఏ, ఈ మరియు డీ విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి.

కాబట్టి, సులభంగా హోమ్ మేడ్ ఎగ్ హెయిర్ మాస్క్ ను క్యాస్టర్ లేదా ఆలివ్ ఆయిల్ తో ప్రిపేర్ చేసుకోండి. ఈ అద్భుతమైన నూనెలో హెయిర్ గ్రోత్ కు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

కాబట్టి, ఈ రోజు పొడవాటి శిరోజాలు కలిగిన అమ్మాయిలు పాటించవలసిన అయిదు ఉపయోగకరమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. స్ప్లిట్ ఎండ్స్ ను ట్రిమ్ చేసుకోవడం:

1. స్ప్లిట్ ఎండ్స్ ను ట్రిమ్ చేసుకోవడం:

స్ప్లిట్ ఎండ్స్ వలన హెయిర్ అనేది పొడిగా, రఫ్ గా మరి దెబ్బతింటుంది. కాబట్టి, హెయిర్ దృఢంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే మీరు స్ప్లిట్ ఎండ్స్ ను అప్పుడప్పుడూ ట్రిమ్ చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ అనేది వేడితో కూడిన స్టైలింగ్ టూల్స్ వలన ఎదురవవచ్చు. ఈ సమస్య వలన హెయిర్ బ్రేకేజ్ ఏర్పడుతుంది. జుట్టు చిట్లుతుంది. సెలూన్ లో నైనా లేదా ఇంట్లోనైనా స్ప్లిట్ ఎండ్స్ ను ట్రిమ్ చేసుకోండి. ఇంటివద్దే స్ప్లిట్ ఎండ్స్ ను సులభంగా ట్రిమ్ చేసుకోవచ్చు కూడా.

2. కోల్డ్ షవర్:

2. కోల్డ్ షవర్:

చన్నీటి స్నానం అనేది అందరికీ ఇష్టంగా ఉండకపోవచ్చు. కానీ, దీని వలన శిరోజాలు అనేక ప్రయోజనాలు పొందుతాయి. చన్నీటి స్నానమనేది హెయిర్ వాష్ కు తగినది. హెయిర్ ని చన్నీటితో వాష్ చేయడం వలన మాయిశ్చర్ అనేది హెయిర్ లో నిలిచి ఉంటుంది. స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అందువలన, జుట్టు పొడిబారుట అలాగే ఫ్రిజ్జీగా మారుట జరగదు. హెయిర్ లో మాయిశ్చర్ ట్రాప్ అవుతుంది కాబట్టి హెయిర్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది.

3. ప్రతి రోజూ షాంపూ చేయకండి:

3. ప్రతి రోజూ షాంపూ చేయకండి:

ఇది ఎంతో ముఖ్యమైన అంశం. ప్రతి రోజూ షాంపూ చేసుకోవటం వలన హెయిర్ లోని నేచురల్ ఆయిల్స్ అనేవి ఎండిపోతాయి. దాంతో, హెయిర్ అనేది పొడిబారుతుంది. ఈ నేచురల్ ఆయిల్స్ అనేవి హెయిర్ ను హైడ్రేటెడ్ గా అలాగే ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. కాబట్టి, హెయిర్ పై ఆయిల్ బిల్డ్ అప్ ని గమనించినప్పుడే షాంపూ చేసుకోండి. డ్రై షాంపూ లేదా నేచురల్ ప్రోడక్ట్స్ ని వాడవచ్చు. మెత్తటి రైస్ ఫ్లోర్ ని కూడా ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.

4. అలోవెరా ట్రీట్మెంట్:

4. అలోవెరా ట్రీట్మెంట్:

అలోవెరా వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చర్మంతో పాటు శిరోజాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సన్ బర్న్ ని ట్రీట్ చేయడానికి అలోవెరాను ఎక్కువగా వాడతారు. హెయిర్ పై అలోవెరాను అప్లై చేసినప్పుడు రక్తప్రసరణ మెరుగై హెయిర్ గ్రోత్ అనేది పెంపొందించబడుతుంది. అలోవెరా జెల్ ను షాంపూ చేసుకున్న తరువాత వాడండి. షాంపూ తరువాత అలోవెరా జెల్ ను హెయిర్ పై అప్లై చేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తరువాత ఆపిల్ సిడర్ వినేగార్ తో రిన్స్ చేయండి. ఇది హెయిర్ కు కాంతిని అందిస్తుంది. ఆపిల్ సిడర్ వినేగార్ ని అలాగే నీళ్లను 1:2 ప్రొపోర్షన్ తో తీసుకోండి.

5. కొబ్బరి పాలు:

5. కొబ్బరి పాలు:

ఎగ్ ను హెయిర్ మాస్క్ గా వాడేందుకు మీకు ఇష్టం లేకపోతే, ఇందుకు ఒక ప్రత్యామ్నాయం ఉంది. హెయిర్ ను కోకోనట్ మిల్క్ తో రిన్స్ చేయండి. కొబ్బరి పాలలో ఐరన్, పొటాషియం మరియు ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ హెయిర్ కు పోషణని అందిస్తాయి. అలాగే, శిరోజాలకు సహజ కాంతిని అద్దుతాయి. శిరోజాలు పట్టులా మృదువుగా మారతాయి. క్యాన్డ్ కోకోనట్ మిల్క్ ను కూడా వాడవచ్చు.

ఈ విధానాన్ని పాటించడం కోసం, ఒక కప్పుడు కోకోనట్ ఆయిల్ ను వెచ్చ చేయండి. మరీ వేడి చేయకండి. ఇప్పుడు వెచ్చటి కొబ్బరి పాలతో హెయిర్ పై మసాజ్ చేయండి. హెయిర్ రూట్స్ నుంచి టిప్స్ వరకు మసాజ్ చేయండి. ఈ మిల్క్ ను హెయిర్ పై ఒక గంట పాటు ఉండనివ్వండి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో హెయిర్ ను వాష్ చేయండి.

లేదా సమాన నిష్పత్తిలో కొబ్బరి నూనెను అలాగే కొబ్బరి పాలను ఒక పాత్రలోకి తీసుకోండి. ఈ రెండు పదార్థాలను వెచ్చగా చేయండి. ఈ మిశ్రమంతో హెయిర్ పై మసాజ్ చేయండి. గంట తరువాత హెయిర్ ను వాష్ చేయండి.

ఈ ఆయిల్ మరియు మిల్క్ రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. శిరోజాలకు చక్కటి పోషణను అందిస్తుంది.

పొడవైన శిరోజాలను చక్కగా సంరక్షించుకోవడానికి ఈ సింపుల్ మరియు బేసిక్ ట్రిక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపతాయి. కాబట్టి, లేడీస్ మరి ఈ చిట్కాలను పాటించి మీ పొడవాటి శిరోజాల అందాన్ని రెట్టింపు చేసుకుంటారు కదూ?

English summary

5 Long Hair Tips Every Girl Should Know About

There are various things that need to be taken care of like trimming split ends, applying serums and hair moisturizer, applying hair oil, etc. Having healthy hair is the sign of your overall health. Red meat, green leafy vegetables, chickpeas, soyabeans, nuts, cereals, lentils, etc., contain a good source of protein, which are very good for your hair.
Story first published: Wednesday, July 4, 2018, 14:36 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more