For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోమ్ రెమెడీస్ తో ఫ్రిజ్జీ హెయిర్ కు వీడ్కోలు పలకండి

|

డల్ మరియు ఫ్రిజ్జీ హెయిర్ అనేది మగువలకు పీడకల వంటిది. స్మూత్, సిల్కీ మరియు హెల్తీ హెయిర్ ని ప్రతి మగువా కోరుకుంటుంది. నిజానికి మగువల అందాన్ని మరింత రెట్టింపు చేసేది కేశసౌందర్యమే కదా. అటువంటి శిరోజాలకు ఏమైనా సమస్యలు తలెత్తితే మగువలకు మనశ్శాంతి లోపిస్తుంది.

అయితే, కెమికల్ హెయిర్ ట్రీట్మెంట్, పొల్యూషన్ వంటి పర్యావరణ కారకాలు అలాగే ఎండలో ఎక్కువ సేపు ఉండటం వంటి వివిధ కారణాల వలన శిరోజాల సౌందర్యం దెబ్బతిని శిరోజాలు డల్ గా అలాగే ఫ్రిజ్జీగా మారతాయి. చాలా మంది భారతీయ మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. సరైన జాగ్రత్తలు తీసుకొని కొన్ని రెమెడీస్ ను పాటించడం ద్వారా ఈ సమస్యను తొలగించుకోవచ్చు.

సరైన హెయిర్ కేర్ రొటీను ను అనుసరిస్తే మీ హెయిర్ కూడా సాఫ్ట్ గా, సిల్కీగా మరియు ఒత్తుగా తయారవుతుంది. సరైన రెమెడీస్ కోసం ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు. కేవలం మీ కిచెన్ ను పరిశీలిస్తే సరిపోతుంది.

Bid Adieu To Frizzy Hair With These Home Remedies

కెమికల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ హెయిర్ ను స్మూత్ గా మార్చకుండా హెయిర్ ను మరింత రఫ్ గా మారుస్తాయి. ఇవి ఎక్స్పెన్సివ్ అలాగే హార్మ్ ఫుల్ కూడా. వీటి బదులు, సహజసిద్ధమైన హోమ్ రెమెడీస్ ను పాటిస్తే శిరోజాల అందాన్ని అలాగే వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కొన్ని న్యాచురల్ ఇంగ్రిడియెంట్స్ ను వాడటం ద్వారా ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ రెమెడీస్ ను ఇంటివద్దే సులభంగా పాటించవచ్చు.

1. బీర్:

1. బీర్:

బీర్ లో శిరోజాలకు పోషణనిచ్చే గుణాలు కలవు. హెయిర్ కి ఇది నేచురల్ టానిక్ గా పనిచేస్తుంది. హెయిర్ ని సాఫ్ట్ చేసి వాల్యూమ్ ని అందిస్తుంది. రెగ్యులర్ గా వాడితే మంచి ఫలితం లభిస్తుంది.

రెగ్యులర్ షాంపూతో మీ హెయిర్ ను వాష్ చేయండి. మీ హెయిర్ ను బీర్ తో మొదళ్ళనుంచి చివర్ల వరకు సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయండి. ఆ తరువాత 5 నుంచి పది నిమిషాల వరకు శిరోజాలను ఆలా వదిలేయండి. ఆ తరువాత సాధారణ నీటితో శిరోజాలను రిన్స్ చేయండి. ఈ రెమెడీని వారానికి ఒక సారి కొన్ని వారాల పాటు పాటించి మంచి ఫలితం పొందండి.

2. మయోన్నైస్:

2. మయోన్నైస్:

మయోన్నైస్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్స్ వలన శిరోజాలు సాఫ్ట్ గా, స్మూత్ గా అలాగే హెల్తియర్ గా మారతాయి.

ఫ్రెష్ మయోన్నైస్ ను మీ హెయిర్ లెంత్ కు తగినంత తీసుకోండి. తడి జుట్టుపై మయోన్నైస్ ను అప్లై చేసి షవర్ క్యాప్ తో కవర్ చేయండి. దాదాపు ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తరువాత నార్మల్ వాటర్ మరియు మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి. ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి రిపీట్ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

3. ఆపిల్ సిడర్ వినేగార్:

3. ఆపిల్ సిడర్ వినేగార్:

ఆపిల్ సిడర్ వినేగార్ లో హెయిర్ ను మాయిశ్చర్ చేసే గుణాలు ఉన్నాయి. కండిషనర్ గా ఇది పనిచేస్తుంది. తద్వారా హెయిర్ స్మూత్ గా, సిల్కీ గా మరి హైడ్రేట్ అవుతుంది.

ఆపిల్ సిడర్ వినేగార్ ని అలాగే నీళ్లను సమాన పరిణామంలో తీసుకుని ఈ రెండిటినీ బాగా కలపండి. షాంపూ చేసుకున్న తరువాత ఈ మిక్శ్చర్ ను హెయిర్ పై అప్లై చేసి స్కాల్ప్ ను సున్నితంగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని చల్లటి నీటితో తొలగించండి.

4. అలోవెరా మరియు తేనె:

4. అలోవెరా మరియు తేనె:

ఈ ప్యాక్ వలన హెయిర్ ఇన్స్టెంట్ గా సాఫ్ట్ గా మారుతుంది. అలోవెరా కండిషనర్ లా పనిచేస్తుంది. తేనె అనేది హైడ్రేషన్ ను అందిస్తుంది.

తాజా అలోవెరా లీఫ్ ను కట్ చేసి జెల్ ను వెలికితీయండి. ఇందులో కాస్తంత తేనెను కలిపి బాగా మిక్స్ చేయండి. దీనిని హెయిర్ పై అప్లై చేస్తే హెయిర్ ఇన్స్టెంట్ గా సిల్కీగా మారుతుంది. అప్లై చేసిన తరువాత సాధారణ నీటితో హెయిర్ ను వాష్ చేయండి.

5. నెయ్యి:

5. నెయ్యి:

వంటకాల టేస్ట్ ను పెంచడంతో పాటు హెయిర్ ను కండిషన్ చేసి టెక్స్చర్ ను అలాగే మెరుపును పెంపొందించడానికి కూడా తేనె ఉపయోగకరంగా ఉంటుంది.

కరిగించిన నెయ్యిని హెయిర్ పై అప్లై చేసి స్కాల్ప్ ని మృదువుగా మసాజ్ చేయండి. ఆ తరువాత గంట పాటు నెయ్యిని స్కాల్ప్ పై ఉండనివ్వండి. గంట తరువాత హెయిర్ ను రిన్స్ చేయండి. రిన్స్ చేసేందుకు షాంపూ మరియు నార్మల్ వాటర్ ని ఉపయోగించండి. మీ హెయిర్ రఫ్ గా ఈ రెమెడీతో సాఫ్ట్ గా మారుతుంది.

6. కొబ్బరి నూనె:

6. కొబ్బరి నూనె:

హాట్ ఆయిల్ మసాజ్ తో హెయిర్ అనేది సాఫ్ట్ గా మారడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది.

కాస్తంత కొబ్బరి నూనెను వేడిచేసి స్కాల్ప్ పై ఆలాగే హెయిర్ పై అప్లై చేసి పదిహేను నిమిషాల వరకు మసాజ్ చేయాలి. ఆ తరువాత హాట్ టవల్ ని తలకు చుట్టుకుని ముప్పై నిమిషాలుండాలి. ముప్పై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ను వారానికి రెండు సార్లు రిపీట్ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

7. ఎగ్స్

7. ఎగ్స్

ఎగ్స్ వలన హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవడంతో పాటు శిరోజాలకు పోషణ లభిస్తుంది. ఎగ్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి.

కావాల్సిన పదార్థాలు:

1 హోల్ ఎగ్

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ తేనె

ఎలా వాడాలి:

ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మాస్క్ ను స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై అప్లై చేయాలి. ఆ తరువాత 30 నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అలాగే శిరోజాలపై నుంచి తొలగించకూడదు. షవర్ క్యాప్ తో హెయిర్ ను కవర్ చేయండి. హెయిర్ ను చల్లటి నీతితో అలాగే తేలికపాటి సల్ఫేట్ ఫ్రీ షాంపూతో వాష్ చేయాలి.

8.అరటిపండు:

8.అరటిపండు:

అరటిపండులో సహజసిద్ధమైన కొవ్వుతో పాటు మాయిశ్చర్ లభిస్తుంది. ఇది మీ హెయిర్ ను హైడ్రేట్ చేసి నరిష్ చేస్తుంది. ఒకటి లేదా రెండు బాగా పండిన అరటిపండ్లను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా తయారుచేసుకుని హెయిర్ కు అప్లై చేయండి. అరగంట తరువాత షాంపూ చేసుకోండి. ఈ అరటిపండు మాస్క్ ని వారానికి ఒకసారి వాడటం వలన మెరుగైన అలాగే వేగవంతమైన ఫలితాలను పొందవచ్చు.

English summary

Bid Adieu To Frizzy Hair With These Home Remedies

With the right hair care routine in place, your hair too can look soft, silky and luscious. And if you want to find the remedies, the answer to it lies in your very own kitchen.Instead of smoothening or going for other chemical treatments which are both harmful and expensive, you can try out natural home remedies that are cheap and more effective.Here are some natural ingredients with which you can attain a frizz-free mane, sitting back at home.
Story first published:Saturday, March 24, 2018, 13:20 [IST]
Desktop Bottom Promotion