స్మూత్ & సిల్కీ హెయిర్ కోసం, అరటితో చేసిన హెయిర్ కండీషనర్ను వాడండి !

మీ జుట్టును షాంపూతో శుభ్రంగా కడిగిన తరువాత మాత్రమే తలస్నానం పూర్తవుతుంది. షాంపు అనేది జుట్టు భాగంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న శ్లేష్మమును & ధూళి నుండి జుట్టును శుభ్రపరుస్తుంది, జుట్టు మూలాలలో మూసుకుపోయిన రంధ్రాలను తెరచి వాటికి కండీషనర్ ద్వారా పోషకాలను అందించి కాలుష్యానికి దూరంగా ఉంచుతుంది. ఇలాంటి ప్రక్రియ ద్వారా మీ జుట్టును బలోపేతం చేసి, జుట్టు చివరల ఏర్పడే పగుళ్లను నిరోధించి, జుట్టు నష్ట తీవ్రతను నిరోధిస్తుంది. ఈ కండీషనర్ జుట్టు పొడిదనాన్ని దూరంగా ఉంచి, కావల్సిన తేమను కలిగి ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.

హెయిర్ సెలూన్లో మీకు లభించే డీప్ కండీషనింగ్ ట్రీట్మెంట్స్ చాలా ఖరీదైనవి, (లేదా) షాపులలో లభించే కండీషనర్ల వంటి ప్యాక్డ్ ప్రొడక్ట్స్ను కొనుగోలు చేసినప్పుడు, వాటిలో గల రసాయనాల ఓవర్లోడ్ గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు. అంతేకాకుండా, ఈ కండిషనర్లు చాలావరకు మన శరీరంపై సహజంగా ఉత్పత్తి అయ్యే సహజ నూనెలను తొలగించగలవు. అందువల్ల, మీ జుట్టును సంరక్షించే కండిషనర్ను సహజ సిద్దమైన పదార్దాలతో మీ ఇంట్లోనే తయారు చేసుకోవటం వల్ల, జుట్టుకు అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందించగలిగే ఒక గొప్ప మార్గం.

DIY Banana Hair Conditioner For Smooth And Silky Hair

మీ ఇంట్లోనే సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ను తయారు చేసుకోగల వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాసంలో అరటితోనే హెయిర్ కండీషనర్ తయారు చేసుకోవడం వల్ల మీ జుట్టును సంరక్షించడంలో అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకుందాం.

అరటితో చేసిన హెయిర్ కండీషనర్ వల్ల కలిగే ప్రయోజనాలు :-

అరటితో చేసిన హెయిర్ కండీషనర్ వల్ల కలిగే ప్రయోజనాలు :-

• మీ జుట్టుకు అవసరమైన శక్తిని పునరుద్ధరిస్తుంది, అలానే మీ జుట్టును ప్రకాశించేలా చేసి, మీ జుట్టు బాగా ఎగిరి పడేలా చేస్తుంది.

• అరటి అనేది గొప్ప మాయిశ్చరైజర్ లక్షణాలను కలిగి ఉన్నందున మీ చర్మం లోతుగా చొచ్చుకుపోయి బాగా పనిచేస్తుంది.

• అరటిలో సహజసిద్ధంగా లభించే ఆయిల్స్ & విటమిన్లు A, E, C వంటివి మీ జుట్టుచివర్లు ఉన్నా పగుళ్లను నిరోదించి, జుట్టు పెరుగుదలకు, దాని స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

• ఇవి మీ జుట్టు పగుళ్లను నిరోధించి, మీ జుట్టు మూలాలను దృఢంగా చేస్తుంది.

• ఇలాంటి కండీషనర్ను తయారుచేయడం సరసమైనది & సరళమైనదిగా కూడా ఉంటుంది.

మీ ఇంట్లోనే అరటితో జుట్టు కండీషనర్ను తయారు చేయడం ఎలా?

ఇప్పుడు మీరు అరటితో జుట్టు కండీషనర్ను తయారుచేసుకోవడానికి తగినంత కారణాలున్నాయి, కాబట్టి ఇక్కడ మీరు 3 సులభమైన పద్ధతులలో మీ జుట్టు కండీషనర్ను తయారుచేసుకునే విధానాలు ఉన్నాయి. అవి,

రెసిపీ 1,

రెసిపీ 1,

కావలసిన పదార్థాలు :

• మీ జుట్టు పొడవును బట్టి బాగా పండిన 2 అరటి పళ్ళు

• 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

• 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె

• 2 టేబుల్ స్పూన్ల తేనె

• రోజ్ వాటర్ (కొన్ని చుక్కలు)

• 2 టేబుల్ స్పూన్ల పెరుగు

• 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు

తయారీ విధానం :

తయారీ విధానం :

• అరటి ముక్కలు, తేనె & ఇతర గుజ్జులను చేర్చండి (రోజ్ వాటర్ను మినహాయించి), ఈ పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేసి, మృదువైన పేస్ట్లా మారేవరకూ బాగా కలపాలి. మంచి సువాసన కోసం చివరిగా రోజ్వాటర్ జోడించండి.

• సాధారణ షాంపూతో మీరు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడు ఈ కండీషనర్ ఉపయోగించండి.

• ఈ అరటి కండీషనర్ను జుట్టు కుదుళ్ల నుంచి చివరల వరకు దువ్వెనతో మీ జుట్టుకు బాగా అప్లై చేయండి.

• మీ జుట్టును 30 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

• ఆ తర్వాత నీటితో మీ జుట్టు బాగా కడిగి, అరటి పూర్తిగా పోయే వరకూ బాగా కడగాలి.

• మీ జుట్టు కాస్త పొడిగా మారక మీ జుట్టూ సహజసిద్ధమైన అందాన్ని కలిగి, ఎగిరి పడే సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది.

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

ఇక్కడ అరటి అనేది మీ జుట్టుకు కండిషనర్గా పనిచేస్తుంది, తేనే మీ జుట్టుకు తేమను కలిగి ఉండేలా చేస్తూ, హైడ్రేట్గా ఉంచడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరిపాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు & కొవ్వులు మీ జుట్టు పరిమాణాన్ని పెంచి, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ కండిషనర్ లో ఉండే కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ మీ జుట్టును కాంతివంతంగా మారుస్తాయి. రోజ్ వాటర్ మీ కండిషనర్కు ఆహ్లాదకరమైన సువాసనను జతచేస్తుంది.

రెసిపీ 2

రెసిపీ 2

కావలసిన పదార్థాలు :

• మీ జుట్టు పొడవును బట్టి బాగా పండిన 1 పెద్ద అరటి

• 2 టేబుల్ స్పూన్ల పెరుగు

• 2 టేబుల్ స్పూన్ల కాస్టర్ ఆయిల్

• 1 టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం :

తయారీ విధానం :

• అరటి గుజ్జును సేకరించి, దానిని మెత్తని పేస్ట్లా చేయండి. దానికి ఇతర పదార్థాలను జతచేసి బాగా కలపండి.

• మీ చేతితో మీ జుట్టును సగానికి విడదీసి, జుట్టు కుదుళ్ల నుంచి చివరల వరకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

• షవర్ క్యాప్తో మీ జుట్టును కవర్ చేసి 30 - 40 నిముషాల వరకు బాగా ఆరేలా వదిలివేయండి.

• సాధారణ నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోండి.

• సమర్థవంతమైన ఫలితాలు కోసం కనీసం వారానికి ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఇది మీ జుట్టు పెరుగుదలకు దోహదపడి, దెబ్బతిన్న జుట్టును బాగుచేసి, మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

అరటి మీ జుట్టు పెరుగుదలకు దోహదపడే పరిస్థితులను ప్రోత్సహిస్తోంది, అలాగే జుట్టు పగిలిపోవడాన్ని & పొడిగా మారడాన్ని నిరోధిస్తుంది. కాస్టర్ ఆయిల్ మీ జుట్టుకు కావల్సిన పోషకాలను అందించి, మీ జుట్టు మూలాలను దృఢంగా చేస్తుంది. తేనె మీ జుట్టును మృదువుగా చేస్తుంది. పెరుగు నిర్జీవమైన జుట్టును ప్రకాశవంతంగా చేయుటలో చురుకైన పాత్రను పోషిస్తుంది.

రెసిపీ 3

రెసిపీ 3

కావలసిన పదార్థాలు: • బాగా పండిన 2 అరటిపండ్లు • ½ కప్పు సేంద్రీయ తేనె • ½ కప్పు ఆలివ్ నూనె

తయారీ విధానం :

తయారీ విధానం :

• అరటి గుజ్జును సేకరించి దానికి తేనెను కలిపి మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమానికి అదనంగా ఆలివ్ ఆయిల్ను జోడించాలి. (మాయిశ్చరైజర్ కోసం)

• ఇలా తయారైన మిశ్రమాన్ని, మీ జుట్టును పాయలుగా విడదీసి చేతితో కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి.

• షవర్ క్యాప్తో మీ జుట్టును కవర్ చేసి 20 నిముషాల వరకు బాగా ఆరేలా వదిలివేయండి.

• చివరిగా మీ జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కండీషనర్ ఎలా పనిచేస్తుంది?

తేనెలో ఉండే పాలీఫెనోల్స్ మీ జుట్టును దెబ్బతినకుండా రక్షించేదిగా ఉంటుంది. అంతేకాకుండా మీ జుట్టును మాయిశ్చరైజర్ను కలిగి ఉండేలా కూడా చేస్తుంది. ఆలివ్ నూనె మీ జుట్టు చిగుళ్లను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.

ఈ అరటితో చెయ్యబడిన జుట్టు కండీషనర్లలో దేన్నైనా మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు. ఇవి మీ పొడి & పెళుసైన జుట్టు కోసం అవసరమైన పోషకాలను అందించి మీ జుట్టును బలపరచుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతులలో ఎటువంటి హానికరమైన రసాయనాలకూ తావు లేకుండా, డబ్బును ఆదా చేస్తూ, మీ జుట్టును సులభంగా సంరక్షించుకునే పద్ధతులతో నవ యవ్వనమైనా, కాంతివంతమైన జుట్టును మీ సొంతం చేసుకోండి !

Story first published: Wednesday, May 9, 2018, 10:33 [IST]
Desktop Bottom Promotion