For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రిజ్జీ హెయిర్ ను సులభంగా ఇంట్లోనే టేమ్ చేయడం ఎలా?

|

మీ హెయిర్ అనేది ఫ్రిజ్జీగా కనిపిస్తూ అస్తవ్యస్తంగా ఉంటోందా? కమర్షియల్ గా లభ్యమయ్యే ఫ్రిజ్ ఫైటింగ్ హెయిర్ ప్రాడక్ట్స్ ని మీరు ప్రయత్నించారా?

పై ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం అవును అయితే, బోల్డ్ స్కై లోని ఈ ఆర్టికల్ ను చదవండి. ఇందులో, ఫ్రిజ్జీ హెయిర్ ను ఇన్స్టెంట్ గా టేమ్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన మార్గాలను వివరించాము.

ఈ మార్గాల గురించి మీకు తెలియచేసే ముందు, మీ హెయిర్ ఫ్రిజ్జీగా అలాగే అన్ మేనేజబుల్ గా ఎందుకు మారుతుందో ఇందులో కారణాలను వివరించాము. ఈ అన్నొయింగ్ హెయిర్ కండిషన్ కి దారితీసే వివిధ అంశాలను పరిశీలిస్తే తేమ లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతుందని తెలుస్తోంది.

మాయిశ్చర్ లాస్ వలన శిరోజాలు పొడిగా, చిట్లినట్టుగా అలాగే ఫ్రిజ్జీగా కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ, వివిధ హోమ్ రెమెడీస్ వలన మీ శిరోజాలు ఈ సమస్య నుంచి త్వరగా కోలుకుంటాయి.

ఈ రెమెడీస్ గురించి మరింత తెలుసుకుని ఫ్రిజ్జీ హెయిర్ ను ఇంట్లోనే టేమ్ చేసుకునే విధానం గురించి తెలుసుకుని ప్రయోజనం పొందండి.

1. గ్లిజరిన్:

1. గ్లిజరిన్:

గ్లిజరిన్ అనే యెమోలియెంట్ కు స్కాల్ప్ లోని మాయిశ్చర్ ని రిస్టోర్ చేసి చిట్లిపోయిన అలాగే ఫ్రిజ్జీ వెంట్రుకలకు మళ్ళీ మాములుగా చేసే సామర్థ్యం కలదు.

ఎలా వాడాలి:

నాలుగు లేదా ఐదు చుక్కల గ్లిజరిన్ ను మీ రెగ్యులర్ లీవ్ ఇన్ కండిషనర్ కి జోడించండి.

ఈ మిశ్రమాన్ని తడిజుట్టుపై అప్లై చేయండి.

కాసేపటి వరకు శిరోజాలపై ఈ మిశ్రమాన్ని అలాగే ఉండనిస్తే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ మీ సొంతమవుతుంది.

2. ఆపిల్ సిడర్ వినేగార్:

2. ఆపిల్ సిడర్ వినేగార్:

స్కాల్ప్ లోని పి హెచ్ బాలన్స్ ని మెయింటైన్ చేయడానికి అలాగే హెయిర్ ను ఫ్రిజ్ ఫ్రీ గా అలాగే మేనేజబుల్ గా ఉంచడానికి ఆపిల్ సిడర్ వినేగార్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా వాడాలి:

అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని నాలుగు లేదా అయిదు టేబుల్ స్పూన్ల నీటిలో కలపండి. అందులో, మూడు లేదా నాలుగు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించండి.

ఈ మిశ్రమాన్ని మీ శిరోజాలమూలాల నుంచి చివరి వరకు అప్లై చేయండి.

గోరువెచ్చటి నీటితో మీ శిరోజాలను శుభ్రపరచుకుంటే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ మీ సొంతమవుతుంది.

3. బీర్:

3. బీర్:

బీర్ లో మాల్ట్ మరియు హాప్స్ లభిస్తాయి. ఇవి ప్రోటీన్ రిచ్ కాంపౌండ్స్. వీటికి హెయిర్ కి పోషణనందించి ఫ్రిజ్జీనెస్ ను కంబాట్ చేసే సామర్థ్యం కలదు.

ఎలా వాడాలి:

గోరువెచ్చటి నీటితో మీ హెయిర్ ను తడిచేసుకోవాలి. ఆ తరువాత స్కాల్ప్ పై ఫ్లాట్ బీర్ ను పోయాలి.

నాలుగైదు నిమిషాల తరువాత, మీ హెయిర్ ను గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయాలి.

రెగ్యులర్ హెయిర్ కండిషనర్ ను అప్లై చేసుకోండి.

ఈ పద్దతిని పాటించి ఫ్రిజ్జీ హెయిర్ నుంచి తక్షణ ఉపశమనం పొందండి.

4. ఎగ్ వైట్:

4. ఎగ్ వైట్:

ఎగ్ వైట్ లో హెయిర్ బెనెఫిటింగ్ ప్రోటీన్ అధిక మొత్తంలో లభ్యమవుతుంది. ఇది స్కాల్ప్ లోని మాయిశ్చర్ ని రిస్టోర్ చేయడం ద్వారా ఫ్రిజ్జీ హెయిర్ ను టేమ్ చేయడానికి తోడ్పడుతుంది. అందువలన, ఫ్రిజ్జీ హెయిర్ ప్రాబ్లెమ్ నుంచి ఉపశమనం పొందే అద్భుత రెమెడీ ఇది.

ఎలా వాడాలి:

ఒక పాత్రలోకి ఎగ్ వైట్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేయండి.

20-25 నిమిషాలపాటు ఈ శిరోజాలపై అప్లై చేసిన ఈ ప్యాక్ ను సహజంగానే ఆరనివ్వండి.

ఈ పద్దతిని పాటించడం ద్వారా ఫ్రిజ్జీనెస్ ను హెయిర్ నుంచి తొలగించి హెయిర్ కు తగినంత పోషణని అందివ్వవచ్చు.

5. ఆలివ్ ఆయిల్:

5. ఆలివ్ ఆయిల్:

ఈ నేచురల్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. శిరోజాలలోని మాయిశ్చర్ లెవెల్ ని బూస్ట్ చేసేందుకు తద్వారా ఫ్రిజ్జీ హెయిర్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది.

ఎలా వాడాలి:

మీ స్కాల్ప్ పై వెచ్చటి ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తూ వెంట్రుకలన్నిటికీ ఈ ఆయిల్ ని పట్టించండి.

10-15 నిమిషాల వరకు ఈ ఆయిల్ ని మీ శిరోజాలపై ఉండనివండి. ఆ తరువాత రెగ్యులర్ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి.

తేలికపాటి కండీషర్ ని అప్లై చేయడం ద్వారా శిరోజాలకు తగినంత తేమ అంది ఫ్రిజ్జీ హెయిర్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

6. మయోన్నైస్:

6. మయోన్నైస్:

ఇది ప్రోటీన్స్ కి నిలయం. అందువలన, హెయిర్ కు డీప్ నరిష్మెంట్ లభిస్తుంది. కేవలం కొన్ని నిమిషాలలోనే ఫ్రిజ్జ్జీ హెయిర్ సమస్య మాయమవుతుంది.

ఎలా వాడాలి:

మయోన్నైస్ ని స్కాల్ప్ అంతటికీ పట్టించాలి. ఫ్రిజ్జీ హెయిర్ సమస్యగా ఉన్న ప్రాంతంలో కూడా మయోన్నైస్ ను అప్లై చేయాలి.

15 నిమిషాల పాటు మయోన్నైస్ ని స్కాల్ప్ పై ఉండనివ్వాలి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను రిన్స్ చేయడం ద్వారా ఫ్రిజ్జీనెస్ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

7. అలోవెరా జెల్:

7. అలోవెరా జెల్:

అలోవెరాలోనున్న సూతింగ్ ఎబిలిటీస్ వలన ఇది పొడిబారిన ఆలాగే చిట్లిపోయిన హెయిర్ కు సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. తద్వారా, ఫ్రిజ్జీనెస్ ను అరికడుతుంది.

ఎలా వాడాలి:

అలోవెరా ప్లాంట్ నుంచి తాజా జెల్ ను సేకరించండి.

దీనిని స్కాల్ప్ పై అప్లై చేయండి. అలాగే, వెంట్రుకలకు కూడా బాగా పట్టించండి.

15-20 నిమిషాల వరకు ఈ జెల్ ను శిరోజాలపై అలాగే స్కాల్ప్ పై ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి.

తక్షణ ఉపశమనం పొందేందుకు ఈ హోంరెమెడీ ని పాటించండి.

8. షీ బటర్:

8. షీ బటర్:

నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేసే షీ బటర్ అనేది ఫ్రిజ్జీ హెయిర్ సమస్యను తొలగించే మరొక సమర్థవంతమైన పదార్థం.

ఎలా వాడాలి:

హెయిర్ పై షీ బటర్ ను అప్లై చేయండి. స్కాల్ప్ పై కూడా ఈ పదార్థంతో మసాజ్ చేయండి.

15-20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని తలపై ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను వాష్ చేసుకోండి.

ఈ రెమెడీ ద్వారా ఫ్రిజ్జీ హెయిర్ సమస్య తొలగిపోయి హెయిర్ టెక్స్చర్ అనేది మృదువుగా మారుతుంది.

English summary

Here’s How You Can Tame Frizzy Hair Instantly At Home

While there are a variety of factors that can lead to frizzy hair condition, the most common one is moisture deficiency.Loss of moisture can make your mane appear dry, brittle and frizzy. Fortunately, there are various at-home remedies that can take your hair from drab to fab within a few minutes.Read on to know more about these remedies that can
Story first published:Friday, February 16, 2018, 16:32 [IST]
Desktop Bottom Promotion