For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెట్ డాండ్రఫ్ అంటే ఏంటి? ఈ సమస్య నుంచి విముక్తి పొందడమెలా?

|

డాండ్రఫ్ అనేది అత్యంత సాధారణమైన హెయిర్ ప్రాబ్లెమ్. ఈ సమస్యతో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, సరైన హెయిర్ కేర్ ను తీసుకుంటే డాండ్రఫ్ ను అరికట్టవచ్చు. అలాగే, తగిన చికిత్సలను కూడా తీసుకోవడం ముఖ్యం. ఆ విధంగా డాండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, డాండ్రఫ్ పై పోరాడే పద్దతులను ఆచరణలోకి పెట్టేముందు అసలీ డాండ్రఫ్ సమస్యకు దారితీసిన అంశాలేంటో మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

డాండ్రఫ్ ఫ్లెక్స్ అనేవి రెండు రకాలు. ఒకటి డ్రై డాండ్రఫ్ మరొకటి వెట్ డాండ్రఫ్ (ఆయిలీ డాండ్రఫ్). డ్రై టైప్ అనేది ఆయిలీ లేదా వెట్ డాండ్రఫ్ కంటే తక్కువ తీవ్రత కలిగినది. ఇందులో, ఇచింగ్ తో పాటు ఫ్లేకింగ్ అనేవి సాధారణ లక్షణాలు. అయితే, డ్రై డాండ్రఫ్ అనేది హెయిర్ నుంచి కిందకి పడిపోతూ ఉంటుంది.

Wet dandruff and tips to get rid of this condition

అటువంటి డాండ్రఫ్ ఫ్లేక్స్ ని తొలగించుకునేందుకు సరైన ఆయిల్ ట్రీట్మెంట్ ను తీసుకోవడం ముఖ్యం. సరైన ట్రీట్మెంట్స్ ను తీసుకోవడం ద్వారా ముందు ముందు డాండ్రఫ్ సమస్య ఎదురవకుండా నివారించవచ్చు. ఒకవేళ మీరు వెట్ డాండ్రఫ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మీరు మరి కాస్త అదనంగా శ్రద్ధ కనబరచవలసి వస్తుంది.

వెట్ డాండ్రఫ్ కు సంబంధించిన కారణాలు, చికిత్స అలాగే నివారణ విధానం:

వెట్ డాండ్రఫ్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయం

వెట్ డాండ్రఫ్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయం

వెట్ డాండ్రఫ్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయం తెలుసుకున్న మరుక్షణం మీరు కఠినమైన షాంపూలను అంటే "యాంటీ డాండ్రఫ్" అనే ట్యాగ్స్ కలిగిన వాటిని వాడటం మానుకోవాలి. ఇవి, మీకు సరైన ఛాయస్ కావు. అటువంటి షాంపూలలో కఠినమైన కెమికల్స్ ని వాడతారు. ఈ క్లీన్సింగ్ ఏజెంట్స్ అనేవి స్కాల్ప్ పై మరిన్ని సమస్యలను పెంచే ప్రమాదం ఉంది. తద్వారా, శిరోజాల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది.

కాబట్టి, హెర్బల్ లేదా ఆర్గానిక్ నేచర్ కలిగిన తేలికపాటి షాంపూలను వాడటం ఉత్తమం. ఇవి, సమర్థవంతమైన హెయిర్ క్లీన్సర్ లా పనిచేసి మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ స్కాల్ప్ కి అలాగే హెయిర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. ఈ విషయాన్ని హెయిర్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు.

షాంపూ చేసుకోగానే మంచి బ్రష్ తో తలను మసాజ్ చేసుకోవాలి.

షాంపూ చేసుకోగానే మంచి బ్రష్ తో తలను మసాజ్ చేసుకోవాలి.

దుమ్ము, నూనెతో పాటు హెయిర్ పై నున్న స్టికీ డాండ్రఫ్ వలన స్కాల్ప్ అనేది విపరీతంగా దురదపెట్టవచ్చు. స్కాల్ప్ ని అలాగే హెయిర్ ను వాష్ చేయడం వలన పేరుకుపోయిన దుమ్ము, ధూళి మరియు నూనె వంటివి తొలగిపోతాయి. స్కాల్ప్ ని శుభ్రంగా ఉంచుకోవడం వలన డాండ్రఫ్ తో పాటు ఇన్ఫెక్షన్స్, దురద వంటి లక్షణాలు కూడా దూరంగా ఉంటాయి.

షాంపూ చేసుకోగానే మంచి బ్రష్ తో తలను మసాజ్ చేసుకోవాలి. బ్రష్ తో ఇలా మసాజ్ చేయడం వలన స్కాల్ప్ కి రక్తప్రసరణ సజావుగా అందుతుంది. తద్వారా, క్లీన్సింగ్ అనేది సులభంగా జరుగుతుంది. షాంపూతో సంబంధం లేకుండా సాధారణ రోజుల్లో కూడా హెయిర్ ను దువ్వడం ద్వారా కూడా పాజిటివ్ రిజల్స్ట్స్ ను పొందవచ్చు.

హెయిర్ ని వాష్ చేసిన ప్రతీసారి

హెయిర్ ని వాష్ చేసిన ప్రతీసారి

హెయిర్ ని వాష్ చేసిన ప్రతీసారి హెయిర్ ని పూర్తిగా రిన్స్ చేయడం మంచిది. హెయిర్ డ్రయర్స్ లేదా హెయిర్ స్ప్రేస్ ను ఎక్కువగా వాడటం వలన హెయిర్ కు మరింత హాని కలిగే ప్రమాదం ఉంది. హెయిర్ స్ప్రేస్ వలన స్కాల్ప్ లోని పోర్స్ క్లాగ్ అవుతాయి. మరోవైపు హెయిర్ డ్రైయర్స్ డ్రైనెస్ ని కలిగిస్తాయి. ఇవన్నీ, ఇప్పటికే ఉన్న డాండ్రఫ్ సమస్యను మరింత పెంచుతాయి.

మీ స్కాల్ప్ సడన్ గా ఎక్స్ట్రా ఆయిలీగా అలాగే గ్రీజీగా మారినా

మీ స్కాల్ప్ సడన్ గా ఎక్స్ట్రా ఆయిలీగా అలాగే గ్రీజీగా మారినా

మీ స్కాల్ప్ సడన్ గా ఎక్స్ట్రా ఆయిలీగా అలాగే గ్రీజీగా మారినా ఇది మీరు ఇటీవల వాడిన హెయిర్ ప్రోడక్ట్స్ వలన కలిగిన సమస్యగా గుర్తించాలి. హెవీ కండిషనర్స్ లేదా ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ షాంపూస్ అనేవి దట్టమైన పదార్థాలని స్కాల్ప్ పై ఉంచుతాయి. దీని వలన స్కాల్ప్ అనేది ఇదివరకటి కంటే ఆయిలీగా మారుతుంది. అందువలన, అటువంటి ప్రోడక్ట్స్ ని అతిగా వాడటం మానుకోవడం మంచిది.

అలాగే, మీరు హెల్తీ లైఫ్ స్టయిల్ ను పాటించాలి. హెల్తీ లైఫ్ స్టయిల్ వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. డాండ్రఫ్ సమస్యను తొలగించుకునేందుకు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ తోడ్పడుతుంది. సరైన ఆహారాన్ని తీసుకుంటూ తగినన్ని ద్రవాలను తీసుకోవాలి. నీళ్లను తగినన్ని తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. వీటివలన, హెయిర్ కు తగినంత పోషణ లభిస్తుంది. అలాగే, శరీరంలోని అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. ఈ విధంగా, వెట్ డాండ్రఫ్ సమస్యను కొంతవరకు తొలగించుకోవచ్చు.

స్కాల్ప్ లో అసాధారణ ఫ్లేకింగ్ లేదా దురద ఏర్పడితే ఇది

స్కాల్ప్ లో అసాధారణ ఫ్లేకింగ్ లేదా దురద ఏర్పడితే ఇది

స్కాల్ప్ లో అసాధారణ ఫ్లేకింగ్ లేదా దురద ఏర్పడితే ఇది వెట్ డాండ్రఫ్ వలన కలిగే లక్షణంగా భావించి తక్షణమే పరిష్కారాన్ని చూసుకోండి. లేదంటే, ఈ డాండ్రఫ్ కండిషన్ ఎక్కువకాలం కొనసాగి మరిన్ని సీరియస్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కి దారితీసే ప్రమాదం ఉంది. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. తలతో పాటు హెయిర్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే డాండ్రఫ్ సమస్యలు దరిచేరవు. రెగ్యులర్ గా హెయిర్ ను స్కాల్ప్ ను శుభ్రపరచుకుంటూ ఉంటే ఇటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు.

English summary

Wet dandruff and tips to get rid of this condition

Wet dandruff and tips to get rid of this condition,Do you suffer from dandruff problems? Taking proper care of your hair and effective home remedies can help you get rid of this problem. Read on to know more.
Story first published:Wednesday, May 2, 2018, 13:19 [IST]
Desktop Bottom Promotion