Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
కొనే ముందు శ్రద్ద పెడితే మంచివే ఎంపిక చేసుకోవచ్చు...!

1. షాపుకి వెళ్లే ముందే ఎలాంటి చెప్పులు లేదా షూ కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకుని వెళ్లండి. ఫంక్షన్లకు, పార్టీలకు అనువైనవా? లేదా రోజూవారీ ఉపయోగనికా? అన్నది ముందే నిర్ణయించుకోవాలి.
2. బ్రాండెడ్ వెరైటీలు మన్నికకు పేరెన్నికగన్నవి. అయితే వీటి ఖరీదు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఖరీదును, నాణ్యతను పోల్చి చూడకుండా నాణ్యతకే మొగ్గు చూపండి
3. ఇప్పుడు మీల్స్ ఫ్యాషన్. మరీ ఎత్తు ఎక్కువ ఉంటే నడవడానికి ఇబ్బంది. ఆరోగ్యానికి హానికరం. ఒకటిన్నర అంగుళం కన్నా హీల్ ఎత్తు ఎక్కువ ఉండకూడదు.
4. పెన్సిల్ హీల్ అని వస్తోంది. ఇవి చూడడానికి అందంగా ఉన్నా వేసుకోవడానికి సౌకర్యంగా వుండవు. చెప్పుల అడుగు భాగం మొత్తం హీల్ వుండేవాటినే ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వలన నడం నొప్పి బాధ వుండదు.
5. చెప్పులు వేసుకుంటే తేలికగా ఉండేవే మంచివి. బరువుగా వున్న చెప్పులు లేదా షూస్ ను ఎప్పుడూ ఎంపిక చేసుకోకూడదు.
6. మొత్తగా ఉన్న చెప్పులే నడవడానికి అనుకూలంగా వుంటాయి.
7. చెప్పులు రెండు మూడు రంగులలోనే వుంటాయి. కాబట్టి వాటిల్లో ఎరుపు లేదా నలుపు రంగులు బాగా మన్నుతాయి. తెలుపు రంగు చెప్పు చూడడానికి అందంగా వున్నా త్వరగా మాసిపోయి రంగు వెలిసిపోయినట్లు వుంటాయి.
8. రాబోయేది వర్షాకాలం. ఈ కాలానికి అనువైన వాటినే ఎంచుకోండి. వర్షాకాలానికి ప్రత్యేకంగా కొన్ని వెరైటీలను ఉప్పత్తి దారులు మార్కెట్ లోకి విడుదల చేస్తూ వుంటారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేయాలి.
9. అలాగే మీ బరువుకి, ఎత్తుకి సరిపడ వాటినే ఎంపిక చేసుకోవాలి.
10 వర్షాకాలం పాదం పూర్తిగా కవర్ చేస్తూ వుండే చెప్పులు లేదా షూస్ అంత అనువుగా వుండవు. నీటిలో నడిచేటప్పుడు నీరు లోపలికి పోయి అపౌకర్యం కలిగిస్తాయి.
11. కాలి మడమలు షార్ప్ గా ఉన్నట్టయితే, ముందు భాగం పొడవుగా కోసుగా ఉండే చెప్పులు లేదా షూస్ అస్సలు బాగుండవు.
12. కొన్ని చెప్పులు లేదా షూస్ కాలి వేళ్ళను పూర్తిగా కవర్ చేయకుండా మధ్యలో వుండే రెండు మూడు వేళ్లు కవర్ చేస్తూ వుండే వెరైటీలు వుంటాయి. వీటి వలన కాలివేళ్ళ గోళ్ళు దెబ్బ తినే అవకాశం వుంది.
13. కొద్దిగా రఫ్ గా వుండే వారికి వెనుకవైపు ఓపెన్ గా వుండే షూస్ అస్సలు నప్పవు. పాదం ముందు భాగం ఓపెన్ గా ఉన్నా, వెనుక క్లోజ్ అయిన వాటినే ఎంపిక చేసుకోవాలి.
14. చెప్పులు లేదా షూస్ మరీ బిగుతుగా వుండే వాటిని ఎంపిక చేసుకోరాదు. కొద్దిగా వదులుగా వుంటేనే సౌకర్యంగా వుంటాయి. అలా అని మీర వదులుగా వున్నా చూడటానికి అందంగా వుండదు.
15. పాదరక్షలు కొన్న తరువాత షాపులోనే వాటిని వేసుకుని చూడటంతో సరిపెట్టుకోకుండా ఒకటికి రెండు సార్లు అటూ ఇటూ నడిస్తే అవి సరిపోతాయా? లేదా? అన్నది వెంటనే తెలుస్తుంది. ఏ రకాన్ని ఎంపిక చేసుకున్నా పాదం అందంగా కనబడేటట్టుగా వుండాలి.



Click it and Unblock the Notifications
