Latest Updates
-
ఆఫీసులో గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా.. స్లిప్ డిస్క్‌తో వెన్నెముకకి ముప్పు తప్పదు.! -
ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. ఆగష్టులో ఈ రాశుల వారికి అన్నింటా రాజయోగమే.! -
చైనీస్ రుచి, ఇండియన్ ఘాటు..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చిల్లీ పనీర్ చేసుకోండిలా.. -
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే.. -
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా..
ఆకృతిని బట్టే అందం..అని అనుకొంటే ఎలా....?

సాధారణంగా కొంతమంది ఇతరులతో పోల్చుకొని ఎత్తు తక్కువగా ఉన్నామని బాధపడుతుంటారు కొందరు. ఇలా ఎత్తు తక్కువని భావించే వాళ్ళు పై నుచి క్రింది వరకూ ఒకే రంగు ఉన్న దుస్తులు ధరించడం వల్ల చూడ్డానికి పొడవుగా కనిపిస్తారు. వీలైతే స్కార్స్, బెల్ట్ లాంటి వాటిని ఒకే వర్ణంలో ఉండేలా ఎంచుకోవడం వల్ల చక్కని ప్రయోజనం ఉంటుంది. ముదురు రంగులు ఈ విషయంలో బాగా పనిచేస్తాయి. నలుపు, నీలం, ముదురు ఆకుపచ్చు, ఊదారంగులు పొట్టిగా ఉన్నవాళ్ళు సన్నగా పొడవుగా కనబడేటట్లు చేస్తాయి. వదులుగా ఉండే దుస్తులకన్నా చక్కగా సరిపడేట్లు ఉండే వస్త్రాధారణే వీరికి బాగుంటుంది.
ఎత్తు పెంచే నిలువు గీతలు: బరువుగా ఉండే వస్త్రాల కన్నా తేలికగా ఉండే షిఫాన్, శాటిన్, క్రేప్, జార్జెట్ వంటి దుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. హంగామా చేసి భారీ ప్రింట్లు ఉండే దుస్తులు కూడా అంతగా అలరించవు. గీతలున్నటువంటి దుస్తులు అలంకరిచడానికి ఇష్టపడే వారు, నిలువుగీతలు ఉండే వాటిని వేసుకొంటే అవికాస్త ఎక్కువగా కనిపించేటట్లు చేస్తాయి. మెడ దగ్గర యూ షేప్ లో ఉండేలా నెక్ డిజైన్ పెట్టించుకొంటే సరిపోతుంది. బెల్టులు ధరించడానికి ఇష్టపడే వారు, ధరించిన దుస్తులతో సంబందం లేని రంగును ఎంచుకొంటే అది హీ ఆహార్యాన్ని రెండుగా విభజిస్తుంది. దాంతో పొట్టిగా ఉండేవారు ఇంకా ఇంకా పొట్టిగా కనిపిస్తారు. దుస్తుల రంగుల్లో కలిసిపోయే వాటినే ఎంచుకోవాలి.
పట్టీల్లేని హీల్స్.. చేతిలో క్లచ్ం అందంగా కనబడతాం అన్న ఉద్దేశంతో మినీ స్కర్టులు, వదులుగా ఉండే టీసర్టలు ఎంపిక చేసుకోవడం సరికాదు. బదులుగా పొడవాటి స్కార్ప్ లు, పూసల దండలు ధరిస్తే చూడచక్కగా కనిపించేస్తారు. ఎత్తుగా కనిపించాలనుకొనేవారికి ఎత్తు మడమలు చెప్పలు మంచి మార్గమే, కానీ మడమల దగ్గర స్టాప్స్ ఉన్న వాటిని ఎంచుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు.
ఎత్తు తగ్గి చూడక్కగా: ఉండాల్సిన పొడవు కంటే మరీ ఎక్కువగా ఉంటే అదో సమస్యలానే భావిస్తారు చాలామంది. ముఖ్యంగా భాగస్వామి కన్నా మరీ పొడవుగా కనిపిస్తే ఇబ్బందే. ఇది తొలగాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. సల్వార్లు, చుడీదార్లు, ప్యాంట్లు ఎవైనా సరే పైన్నుండి క్రిందివరకూ ఒకే రంగు లేకుండా విభిన్న రంగులు ఉండేట్టు చూసుకోవాలి. నూలు, బ్రొకేడ్ వంటివి ఎంచుకుంటే మంచిది. ప్యాంట్లు అడుగున కట్స్ ..అంటే కాస్త ప్యాంట్ మడత పెట్టి కుట్టించుకుంటే చక్కగా కనిపిస్తారు.
తీరైన ఆకృతికి లేత వర్ణాలు: ముదురు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మరింత పొడుగ్గా కనిపిస్తారని మరవకూడదు. అందుకే లేత, మద్యస్థ వర్ణాలనే ప్రయత్నించాలి. పొడగ్గా ఉన్నవారికి అడ్డగీతలు బాగా నప్పుతాయి. పెద్ద పెద్ద ప్రింట్లున్న దుస్తుల్ని నిర్బయంగా ధరించవచ్చు. ఎత్తుగా వున్నవారు ఎంచుకోదగిన మరో చక్కని వస్త్ర శేణి.. అలల్లా తేలియాడే దుస్తులు. కాబట్టి అప్పుడప్పుడు అలాంటి వాటిని ప్రయోగించవచ్చు. వీటితో పాటు జీన్స్ పొడగ్గా ఉన్నవారికి బాగా నప్పుతాయి. పైన ధరించే టాప్స్ కాలర్ ఉన్నవి ధరిస్తే అద్భుతంగా కనిపిస్తారు. భుజాలు తీరైన ఆకృతి ఉన్నట్లైతే బోట్ నెక్ టాప్స్ కూడా ఎంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications