Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
హెయిర్ స్టైల్ అంత ఫ్యాషన్ గాజుల్లో కనబడితే

చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా వెడల్పుగా వుండే సింగిల్ గాజు వేస్తేనే అందంగా వుంటుంది. రోజూ వేసుకునే కటింగ్స్ గాజు, గాజులకు వుండే మెరుపు కొన్ని రోజులకు పోతుంది. వాటిని వెంటనే మార్చేయాలి. లేకుంటే అందవికారంగా వుంటుంది. సాంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల రూపాల్లో గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమిమతైన మక్కువ. ఫ్యాషనబుల్ గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్ తో పాటు గాజుల గలగలలు తప్పనిసరి. గాజుల ఎంపికలోనూ, ధరించడంలోనూ కొన్ని ప్రత్యకతలు పాటించాలి.
1. ఫ్యాషనబుల్ గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్ ను మరొక చేతి వేలికి ధరించాలి.
2. చేతికి ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నుదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్ లో ఉండేట్టుగా వేసుకోవాలి.
3. 4-6 ఆరు గాజులు ఒక తరహాలో వేసుకొనేటప్పుడు వాటికి మరొకొన్ని భిన్నమైన గాజులను జోడించాలి.
4. వెండి, బంగారు ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగులు విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎక్కువగా నేచురల్ కలర్స్ ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా ఎక్కువగా అందుకుంటారు.
5. లెదర్, దారం, పూసలతో తయారు చేసిన బ్రేస్ లెట్స్ ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకుదూరంగా ఉండటం మంచిది.
6. గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణలోకి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
