Latest Updates
-
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
వీటితో అమ్మాయిలకు అదనపు ఆకర్షణ...!

నేటి ఆధునిక కాలంలో మహిళల హ్యండ్ బ్యాగ్ వాడకం చాలా పెరిగింది. అన్నిరకాల స్ధాయిల వారికి, చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ హ్యండ్ బ్యాగ్ కానీ, పర్సు కానీ వుండాలి. చేతిలో అవి వుంటే వారికి ఇక నిశ్చింత. హ్యాండ్ బ్యాగ్ చేతిలో వుంటే ఒక తోడు వుందన్న అనుభూతి కలుగుతుంది. సందర్భాన్ని బట్టి మనం ధరించే బ్యాగ్ మన స్టైల్ స్టేట్మెంట్ నే మార్చేస్తుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. హ్యాండ్ బ్యాగులను సందర్భాన్ని బట్టి ఎత్తుకెళ్ళినప్పుడే ఆఫీస్ అయినా, ఫంక్షనయినా మీ చుట్టూ తిరుగుతుంది. మరి అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం....
1. పార్టీలకు, ఫంక్షన్స్‌కు తీసుకువెళ్ళడానికి నిత్యం వాడే బ్యాగ్ ను కాకుండా వేరేది కొనాలి. ముఖ్యంగా పెళ్లిళ్లు, పార్టీలు వంటి ప్రత్యేక సందర్బాలకు బ్రొకేడ్ క్లచ్ సరైన ఎంపిక. ఉదయం పూట పార్టీలాంటి వాటికి పెద్ద బ్యాగులు బాగుంటాయి. సాయంత్రమైతే మాత్రం క్లచ్ ను మించిన స్టైల్ లేదు..ఇవి అందరి మనస్సుల్ని దోచేస్తున్నాయి. వేసుకొనే డ్రెస్సులకు కరెక్ట్ మ్యాచింగ్ లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
2. కొంచెం ధర ఎక్కువైనా మంచి మెటీరియల్ తో తయారైన బ్యాగ్ లు కొనడం మంచిది. నిత్యవాడకానికి మంచి లెదర్ బ్యాగ్ లు అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు టిఫిన్ బాక్స్ తప్పనిసరి. కాబట్టి లెదర్ తో తయారు చేసిన నలుపు, గోధుమ రంగు బ్యాగ్ లను ఎంచుకోవాలి. అదీ కాస్త పెద్దవి అయితే మరీ మంచిది. అవసరమైన వస్తువులన్నింటినీ తీసుకెళ్లవచ్చు.
3. మీకు అవసరమైన సెల్ ఫోన్, ఫోన్ నెంబర్ల బుక్, మేకప్ సామాన్లు, పెన్స్, కర్చీఫ్, కీస్, బస్ పాస్, తలనొప్పి టాబ్ లెట్స్ మొదలైన వస్తువులన్నీ పెట్టుకోవడానికి సెపరేట్ అరలు వున్నాయో లేవో జాగ్రత్తగా పరిశీలించి తగిన డిజైన్ ఎంపిక చేసుకోవాలి.
4. బ్యాగుల్లో కూడా కాస్త మందంగా కనిపించేవి ఉంటాయి. ఎత్తు తక్కువగా ఉండి, లావుగా కనిపించే వారు సన్నటి బ్యాగుల్ని ప్రయత్నిస్తే బాగుంటుంది. పొడుగ్గా ఉన్నవారు గుండ్రని, ఆకృతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంట తీసుకెళ్తే బాగుంటుంది.
5. ధర ఎక్కువైనా మంచి మెటీరియల్ తో తయారైన బ్యాగ్ లు కొనడం మంచిది. నిత్యవాడకానికి మంచి లెదర్ బ్యాగ్ లు అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కొనడానికి పెద్ద షాపులను ఎంపిక చేసుకొంటే మనకు కావాల్సిన డిజైన్లలో దొరుకుతాయి. అలాగే బ్యాగ్స్ కొన్న తర్వాత బ్యాగ్ హ్యాండిల్స్ సరిగ్గా వున్నాయో లేదో లోపల లైనింగ్ క్లాత్ ఎలావుందో, బ్యాగ్ జిప్ లు, కుట్లు గట్టిగా వున్నాయో లేదో షాపులో వుండగానే పరిశీలించాలి.



Click it and Unblock the Notifications
