Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
మధ్య వయస్సులో ముడుతలను మరపించండిలా...!

ముప్పై అయిదేళ్లు దాటిన వారు పాన్ కేక్ లు వాడకపోవడమే మంచిది. కళ్ల అడుగున ముదురు చాయ ఉన్న పౌండేషన్ ను వాడకూడదు. అతిగా కాజల్, మస్కారా వేయకపోవడమే మంచిది. కంటి మేకప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే సహజంగా కనిపిస్తారు. బ్లషర్ లాంటివి వాడకపోవడమే మంచిది ఒకవేళ వాడాలనుకున్నా సహజ బ్రౌను లేదా బ్రాండ్ పౌడర్లను చాలా తక్కువగా వేసుకోవాలి. పెదవులకు ఎంచుకునే లిప్ స్టిక్ లు మీర ముదురు రంగులో లేకుండా చూసుకోవాలి. సహజ బ్రౌను, గులాబీ, మెరూన్ వంటివి బాగుంటాయి. తప్పనిసరిగా లిప్ పెన్సిల్ తో అవుట్ లైన్ గీసుకోవాలి.
పొడి చర్మం ప్రకాశించేలా: పొడిబారిన చర్మంతో బాధపడే వారికి వర్షాకాలంలో నీటి ఆధారిత, శీతాకాంలో లిక్విడ్ తరహా పౌండేషన్ క్కని ఎంపికవుతాయి. వీటిల్లో మాయిశ్చరైజర్ ఉంటుంది. క్రీ షౌండేషన్ లో అయితే అదనంగా విటమిన్ ‘ఇ’ సుగుణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందిస్తాయి. మరి మరీ పొడి బారిన చర్మం ఉన్నప్పుడు అలంకరణకి అరగంట ముందు మృదుత్వం కోసం మేకప్ సీరమ్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నల్లటి మచ్చలు, వలయాలు కనిపంచకుండా ఉండటానికి చాలా మంది లిక్విడ్, పౌడర్ రకాలకు చెందిన కన్సీలర్లు వాడతారు. నిజానికి అవి కాక, జెల్ లేదా క్రీ ఆధారిత రకాలను ఎంచుకోవాలి. వాడకానికీ ఓ పద్దతుంది.
మాయిశ్చరైజర్ వేసుకున్న అరగంటకు కన్సీలర్ ను మచ్చలు, వలయాలపై రాయాలి. ఒక చాల ముదురు రంగు తీసుకోవాలి. కన్సీలర్ రాసిన పది నిమిషాలకు పౌండేషన్ రాయాలి. ఈ లోగా అది సెట్ అయ్యి. చర్మం అంతా ఒకే రంగులో కనిపిస్తుంది. అవసరమైతే సమస్య ఉన్న చోటమరోసారి కన్సీలర్, పౌండేషన్ కొద్దిగా అద్దితే చర్మం రంగులోకి కలిసిపోతుంది. మేకప్ కు స్పాంజ్ వాడినా బొటన వేళ్లతో అంతటా వ్యాపించేలా రాయటమే మంచిది. చివరగా టిష్యూ కాగితంతో ముఖంపై అద్దుకున్నట్లు చేయాలి.
పెదవులు లేత గులాబీల్లా: మీర పొడిబారి, పగుళ్లు ఎక్కువగా ఉంటే, తీర్చిదిద్దుకునేందుకు అరగంట ముందు లిప్ బామ్ రాయాలి. అరగంటయ్యాక తుడిచేసుకుని పగుళ్లు ఎక్కువగా ఉన్న భాగాన్ని ఫౌండేషన్ తో అద్దుకోవాలి. ఆ తర్వాతే లిప్ స్టిక్ వేసుకోవాలి. మొత్తం పూర్తయ్యాక ఒక్క చుక్క లిప్ గ్లాస్ ను రాసుకుంటే పెదవులు మెరుస్తాయి. అంచులు స్పష్టంగా ఉండేందుకు లిప్ పెన్సిల్ తప్పనిసరి. కొంచెం ముదురు చాయలో లిప్ పెన్సిల్ సరైన ఎంపిక. ఆవునెయ్యి, విటమిన్ ఇ గ్లిజరిన్ వంటి పదార్థాలుంటే లిప్ బామ్ లను ఎంచుకోవాలి.
మెడ, చేతుల్ని మెరిపించేలా: మొదట ముదురు చాయలో పౌండేషన్ ను ఎంచుకుని అదే రంగులో పౌడర్ ను రాసుకోవాలి. చాలామందికి ముఖం కన్నా మెడ తెల్లగా ఉంటుంది. అందుకే ముదురు రంగు ఎంచుకోవాలి. చేతుల్లోనూ వార్థక్యపు చాయలు కనిపిస్తాయి. దాన్ని అదుపులో ఉంచాలంటే..చేతులుకు మాయిశ్చరైజర్ రాసి ముఖ చర్మా నికి నప్పే ఫౌండేషన్ ను పూతలా వేసుకోవాలి. వేళ్లకు వేస్తున్నప్పుడు అంతటా వ్యాపించేలా చూసుకోవాలి. చేతులకు ఎట్టి పరిస్థితుల్లో గ్లిట్టర్ పౌండేషన్ వాడకూడదు.
మొదట్నుంచీ జాగ్రత్తలు: నిత్యం మంచినీళ్లు బాగా తాగిలి. పెరుగు మజ్జిగ తాజా పండ్లు బాగా తీసుకవోాలి. మధుమేహం లేనివాళ్లు అరటిపండు తినొచ్చు. కొలెస్ట్రాల్ సమస్య లేకపోతే రోజూ రెండు చెంచాల నెయ్యి తింటే చర్మం మెరుస్తుంది. నిపుణుల సలహాతో విటమిన్ ‘ఇ’ క్యాప్యూల్’ ను రెండు నెలలు వాడితే చర్మం మృదువుగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్, సోయా సుగుణాలున్న నాణ్యమైన సన్ స్క్రీన్ ఉత్పత్తుల్ని ఎంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications