Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
అందమైన గోళ్ళుకు ఆకర్షణీయమైన కళ

బాడీ పెయింటింగ్ సరే, టాటూ ఇంకాస్త అట్రాక్షన్, నెయిల్ ఆర్ట్ మరింత డబుల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. రంగు, రంగుల బొమ్మలను కూడా గోళ్ళకు అలంకరించుకుని అందరినీ అలరించవచ్చు. గోళ్లకు ఉంగరాలు, ఇతర ఆర్టిఫిషియల్ అలంకరణ వస్తువుల కంటే గోళ్లపై ఆర్ట్ శోభాయమానంగా కనిపిస్తుంది. గోళ్లపై ఆర్ట్ గోరింటాకు వేసుకోవడం లాంటిదే. పింక్, పర్పుల్ రంగులతో వివిధ పుష్పాలను గోళ్లపై అలంకరించుకోవచ్చు. లేక కార్టూన్స్ వేసుకోవచ్చు.
సందర్భానుసారం నెయిల్ ఆర్ట్‌ను మార్చు కోవచ్చు. బర్త్‌డే, వెడింగ్ డే, పెళ్ళి, పార్టీ ఇలా పలురకాల సందర్భాలను బట్టి నెయిల్ ఆర్ట్ ను ఎంపిక చేసుకోవచ్చు.
గోళ్లపై ఆర్ట్ ను ఎవరికి వారే స్వయంగా ఇంటిలో చేసుకోవచ్చు. అందుకు వివిధ సైజుల బ్రష్‌లు, ఎక్రిలిక్ రంగులు, నెయిల్ పెయింట్స్ తెచ్చుకోవాలి.
గోళ్లపై ఆర్ట్ వేసే ముందుగా మేనిక్యూర్డ్ గోళ్లపై రెండు వరసల పాలిష్ వేయాలి. అభిరుచిని బట్టి రంగులతో డిజైన్ వేయాలి. నెయిల్ ఆర్ట్‌కి బజారులో ప్రత్యేకంగా పెన్నిళ్లు, పెన్నులూ, లభిస్తాయి. స్టికర్లు, మెరుపులు, కెంపులు, పుష్పాలు ఇలా అభిరుచిని అనుసరించి ఎంపిక చేసుకోవాలి.
నెయిల్ పాలిష్ వేసిన తర్వాత గోరు మధ్యలో నిలువుగా మరో రంగు పాలిష్ వేస్తే మరింత అందంగా ఉంటుంది. మార్కెట్లో రెడీమేడ్ నెయిల్స్ దొరుకుతున్నాయి. వాటిని గోరు చివర అంటించుకున్నా బాగుంటుంది.
నెయిల్ ఆర్ట్ తెలియని వారు రెడీమెడ్ డిజైన్లతో నెయిల్స్ మార్కెట్ లో లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసి అలంకరించుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్స్ మారుతున్నాయి. లైట్ బ్లూ, సీగ్రీన్, గ్రేమ్ కింగ్ షేడ్స్. కొందరు ఇష్టపడుచున్నారు. ఫ్లోరల్ డిజైన్స్‌కు కాలం చెల్లుతుంది. యానిమల్ ప్రింట్స్ జీబ్రా, చిరుత, జిరాఫీలను గోళ్ళపై చిత్రీకరించుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
