Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
వాలెంటైన్ డే కళ్ళు మేకప్ పై అవగాహన ఉందా...

మేకప్ వేసుకునే సమయంలో సాధారణంగా చేసే తప్పు, ఫౌండెషన్ ఎన్నిక. తెల్లగా ఉన్న వారు లైటర్ షేడ్ లను ఉపయోగించడం వల్ల మాస్క్ వేసుకున్నట్టుగా ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. సాధారణంగా ఫౌండెషన్లు పసుపు, పింక్ టోన్లలో దొరుకుతాయి. కనుక ఏది సరిపోతుంది అన్నది చేతిమీద రాసుకుని చూసుకుని ఎంచుకోవాలి. ఫౌండేషన్ కు తగ్గ పౌడర్ షేడ్ ను ఎంచుకోవాలి. సాధారణంగా కాంపాక్ట్ పౌడర్లలో కూడా రకరకాల షేడ్స్ దొరుకుతాయి. వాటిలో ఫౌండేషన్ కు సరిపోయే వాటిని ఎంచుకోవాలి.
కంటికి షేడ్స్ వేసుకుని వాటిని తీర్చి దిద్దుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు పెట్టుకునే కాటుక, ఐషేడ్ సవ్యంగా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా స్మోకీ ఎఫెక్ట్ కోసం చిన్న కళ్ళున్న వారు ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఆ ప్రయత్నం వారి కళ్ళను మరింత చిన్నగా కనిపించేలా చేస్తాయి మరి.
మేకప్ లో చివరగా వేసుకునే మస్కారా విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళే ముందు కనురెప్పలకు చక్కగా అంటేలా వేసుకోవాలి. అంతేకాని, గబగబా ఒక కోటింగ్ వేసుకుంటే దాని అందం అంతగా తెలియదు. మేకప్ వస్తువులు వాడేటప్పుడు ఖరీదు కొంచెం ఎక్కువైనా మంచి ఉత్పత్తులనే కొనుగోలు చేయడం మంచిది. అలాగే మేకప్ సామాగ్రిని ఎక్కువ కాలం దాచి వాడటం మంచిది కాదు.



Click it and Unblock the Notifications
