Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పింక్ కలర్ లిప్ స్టిక్స్ - వాలెంటైన్ స్పెషల్....
ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు.. ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసేందుకు మధనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలి మనసును దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు తెగ ఇదైపోతుంటాడు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విశిష్టరీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. పూలు, చాక్ లెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్. మరి నేటి ట్రెండ్ ఏమిటి? వారికి అందాన్ని బహుమతిగా ఇవ్వడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నేటి తరం కోరుకునే సరికొత్త కానుక సౌందర్యం.
యుక్తవయసులో ఉన్నవారైనా, మధ్య వయస్కులైనా మహిళలంతా కోరుకునేది అందం. అందులోనే వారికి ఆనందం.. ఆత్మవిశ్వాసం. ఏడాది పొడుగునా ప్రతి రోజూ అందంగా కన్పించాలని కోరుకోవడం సహజం. వాలంటైన్స్ డేలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రత్యేక అవసరం మరింత అధికమవుతుంది. ప్రేమికులు ఈ అవసరాన్ని గుర్తించారు. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. లోపాలను సవరిస్తూ సౌందర్యాన్ని పెంచే ఫిల్లర్స్, బొటాక్స్ లాంటి సౌందర్య చికిత్సను బహుమతిగా ఇవ్వడం ఈ వాలంటైన్స్ డే పోకడగా ఉంది. 'వ్యక్తిగత సౌందర్య పోషణ, ఆసక్తి పెరుగుతోంది. నాన్ సర్జికల్ కాస్మొటిక్ ప్రొసీజర్లపై మక్కువ అధికమవుతోంది. కొనుగోలు శక్తి, అదాయం అధికం కావడంతో ట్రీట్ మెంట్‌లను బహుమతిగా అందించడం మొదలైంది.
సౌందర్యవంతమైన ముఖానికి కళ్లు, చెక్కిళ్లు ఎంత అవసరమో పెదవులు కూడా అంతే అవసరం. ఆ పెదవులను అందంగా ఉంచుకోవడానికి, ఇతరులను ఆకర్షింపడేలా చేసేందుకు కొన్ని మంచి లిప్ స్టిక్ లను ఎంపిక చేసుకోవాలి. ఆకర్షనీయమైన పెదాలకోసం మన్నికైన లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకోవాలి. అందుకు మంచి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకొనే లిప్ స్టిక్ నేచురల్ కలర్ అయ్యుంటే, సహజ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ రాత్రి సమయంలో మాత్రమే ఉపయోగపడుతాయి. మ్యాట్ ఫినిష్ నిచ్చే లిప్ స్టిక్స్ పగలు అందంగా కనబడేలా చేస్తే, స్టెయిన్ మరియు గ్లాస్ ఫినిష్ సాయంత్రం, రాత్రి వేళల్లో మంచి లుక్ నిస్తుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉండే లిఫ్ కలర్స్ ఏంటో చూద్దాం.. ప్రస్తుత ట్రెండు ను ఎక్కువగా ఆకర్షిస్తోన్న కలర్ పింక్. మరి పింక్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ఏంటో చూద్దాం...

పౌడర్ పింక్: ఈ పౌడర్ పింక్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. అందులో నెవీ బ్యూలు, స్కై బ్లూ, మింట్ గ్రీన్.. ఇవి చాలా కూల్ గా కనిబడుతాయి. ఈ రేర్ కలర్స్ ను డార్క్ డ్రెస్స్ ల మీదకు బాగా సూట్ అవుతుంది.

న్యూడ్ పింక్: సాధారణంగా మన చర్మఛాయను బట్టి పెదాల కలర్ ఆధారపడి ఉంటుంది. సున్నితంగా ఉండే పెదాల మీదకు ఈ న్యూడ్ లిప్ట్ స్టిక్స్ బాగా నప్పుతాయి. ఇంకా డార్క్ ఐ మేకప్ మరియు వైట్ క్లోత్స్ మీదకు ఈ న్యూడ్ లిప్ట్ స్టిక్ తో చాలా అందంగా కనబడుతారు.

గ్లాసీ పింక్: లిప్ కలర్ లో ఉండే పింక్ మరింత అట్రాక్షన్ గా కనబడేలా చేస్తుంది గ్లాసీ పింక్. ఈ గ్లాసీ పింక్ ను ముదురు రంగు దుస్తుల మీదకు బాగా నప్పుతుంది.

మెజెంటా పింక్: ఇది చూడటానికి కొంచెం ఎర్రగా అనిపించినా మెజెంటా పింక్ చాలా ఆకర్షనీయంగా కనబడుతుంది. ఈ పింక్ మెజెంటా లిప్ కలర్ ను డార్క్ కలర్ డ్రెస్సులు బ్లాక్, మిడ్ నైట్ బ్లూ లేదా బ్రౌన్ కలర్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి.

ఫ్యుచీయా పింక్: ఇది ఒక ప్రత్యేకమైన డీప్ పింక్. అయితే మెజెంటా పింక్ అంత డార్క్ గా ఉండదు. అలా అని బేబీ పింక్ మాదిరి మరీ లైట్ గానూ ఉండదు. మరి ఇన్ని షేడ్స్ అంధించే ఈ బహుముఖ లిప్ స్టిక్ ను వాలెంటైన్ స్పెషల్ గా ప్రయత్నించండి.

నియాన్ పింక్: దేదీప్యమానంగా వెలిగిపోయే ఈ పింక్ కాలర్ నియాన్ బల్బ్ అంత భ్రాంతిని ఇస్తుంది. మరి ఈ బ్రైట్ లిప్ కలర్ ను ప్రకాశవంతంగా మెటాలిక్ వస్త్రాల మీదకు ప్రయత్నించండి.

పీచ్ కలర్ పింక్: పీచ్ పండు చూడటానికి నోరూరిస్తూ కళ్ళకు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. మరి అంతటి ఆకర్షణ ఈ పింక్ కలర్ లో ఉంది. ఇది చూడటానికి చాలా లైట్ గా కనబడుట చేత దీన్ని ఏ రకమైన డ్రెస్సులేకైనా నప్పుతుంది.

రెడ్డిష్ పింక్: ఎరుపుదనంతో కూడిన పింక్ ప్రధానంగా ఎరుపు షేడ్ లో కనబడుతుంది. ఈ ఎరుపుదనంతో కూడిన పింక్ లిప్ స్టిక్ బ్లాక్, వైట్ మరియు రెడ్ కలర్ దుస్తుల మీదకు బాగా సూట్ అవుతుంది.

బబుల్ గమ్ పింక్: బబుల్ గమ్ నమిలిన తర్వాత ఎప్పుడైనా అద్దంలో చూసుకొన్నారా? పెదాలు అద్భుతమైన కలర్ తో కనబడుతాయి. ఈ లిప్ స్టిక్ అచ్చం అలాగే ఉంటుంది. ఈ కలర్ ను బ్లాక్, బ్లూ, మరియు సిల్వర్ కలర్ మీదకు బాగా నప్పుతాయి.

నేచురల్ పింక్: మీకు నేచురల్ పింక్ లిప్స్ పొందాలనుకుంటే, ఈ నేచురల్ పింక్ ను ఉపయోగించవచ్చు.

మ్యాట్ పింక్: ఈ పింక్ కలర్ లిప్ స్టిక్ మ్యాట్ షేడ్ ను కలిగి ఉంటుంది. ఈ కలర్ లిప్ స్టిక్స్ బ్రైట్ నియాన్ కలర్స్ ఆరెంజ్, పింక్ మరియు గ్రీన్ మీదకు చాలా అద్భుతంగా కనబడతుంది.

పాస్టెల్ పింక్: ఈ పింక్ లిప్ స్టిక్ చూడటానికి పాస్టెల్ పింక్ కలర్ లో కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
