Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ప్రస్తుత ట్రెండ్ ను ఈజీగా పడగొట్టే టాప్ 12 లిప్ కలర్స్...!
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో పురుషులకు సమానంగా పలు రంగాల్లో మహిళలు ధీటుగా రాణిస్తున్న నేపథ్యంలో, కీలక పదవుల్లో ఉన్న మహిళలు మేకప్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పెదవుల మేకప్ విషయంలో ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నారు. లిప్ స్టిక్ అనేది మహిళ అందాన్ని మరింత ఎక్కువగా చూపించబడే ఒక సౌందర్య సాధనం. మహిళలు మేకప్ వేసుకొన్న తర్వాత ముఖంలో ఒక ఫైనల్ టచ్ ఇచ్చి ముఖాన్నిమరింత ఆకర్షనీయంగా తీర్చి దిద్దుకొని ఇతరులకు ఆకట్టుకోగలుగుతారు. పెదాల సంరక్షణకు ఈ రోజుల్లో శ్రద్ధ తీసుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. దాంతో పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం మహిళల సౌందర్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మగువల అధరాలకు అందమైన లుక్కు తీసుకురావడంలో లిప్ స్టిక్ లది ప్రధానపాత్ర..
అయితే కొందరు కొన్ని మహిళలు ఏదో లిప్ స్టిక్స్ వేసేసుకుని ఆఫీసులకు పరుగులు తీస్తుంటారు. అలాంటి మహిళలకు కొన్ని చిట్కాలు. ముందుగా లిప్ లైనర్ వేసుకోవాలి. పెన్సిల్ తరహాలో ఉన్న లిప్ లైనర్‌తో అవుట్ లైన్ వేసుకుని లైనప్ లోపలి నుంచే లిప్ స్టిక్ వేసుకోవాలి. అప్పుడే ఇతరు లకు ఆకట్టుకునే విధంగా మీ పెదవులు ఉంటా యి సౌందర్య నిపు ణులు చెబు తున్నారు. అలాగే లిప్‌స్టిక్స్‌కు తగిన రంగుకు తగ్గట్టు లిప్ లైనర్ ఉండేలా చూసు కోవాలి. ఇంకా మాశ్చరైజర్ లేని లిప్ లైనర్‌లను పెదవులకు ఉపయోగించేటప్పుడు కాస్త క్రీమ్‌ను రాసుకోవడం మంచిది. ఇలా క్రీమ్ రాయటం ద్వారా పెదవులు ఎండిపోకుండా ఉంటాయని సౌందర్యనిపుణులు చెబుతున్నారు.
అధరాలు మాటిమాటికీ తడారిపోవడం సహజం. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన ‘స్ప్రింగ్ స్పెషల్' లిప్ స్టిక్ లు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే మామూలుగా వాడే లిప్ స్టిక్స్ తోనే న్యూలుక్ తీసుకురావచ్చు. కొన్ని రకాలైన లైట్ కలర్, బ్రైట్ కలర్ లిప్ స్టిక్స్ ను వాడడం ద్వారా మంచి లుక్ తీసుకువాచ్చు. అయితే బ్రైట్ కలర్స్, డ్రాక్ కలర్స్ ఎంచుకొనేటప్పుడు వారివారి శరీర ఛాయను గమనించి లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. న్యూడ్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా పెదవుల్లో తడిఆరిపోయి నిస్తేజంగా మారుతాయి. కాబట్టి చర్మ స్వభావం, ఛాయను బట్టి కూడా లిప్స్ స్టిక్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. శరీర ఛాయ..ఛామన ఛాయ, లేదా డార్క్ కలర్ ఉన్నవారు ఎలాంటి లిప్స్ స్టిక్స్ ఎంపిక చేసుకోవాలో చూద్దా...
ఆకర్షనీయమైన పెదాలకోసం మన్నికైన లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకోవాలి. అందుకు మంచి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకొనే లిప్ స్టిక్ నేచురల్ కలర్ అయ్యుంటే, సహజ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ రాత్రి సమయంలో మాత్రమే ఉపయోగపడుతాయి. మ్యాట్ ఫినిష్ నిచ్చే లిప్ స్టిక్స్ పగలు అందంగా కనబడేలా చేస్తే, స్టెయిన్ మరియు గ్లాస్ ఫినిష్ సాయంత్రం, రాత్రి వేళల్లో మంచి లుక్ నిస్తుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉండే లిఫ్ కలర్స్ ఏంటో చూద్దాం..

పింక్ కలర్: లైట్ కలర్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. అయితే ఈ కలర్స్ వినయోగించడం వల్ల ప్రత్యేకంగా కనబడకపోవచ్చు. అయితే చూడటానికి మాత్రం అందంగా కనిపిస్తుంటాయి. పింక్ కలర్ లిప్స్ స్టిక్ వాడేటప్పుడు లిప్ లైనర్ వాడకూడు. అప్పుడు పెదాలు సాధారణ పెదాలను కలిగి ఉంటాయి.

ఎరుపు: ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సాయంత్రం వేళల్లో ధరించే డ్రెస్సులకు తగినవిధంగా బోల్డ్ రంగులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వర్కింగ్ మహిళలు కూడా వారు ధరించే దుస్తులకు తగినవిధంగా టాప్స్, షర్ట్స్, బ్లౌజ్ వంటివాటికి తగినవిధంగా ఎరుపు రంగు లిప్స్ స్టిక్స్ ను వినియోగించవచ్చు. శరీర ఛాయ తక్కువగా ఉండి, కొంచెం డార్క్ లకర్ ఉన్నవారు, పెదాలు గ్లాసీగా నిగనిగలాడేలా కనబడటానికి గ్లాసీ ఎరుపు రంగు లిప్స్ స్టిక్ వాడాలి. డార్క్ స్కిన్ కలిగిన మహళలు వైన్ రెడ్ మరియు డార్క్ రెడ్ కలర్స్ బాగా నప్పుతాయి.

వైన్ రెడ్: ఇది బోల్డ్ రెడ్ కలర్ అదీ చాలా డార్క్ కలర్ లో మిమ్మల్ని పడేసేలా ఉంది. ఈ వైన్ రెడ్ లిప్ స్టిక్ ను మ్యాట్ ఫినిష్ లేదా గ్లాసీ ఫినిష్ ను ఎంపిక చేసుకోచ్చు.

న్యూడ్ గ్లాస్: అద్భుతమైన లిప్ కలర్. ప్రస్తుత ట్రెండ్ ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ లిప్ కలర్ లిప్ స్టిక్ నేచురల్ గా ఉంటుంది. ఈ పెదాలు, నిండుగా, జ్యూసీగా (తడితడిగా)కనబడుతుంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే లిప్ స్టిక్.

లైట్ పింక్: చాలా మంది మహిళలు ఎక్కువగా లైట్ పింక్ కలర్ మరియు గ్లాస్ లిప్ కలర్ నే ఇష్టపడుతారు. ఈ లిప్ కలర్ ను ఉపయోగించి చాలా సింపుల్ గా డెలికేట్ గా కనబడండి.

గ్లాసీ రెడ్: గ్లాసీ రెడ్ లిప్ స్టిక్ అందంగా కనబడుతుంది. అదే టైమ్ లో కొద్దిగా భయంగా కూడా అనిపిస్తుంది. ఇది ఈవెనింగ్ పార్టీలకు మాత్రమే బాగుంటుంది. ఈ కలర్ మిమ్మల్ని అతి త్వరగా హైలైట్ చేసేలా చేస్తుంది.

ప్లమ్ కలర్: ఇది ఒక కొత్త కలర్ మరియు బోల్డ్ గా కనిపిస్తుంది. ప్రస్తుత ట్రెండ్ ను అతి సులభంగా పడగొట్టే కలర్. గ్లాసీ మరియు సెన్సివల్ కలర్ ఇట్టే ఆకర్షించేస్తుంది.

నియోన్: నియోన్ కలర్ ట్రెండింగ్ ఫాల్. నియోన్ నెయిల్ పాలిష్ కలర్స్ లో చాలా ఫేమస్. ఇప్పుడు లిప్ కలర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి నియోన్ లిప్ స్టిక్స్ కూడా వేసుకొని పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనబడండి.

బబుల్ గమ్ పింక్: ఇది చాలా లైట్ కలర్. ఏ చర్మ ఛాయకైనా ఫర్ ఫెక్ట్ ఆవుట్ ఫిట్ ఇస్తుంది.

చెర్రీ రెడ్: ఇది మరొక బ్రైట్ రెడ్ కలర్. చెర్రీ రెడ్ కలర్ క్లాసిక్ కలర్. ప్రస్తుత ట్రెండ్ ను ఈజీగా పడగొట్టే లిప్ స్టిక్ ఇది.

ద్రాక్షరంగు: ఛామన ఛాయ కలిగిన వారు ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే సౌందర్యం మరింత మెరుగ్గా కనబడుతుంది. డార్క్ చర్మం తత్వం కలిగిన వారు కూడా ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్స్ అప్లై చేసి, దాని మీద లిప్ గ్లాస్, లైట్ కలర్ అవుట్ లైన్ వేసుకొంటే, పెదవులు మరింత ఆకర్షణీయంగా కనబడుతూ పార్టీ లో మీరే సౌందర్య రాశిలా కనిపిస్తారు.

చాక్లెట్ కలర్: చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్ ను సాయంత్రం వేళ అప్లై చేసుకొన్నట్లైతే మరింత ఆకర్షణీయంగా కనబడుతాయి. ఏదైనా కార్యక్రమానికి వెళ్లాలనుకొన్నప్పుడు చామన ఛాయ కలిగిన వారు రిచ్ కోకో కలర్ మరియు చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్స్ ను అప్లై చేస్తే బాగుంటుంది. ఛామన ఛాయ కలిగిన వారు లిప్ కలర్ లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే మరింత అందంగా కనబడుతారు.



Click it and Unblock the Notifications











