Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
ష్యాషన్ : మేకప్ లోనూ సరికొత్త ట్రెండ్
అమ్మాయిల అందాన్ని మరింత ఇనుమడింపజేసేది మేకప్. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే 2014లో మేకప్ వేసుకునే విధానాల్లో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి. అందాలకు, ఫ్యాషన్లకూ చిరునామగా నిలిచే కొందరు కాలేజీ యువత వీటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూనే ఉన్నారు. మేకప్ పరంగా చోటుచేసుకున్న ఈ మార్పులు అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేసేవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో మేకప్ వేసుకునే విధానాల్లో ఈ సంవత్సరం చోటుచేసుకొన్న కొన్ని మార్పుల గురించి ఈ క్రింది విధంగా...
ఒకప్పుడు మేకప్ ఎంత తక్కువగా ఉంటే అంత బాగుంటారని లేదా అసలు మేకప్ వేసుకోకుండా సహజంగా ఉంటేనే అందంగా కనిపిస్తారని మహిళలు ఎక్కువగా నమ్మేవారు. కానీ ప్రస్తుతం కాలక్రమేణా మహిళల ఆలోచనా విధానాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏ చిన్న పని మీద బయటకు వెళ్లాలన్నా సింపుల్ మేకప్ వేసుకోవడం ఇప్పుడు తప్పనిసరైపోయింది. మేకప్ ని తద్వారా చేకూరే అందాన్ని అమ్మాయిలు ఇంతగా ఆస్వాదిస్తారు కాబట్టే అందులో ఎన్ని మార్పులు వచ్చినా స్వాగతిస్తూనే ఉన్నారు...

ఆరెంజ్ లిప్ స్టిక్:
మేకప్ లో భాగంగా పెదవులకు గులాబీ, ఎరుపు, బ్రౌన్...వంటి రంగులతోనే లిప్ స్టిక్ వేసుకునేవారు. ఇప్పుడు ఈ రంగుల స్థానంలో ప్రకాశవంతమైన కాషాయం రంగు లిప్ స్టిక్ వేసుకోవడం కొత్త ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా రాత్రి పూట హాజరుకావాల్సిన పార్టీలు, ఫంక్షన్లకైతే ఈ కలర్ లిప్ స్టిక్ లో కాస్త స్పెషల్ గా కనిపిస్తాం అనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీ అమ్మాయిలు కూడా ఫ్రెషర్స్ డే వంటి వేడుకలకు హాజరైనప్పుడు ఈ ట్రెండ్ ని పాటించారు.

మెటాలిక్ షేడ్స్:
కొంత కాలం కిందట వరకూ మేకప్ వేసుకునేటప్పుడు సాధారణమైన కలర్స్ నే ఎంపిక చేసుకునే వారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మేకప్ వేసుకోవాల్సిన సందర్భాన్ని అనుసరించి మెటాలిక్ షేడ్స్ ను కూడా ఉపయోగించడం కొత్త ట్రెండ్ గా మారింది. ఐ షాడో దగ్గర్నుంచి బ్లషర్, షిమ్మర్...ఇలా మొత్తం వీలైనంత వరకూ మెటాలిక్ కలర్స్ నే మేకప్ కి ఉపయోగించడం వల్ల మనం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్లూ ఐ షాడో:
ఏ డ్రెస్స్ వేసుకుంటే ఆ డ్రెస్ కు తగినట్టుగా ఉండే గోల్డ్, సిల్వర్, న్యాచురల్ పింక్...వంటి ఐ షాడోలను పక్కన పెట్టి బ్లూ కలర్ ఐ షాడోలను ఉపయోగించడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అందుకే సినిమా హీరోయిన్లు, ర్యాంపు మీద హోయలొలికించే మోడళ్లు, కాలేజీ విద్యార్థినులు సైతం ఈ ట్రెండ్ కు సాదరంగా స్వాగతం పలికారు. ఇది వేసుకుంటే వచ్చే లుక్ అలాంటిది మరి.

తెల్లని ఐ లైనర్:
కళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి కాటుక, ఐ లైనర్...వంటివి ఉపయోగించడం మామూలే. సాధారణంగా నలుపు రంగులో ఉన్న వాటినే ఐ మేకప్ కు వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పద్ధతికి ప్రత్యామ్నాయంగా నలుపు రంగు బదులు తెలుపు రంగు ఐలైనర్ ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల చాలా ఫ్యాషనుబుల్ గా, ట్రెండీగా కనిపిస్తారు. దాంతో ప్రస్తుతం మోడళ్ళు ఎక్కువగా ఈ ట్రెండ్ నే అనుసరిస్తున్నారు. అంతే కాదు...అవకాశం ఉండాలే కానీ..కాలేజీ అమ్మాయిలు కూడా ఈ ట్రెండ్ కు మేమూ సిద్దం అంటున్నారు.

కృత్రిమ కనురెప్పలతో:
ఐ మేకప్ వేసుకోవడం ద్వారా కళ్లను అందంగా కనిపించేలా చేయవచ్చు. కానీ కనురెప్పకు ఉండే వెంట్రుకలు తక్కువ ఉంటే అది ఏం చేసినా కవర్ కాదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ‘కృత్రిమ కనురెప్పలు'మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే మొదట్లో కేవలం పైరెప్పకే పెట్టుకొనే వీలుండే ఈ కృత్రిమ కనురెప్పలు ఇప్పుడు పైన, కింద రెప్పలకు కూడా పెట్టుకోవడానికి వీలుగా వస్తున్నాయి. కళ్లను మేకప్ ద్వారా అందంగా తీర్చిదిద్దుకుని, ఆకర్షణీయంగా కనిపించాలనుకునే వారు ఈ ట్రెండ్ కు ఆహ్వానం పలుకుతున్నారు.

అదనపు మెరుగులు:
ఐ మేకప్ సంబందించి ఇవే కాదు..మరెన్నో కొత్త ట్రెండ్స్ కూడా వచ్చాయి. ఐలైనర్ ను రకరకాల స్టైల్స్ లో పెట్టుకోవడం, క్యాట్ ఐ మేకప్, కళ్లు మత్తుగా కనిపించేలా కనురెప్పల మీద ఐ షాడో వేసుకోవడం...ఇలాంటి అదనపు మెరుగులు కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. కొత్త ఫ్యాషన్ ను ఇష్టపడే అమ్మాయిలు వీటిని కూడా స్వాగతించి అనుసరిస్తున్నారు.

కనిపించని మేకప్:
మేకప్ వేసుకునేదే అందంగా కనిపించడానికి..మరి ఇదేంటి? కనిపించని మేకప్ అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నామండీ..!కంటికి ఇంపుగా కనిపించేలా ప్రకాశవంతమైన కలర్స్ ఉపయోగించి మేకప్ చేసుకోవడం కాకుండా కంటికి కనిపించని (న్యూడ్)కలర్స్ తో మేకప్ చేసుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అయితే ఈ మేకప్ చాలా వరకూ సింపుల్ గా కూడా ఉంటుంది. కళ్లకు లైనర్, షాడో...ఇవేవీ ఉపయోగించరు. అలాగే పెదవులకు లిప్ స్టిక్ వేసుకోరు. ఫౌండేషన్ తో లైట్ గా టచప్ ఇచ్చుకుని న్యూడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుంటే సరి. ఇది కూడా కాలేజి అమ్మాయిలకు చాలా బాగుంటుంది.

ప్రకాశవంతంగా కనిపించేలా..!
ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా ప్రకాశంతంగా లేకపోతే అసలు అందమే రాదు..అందుకే ముఖచర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుకోవడం కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రెండే.. దీని కోసం సహజసిద్దమైన ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, సరైన వేళకు తిని పడుకోవడం...ఇలాంటి చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే తాజా, ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది. అలాగే పెదవులు కూడా నిర్జీవంగా కాకుండా గులాబీ రంగులో ఆరోగ్యంగా కనిపించేలా జాగ్రత్తపడాలి. అప్పుడే మన అందానికి మేకప్ జత చేస్తే మరింత ద్విగుణీకృతం అవుతుంది .
ఇంకా మేకప్ లో రకరాల కలర్స్ ని ఉపయోగించడం, వేసుకున్న డ్రెస్స్ కు తగినట్లు మేకప్ చేసుకోవడం..ఇలా ఇప్పుడు అమ్మాయి ఎన్నో రకాల ట్రెండ్స్ అనుసరిస్తున్నారు. అయితే ఇవన్నీ ఈ ఏడాదిలో మనం స్వాగతం పలికిన కొత్త ట్రెండ్సే అని గుర్తుంచుకోండి. అలాగే కొత్త సంవత్సరం మరిన్ని కొత్త ట్రెండ్స్ కు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నించండి. అయితే ఏం చేసినా మాత్రం మన అందాన్ని, ఆహార్యాన్ని హుందాతనాన్ని పెంపొందించేలా ఉండాలన్న విషయం మాత్రం మర్చిపోకండి..!



Click it and Unblock the Notifications