మీ కనుబొమ్మల చక్కని ఆకృతి కోసం 7 విభిన్నమైన థ్రెడింగ్ ప్రత్యామ్నాయాలు

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

ముఖానికి అందం కనులు. ఆ కనులకు అందం కనులపైన ఉన్న కనుబొమ్మలు. మీ మొత్తం ముఖానికి బాగా నిర్వచించిన మరియు సంపూర్ణ ఆకృతి కలిగిన కనుబొమ్మలు అందాన్ని ఇస్తాయి. కనుబొమ్మలు సన్నగా,గుబురుగా, దట్టంగా ఎలా ఉన్నా సరే ట్రిమ్మింగ్ చేయటం అవసరం.

థ్రెడింగ్ అనేది కనుబొమ్మల అదనపు జుట్టును తొలగించడం మరియు కనుబొమ్మల ఆకృతిని రూపొందించడం కోసం చేసే ఒక సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ సెలూన్ చేయించుకుంటే, అక్కడ ఖచ్చితత్వంతో చేస్తారు. బ్యూటీషియన్స్ వారి వ్రేళ్ళలో ఒక థ్రెడ్ ని తిప్పడం మరియు తొలగించాల్సిన జుట్టు మీద శాంతముగా టగ్ చేస్తారు. ఈ విధానం చిన్న ఉపరితలంపై జుట్టును తొలగించటానికి అత్యంత సాధారణ మార్గం అని చెప్పవచ్చు.

7 Different alternatives to threading for grooming your eyebrows

మీ కనుబొమ్మల ఆకృతిని సెలూన్లో చేయించుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బ్యూటీషియన్స్ మీ ముఖం అందంగా కనిపించేలా కనుబొమ్మల ఆకృతిని చేస్తారు. అంతేకాక వారు ప్రొఫెషనల్ గా ఉండుట వలన అసమాన కనుబొమ్మలు మరియు చర్మం కోతలు తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నల్లని మరియు ఒత్తైన కనుబొమ్మలు పొందడానికి ఉత్తమ చిట్కాలు

అయితే కొన్నిసార్లు కనుబొమ్మల పెరిగినప్పుడు సెలూన్ కి వెళ్ళటం సాధ్యం కాకపోవచ్చు. అందువలన మీ కనుబొమ్మలను మెరుగుపర్చడంలో సహాయపడే అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. కత్తెరలతో క్లిప్పింగ్

1. కత్తెరలతో క్లిప్పింగ్

మీరు సెలూన్ కి వెళ్లకుండా మీ కనుబొమ్మలను ఆకృతి చేయాలనుకుంటే మంచి పాత జత కత్తెర సాయంతో చేయవచ్చు. మీ కనుబొమ్మలను చిన్న కనుబొమ్మల బ్రష్ సాయంతో బ్రష్ చేయండి. ఎగువ మరియు దిగువ భాగాల్లో కొన్ని వెంట్రుకలను కట్ చేయండి. ఏమైనా అసమాన పొడవులు ఉంటే కట్ చేయండి. ఖచ్చితమైన మరియు జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.

2. వాక్సింగ్

2. వాక్సింగ్

కొంత మంది పెరుగుతున్న కనుబొమ్మలను ఆకట్టుకునే విధంగా చేయాలనీ వాక్సింగ్ చేస్తారు. జుట్టు మూలాలు నుండి తీసివేయబడటం వలన ఈ పద్దతి థ్రెడింగ్ కంటే తక్కువ బాధాకరమైనది మరియు దీర్ఘకాల ఫలితాలను ఇస్తుంది.కానీ వాక్స్ ఖచ్చితత్వము మరియు స్థిరత్వం చాలా అవసరం. సరిగా లేకపోతే వాక్స్ చాలా కష్టం మరియు దారుణంగా ఉంటుంది.

మీ ముఖానికి ఏ రకమైన కనుబొమ్మలు నప్పుతాయి?

3. ట్వీజింగ్

3. ట్వీజింగ్

ఇది థ్రెడ్డింగ్ కి ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ ప్రక్రియలో పట్టకార్లను ఉపయోగించడం ద్వారా జుట్టును ట్వీజింగ్ చేస్తారు. ఇది థ్రెడ్డింగ్ కి చాలా సారూప్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకొక్క వెంట్రుక తొలగించబడుతుంది. మీరు తరచూ పార్లర్ ల చుట్టూ తిరగకుండా మీ కనుబొమ్మలను ట్వీజ్ చేసి బాగా నిర్వహించవచ్చు. కనుబొమ్మలు ఓవర్-ట్వీజ్డ్ అవుతాయని భయం ఉంటే కనుబొమ్మ సీరంను ఉపయోగిస్తే జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడుతుంది.

4. రేజర్

4. రేజర్

మీ కనుబొమ్మ కోసం రూపొందించబడిన చిన్న రేజర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రేజర్స్ ని ఉపయోగించటం చాలా సులభం. అలాగే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.ఈ రేజర్ కోసం ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. జుట్టు మూలాలనుండి తీసివేయక పోవటం వలన జుట్టు వేగంగా పెరుగుతుందని గుర్తుంచుకోండి.

5. లేజర్ చికిత్స

5. లేజర్ చికిత్స

మీరు ఖర్చు గురించి ఆలోచన లేకపోతే లేజర్ చికిత్స అనేది మార్కెట్లో లభించే ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. లేజర్ చికిత్స ద్వారా జుట్టు తొలగింపు చాలా ప్రభావవంతంగా మరియు నొప్పిలేకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కువసేపు ఉన్నా సరే దీని ప్రభావం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. జుట్టు తొందరగా పెరగదు. ఇది ఒక శాశ్వత ప్రక్రియ. మీరు మీ కనుబొమ్మల ఆకారాన్ని అస్తమాను మార్చలేరు.

నిండైన ముఖంలో ఒత్తైన కనుబొమ్మలు పెరగాలంటే 13 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

6. నుదురు జెల్

6. నుదురు జెల్

మీరు సడన్ గా పార్టీకి వెళ్లే సమయంలో మీ కనుబొమ్మల ఆకృతి సెట్ చేసుకోవాలా? అప్పుడు మీకు ఈ నుదురు జెల్ బాగా సహాయపడుతుంది. మీకు కావలసిన ఆకారాన్ని సృష్టించడానికి మరియు అక్కడ కొంత జుట్టును ట్వీజ్ చేయడానికి ఒక స్పూలీ బ్రష్ లేదా మాస్కరాని ఉపయోగించాలి. మీరు నుదురు జెల్ రాస్తే కనుబొమ్మ ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీరు కనుబొమ్మలను నిమిషాల్లో ఫిక్స్ చేసుకోవచ్చు.

7. జుట్టును తొలగించే క్రీమ్స్(డిప్లేటరీ క్రీమ్స్)

7. జుట్టును తొలగించే క్రీమ్స్(డిప్లేటరీ క్రీమ్స్)

జుట్టును తొలగించే క్రీమ్స్ స్వయంగా జుట్టును తొలగించుకొనే ప్రక్రియలో ఉత్తమమైనది. ఉపరితలం క్రింద ఉన్న జుట్టును కరిగించడం ద్వారా ట్రిమ్మింగ్ జరుగుతుంది. మీరు కనుబొమ్మలపై డిప్లేటరీ క్రీమ్స్ రాసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రీమ్స్ ప్రతి ఒక్కరికి సెట్ కావు. కాబట్టి చాలా సున్నితంగా ఉపయోగించాలి.

English summary

7 Different alternatives to threading for grooming your eyebrows

7 Different alternatives to threading for grooming your eyebrows,Check out the different alternatives for threading and grooming your eyebrows.
Story first published: Saturday, November 11, 2017, 8:30 [IST]
Subscribe Newsletter