Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
దీపావళి రోజు అందంగా కనిపించాలా.. అయితే ఈ టిప్స్ పాటించండి.. మెరిసిపోతారు అంతే!
దీపావళి అనేది చాలా ప్రత్యకమైన పండగ. ఈ పండగ రోజు అతివలందరూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం పండుగ రోజు పార్లర్లకు వెళ్లి రకరకాల ఫేసియల్స్ చేసుకొని, చాలా డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు. పైగా చలికాలం కాబట్టి చర్మానికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చేస్తేనే పండగ రోజు అందంగా కనిపించడంతో ఈ పని కోసం కష్టపడుతూ ఉంటారు.
అయితే ఈ దీపావళి రోజు అందంగా కనిపించేందుకు వందల్లో డబ్బులు వృథా చేయకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేసియల్ చేసుకోవచ్చు. అయితే ఎలా చేసుకోవాలి, ఏ విధమైన వస్తువులను వాడాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫేస్ వెలిగిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..

ఫేస్ ప్యాక్ తప్పనిసరి..
ముఖం అందంగా కాంతి వంతంగా వెలిగిపోయేందుకు ఫేస్ ప్యాక్ ఎంతో దోహదపడుతుంది. దీని వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు కాంతి వంతంగా ఉంటుంది. అయితే పెరుగు, తేనెతో చేసుకున్న ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. ఇది ముఖాన్ని సాఫ్ట్‌గా, కాంతి వంతంగా ఉంచుతుంది.
చర్మ సౌందర్యంలో ముల్తానీ మిట్టి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. చాలా మంది వాడే చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ ముల్తానీ మిట్టిని కలుపుతారు. ఈ ముల్తానీ మిట్టిని గులాబీ నీటితో కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపు ఉంచాక చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. చర్మంపైన ఉండే ఆయిల్ క్లీన్ అవడంతో పాటు.. చర్మం మృదువుగా మారుతుంది.
ఓట్స్‌తో ప్యాక్..
ఏంటి ఓట్స్‌తో ప్యాక్ అని అనుకుంటున్నారా? ఓట్స్ తినడం మాత్రమే కాదు.. ఇలా ఫేస్ ప్యాక్ కోసం కూడా వినియోగిస్తారు. ఓట్స్‌ను గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకొని అందులో పాలు లేదా పెరుగు వేసుకొని మెత్తగా కలుపుకొని ముఖానికి రాసుకుంటే.. ముఖంపై ఉండే మృత కణాలు తొలిగిపోయి ముఖం సజీవంగా కాంతి వంతంగా కనిపిస్తుంది. అలాగే అరటిపండును కూడా మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితాలు పొందొచ్చు.
తేలికపాటి క్లెన్సర్లతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు క్లీన్ చేసుకుంటే మంచి ఫాలితాలు పొందొచ్చు. అలాగే రాత్రుళ్ళు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. రాత్రి పడుకునే ముందు ఈ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలిపొయి.. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఇంటి చిట్కాలు పాటించండి..
ఈ పండగ పూట చర్మం కాంతివంతంగా కనిపించడంతో పాటు చర్మం మెరిసిపోవాలంటే ఇంటి చిట్కాలను కూడా పాటించాలి. పసుపును ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే ముఖం మెరుస్తుంది. ఇలా ముఖానికి పసుపు రాసుకుంటే.. ముఖంపై ఏదైనా వ్యాధులకు సంబంధించిన క్రీములు ఉన్నా.. అవి నాశనమవుతాయి.
అలాగే నిమ్మకాయ కూడా ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. ఇది ముఖం తక్షణమే మెరిసేలా చేయడంతో పాటు, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. టమాటోలు కూడా చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. టమోటాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే క్రీములను సంహరిస్తాయి. అలాగే చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.
వీటితో పాటు ప్రతీరోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. అలాగే ఆరోగ్యకరమైన, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహరం తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. నీరు పుష్కలంగా తాగాలి. అలాగే జంక్ ఫుడ్ కూడా మానుకోవాలి.
గమనిక: ఈ కథనంలో మేము అందించిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications