Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
క్యారెట్ ఫేస్ ప్యాక్ తో ముఖం కాంతివంతంగా మెరుస్తుంది...

1. ముందుగా క్యారట్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు, రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, అయిదారు చుక్కల తేనె వేసి అన్నిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ని సమయం దొరికినప్పుడల్లా వేసుకుంటే ముఖంపైన ఉన్న జిడ్డు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
2. ఒక టీ స్పూన్ క్యారెట్ రసంతో అర టీ స్పూన్ పన్నీరు, పావు టీ స్పూన్ చందనం పొడి చేర్చి పదినిమిషాలపాటు ముఖానికి రాసుకుంటూ ఉండి కడిగేయాలి. ఆ తరువాత మేకప్ చేసుకుంటే గంటల తరబడి చెదరకుండా ఉంటుంది.
3. క్యారెట్ ను తొక్క తీయకుండా తురిమి, ఎండలో పెట్టి 50గ్రాముల క్యారెట్ తురుముకు సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీ తీసుకుని గిర్నీలో పిండి చేసుకోవాలి. ఈ పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేస్తే చర్మం రంగు, తేలి నిగనిగలాడుతుంది.
4. అయిదు బాదాములను నీటిలో నానపెట్టాలి. ఒక క్యారట్‌ను తొక్కతోపాటు ముక్కలు చేయాలి. ఈ రెండింటిని ముద్దలా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంటికి పూసుకుని అరగంట తరువాత స్నానం చేయాలి. ఈ విధంగా పక్షంరోజులకు ఒకసారి చేస్తే వదులైపోయన చర్మం బిగుస్తుంది. క్యారెట్ రసం ఎండకు కమిలిన చర్మంలోని నల్లదనాన్ని పొగొట్టి రంగునిస్తుంది. బాదాములు కాంతినిస్తాయి.
5.ఈస్ట్ పౌడర్, యోఘ్రట్, లెమన్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఆలీవ్ లేదా ఆల్ మండ్ ఆయిల్ అన్నింటిని ఒక్కొక్కో టీ స్పూన్ చొప్పున తీసుకొని పేస్ట్ అయ్యేవరకూ బాగా రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ లా చేసుకొని స్క్రబ్ తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్ ని మొటిమలు ఉన్నప్పుడు వాడకూడదు. మొటిమలు ఉన్నప్పుడు వాడితే ఇన్ ఫెక్షన్ కలుగుతుంది.



Click it and Unblock the Notifications