Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఆ ‘రసికుడి’కి క్రేజ్ తగ్గిందా..?

ఛాతి నిండా వెంట్రుకలన్న మగవారిని అందగాడంటూ, రసికుడంటూ.., మన్మధుడంటూ రక రకాలుగా పోల్చేవారు..!!, ఇదంతా ఒకప్పటి మాట. మోడ్రన్ సంస్కృతి నేఫధ్యంలో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాక్సింగ్ సంస్కృతి వ్యాప్తి చెందటతో 'ఆధునిక పరుషులు'తమ వెంట్రుక భాగాలను 'క్లీన్'గా ఉంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా నగరాల్లో , పట్టణాల్లో వ్యాక్సింగ్ సెలూన్లూ వెలిశాయి. ఛాతి పైనే కాక ఇతర రహస్య భాగాల్లో 'వెంట్రుకల'ను తొలగించేందుకు వ్యాక్సింగ్ విధానం సరైనదేనంటున్న నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అయితే వ్యాక్సింగ్ అనంతరం పలు జాగ్రత్తలు పాటించకుంటే చర్మ సంబంధిత వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సింగ్ కు వెళ్లే ముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు:
- వ్యాక్సింగ్ చేయించుకునేందుకు వెళ్లే ముందు తప్పని సరిగా స్నానం చేయాలి. శరీరానికి మంచి బాడీ లోషన్ ను ఆప్లై చేయటంతో పాటు లూజ్ దుస్తులను ధరించాలి.
- సెలూన్ కు చేరుకున్న అనంతరం లోదస్తులతో సహా బట్టలన్ని విప్పేయాల్సి ఉంటుంది.
- వ్యాక్సింగ్ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకూడదు. వ్యాక్సింగ్ కు వెళ్లే ముందు మీరే వెంట్రుకలను ట్రిమ్ చేసుకున్నట్లయితే చికిత్స మరింత సలువుగా జరుగుతుంది.
వ్యాక్సింగ్ అనంతరం తీసుకోవల్సి జాగ్రత్తలు:
- వ్యాక్సింగ్ పూర్తి అయిన అనంతరం 'సన్ బాత్'ఇతర క్లోరినేటడ్ నీటిలో స్నానం చేయకూడదు.
-'ఇ' విటమిన్ లోషన్లను వ్యాక్సింగ్ భాగాల్లో అఫ్లై చేయాలి.
- వ్యాక్సింగ్ అనంతరం వెంట్రుక భాగాలు కందటం సహజం, చల్లటి నీటిలో ముంచిన దూదిని కందిన భాగాల పై అద్దాలి.
- నొప్పి తీవ్రత మరింత అధికంగా ఉంటే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించటం మేలు.



Click it and Unblock the Notifications
