Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మొటిమలు ‘మటాష్’.. ఇలా ట్రై చేయండి!!

మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే... వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట పలుచని పొరలా అప్లై చేసి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడా కనిపిస్తుంది. చిటికెడు జీలకర్ర పొడిలో ఆరు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని మొటిమల పై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మొటిమలు వాటి తాలూకు నల్ల మచ్చలు తగ్గుతాయి.
తీసుకునే ఆహారంలో పీచు అధికంగా వుండాలి. ఇది శరీరంలోని విష పదార్ధాలను తొలగించి చర్మాన్ని కాపాడుతుంది. పీచు అధికంగా, కేరట్లు, కేబేజి, బీట్ రూట్, బ్రొక్కోలి, చిక్కుడు గింజలు, ఉల్లిపాయ, బంగాళదుంప, గోంగూర, కాలీఫ్లవర్ మొదలగు వాటిలో వుంటుంది. పండ్లలో ఆపిల్, అరటిపండు, అవకాడో, స్త్రాబెర్రీలు, రేగుపండు్ల, ఆరెంజ్, ద్రాక్ష, బ్లూ బెర్రీస్, చిన్నరేగి, పియర్ బాదం, మొదలైనవి అధికంగా పీచు కలిగి వుంటాయి.
వీటిని మీ ఆహారంలో భాగంగా చేయండి. వెల్లుల్లి, అల్లం మొటిమలు తగ్గటానికి బాగా తోడ్పడతాయి. కనుక వీటిని మీరు తినే ఆహార పదార్ధాలకు జోడించండి. తీసుకునే ఆహారం లో ప్రొటీన్లు అధికంగా వుంటే అవి ఎంజైములను పెంచి నూనె గ్రంధులను నియంత్రించటం, చర్మ రంధ్రాలు స్వేచ్చగా వుండటంలో తోడ్పడతాయి. సంపూర్ణమైన బ్రెడ్, బీఫ్, గుడ్లు, చేప, జున్ను, కొబ్బరి, ఉడికించిన గించలు కేరట్లు, అవకాడో, బాదం మొదలైనవి ప్రొటీన్లు అదికంగా కలిగా వుంటాయి.



Click it and Unblock the Notifications
