Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
చిన్నవయసులోనే చర్మం పై ‘ముడతల’ సమస్య వేధిస్తుందా.??

శరీరంలో విటమిన్ 'ఇ' లోపం కూడా ముడతలకు కారణమవుతుంది. ఈ విటమిన్ 'ఇ' పెరుగుదలకు సంబంధించి మాత్రలు మెడికల్ షాపులలో లభ్యమవుతాయి. వైద్యులను సంప్రదించి వాటిని ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి. అలాగే ముందుల షాపులో విటమిన్ 'ఇ' నూనె దొరకుతుంది. ఈ నూనెను చర్మం పై రాసుకుంటే మృదువుగా తయారవుతుంది.
ముడతలతో బయట తిరగలేపోతున్నారా..?.. ఇలా చేయండి..!!
అవును... ముఖం పై ముడతలతో బయట తిరగటానికి మనసు అంగీకరించదు. చూసిన నలుగురు ఏమనుకుంటారోనన్న పీకుల్లాట మనల్ని వెంటాడుతుంటుంది. అయితే ముడతలను కొంత వరకు కనిపించకుండా జాగ్రత్తపడేందకు నిపుణులు పలు చిట్కాలను సూచిస్తున్నారు..
అరకప్పు కొబ్బరినూనెలో, కాస్తంత 'ఇ' నూనెను కలిపి చర్మానికి పట్టించాలి. మునివేళ్లతో బాగా మర్దనా చేసి.. మర్నాడు కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం కాంతి వంతంగా మారి, మచ్చలను అంతగా కనబడనీయకుండా చేస్తుంది.
గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని మరింత బిగుతుగా చేస్తుంది. కాబ్టటి తెల్లసోనను కళ్ల అడుగునా, నుదురుకు పూతాలా వేసుకోండి. కొద్ది సేపు అలానే ఉంచిన తరవాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తాజా బొప్పాయి, అరటి పండ్ల గుజ్జును ముఖానికి పూతలా పట్టిస్తే మృత చర్మం తొలగి, కొత్త చర్మం వస్తుంది. అరిటిపండులో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్యకర విటమిన్లు చర్మాన్ని తేటగా మార్చి కాంతివంతం చేస్తాయి.



Click it and Unblock the Notifications
