Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ముఖంపై నల్లమచ్చలతో ఇబ్బంది పడుతున్నారా...

1. ముఖాన్ని ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
2. వారానికి రెండుసార్లు బాదం పప్పును నీటిలో నానబెట్టి నానిన తర్వాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనపడుతుంది.
3. కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి రాసుకుంటే ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు.
4. ఎక్కువ నీళ్ళు తీసుకోవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పోతాయి.
5. మచ్చలపై నిమ్మతొక్కతో మసాజ్ చేసుకోవాలి.
6. కొంచెం ఉల్లి రసంలో దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్న చోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.
7. అరకప్పు టమొటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.
8. ముల్లంగి ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో అయిదారు టీ స్పూన్ల పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే ముఖంపైన మొటిమలు, రంధ్రాలు, నల్లమచ్చలు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.
9. టీ స్పూన్ శనగపిండిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు, చర్మం మీద ఉన్న జిడ్డు తగ్గి ముఖం కాంతిమంతంగా అవుతుంది.
10. అలోవెరా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూకు నల్లమచ్చలు తగ్గి ముఖం నునుపుగా అందంగా మారుతుంది.



Click it and Unblock the Notifications
