Latest Updates
-
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
ముఖం కాంతులు వెదజల్లాలంటే!

పండ్లతో వేసే ఫేస్ మాస్క్ లు సహజమైనవి కనుక ఎప్పటికి చర్మానికి మంచివే. చలికాలంలో రసాయనాలు లేకుండా ప్రత్యేకించి ఇంటిలోనే తయారు చేసి వేసుకోగల మాస్క్ లు సూచించదగినవి. వింటర్ వచ్చిందంటే బెర్రీలు అధికంగా కనపడతాయి. కనుక వీటితో ఫేస్ మాస్క్ వేసుకుంటూ చర్మం కాంతులీనుతూ తాజా, తాజాగా వుంటుంది. మరి బెర్రీలతో ఫేస్ మాస్క్ ఎలా? చూడండి.
అకాయ్ బెర్రీ - ఈ ఉష్ణమండలపండ్లు ఊహించని ప్రయోజనాలను చర్మ సంరక్షణలో అందిస్తాయి.
దీనితో ఫేస్ మాస్క్ తయారీ - రెండు టీస్పూన్ లు సహజ మట్టిని తాజా అకాయ్ రసం, నిమ్మరసం, మరో సువాసన నూనెలతో కలపండి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా రాసి, ఒక పది నిమిషాలు వుంచి కడిగేస్తూ వుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. అకాయ్ బెర్రీ రసాన్ని, రస్ బెర్రీ గుజ్జు, పెరుగు, తేనెలతో కలిపి రాస్తే ముఖం బంగారు రంగులో మెరుస్తుంది.
స్ట్రాబెర్రీ ఫేషియల్ మాస్క్ - ఇది సాధారణమైనదే అయినప్పటికి, వ్యయంతో కూడిన చర్మ వైద్యం. మంచి సువాసన కూడా వుంటుంది. ఆయిలీ స్కిన్ వారికి వింటర్ లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. తయారీ విధానం లో తాజా స్ట్రాబెర్రీ రసాన్ని ఆలివ్ ఆయిల్, నిమ్మలతో కలిపి రాయాలి. ఇది చర్మాన్ని తెల్లబరచటం, కాంతి కలిగించటం చేస్తుంది.



Click it and Unblock the Notifications
