Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
యవ్వనంగా.. అందంగా ఉంచే 5 బెస్ట్ డ్రింక్స్...
చాలా మంది అతి చిన్న వయస్సులోనే పెద్దవారిగా, వయస్సు మీద పడినవారిగా కనబడుతుంటారు ఎందుకని? అందుకు కారణం శరీరంలోని పేరుకుపోయిన టాక్సిన్సే(విషాలు). అనవసరంగా పేరుకుపోయిన కొవ్వులు, విషాలు సరైన టైమ్ లోబయటకు పంపకపోతే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా మెరిసే చర్మంతో నిగనిగలాడుతూ ఉండాలంటే తప్పనిసరిగా శరీరంలోని టాక్సిన్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపబడుతుండాలి. అందుకు సరైన వ్యాయామం చేస్తూ, మంచి ఆహారాలు తింటుండాలి. అనారోగ్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా అతి చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడుతుంది. బార్కొలి, క్యాబేజీ, ఓట్స్, పీచెస్, వంటి వయస్సును పైబడనీయకుండా యవ్వనంగా ఉండేలా చేసే ఆహారాలు. వీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను కూడా తరచూ తీసుకొంటున్నట్లైతే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

నీళ్ళు
చర్మాన్ని తేమగా ఉంచాడానికి అద్భుతంగా ఉపయోగపడేది నీళ్ళు. అంతేకాదు ఆరోగ్యం కూడా. ఈ విషయాన్ని ఇటు బ్యూటీషియన్స్...

గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పానీయం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్నికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

టమోటో జ్యూస్
టమోటోలో యాంటిఆక్సిడెంట్ అదికంగా ఉంటాయి. బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా...

హాట్ కోకా
కెఫిన్ తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు బ్రేవ్డ్ హాట్ కోకా తాగడం వల్ల హెల్తీ హార్ట్ తో పాటు...

రెడ్ వైన్
రెడ్ వైన్ లో కూడా ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ప్రతిరోజూ కొద్దిపాటి రెడ్ వైన్ మహిళలైతే ఒక సారి, పురుషులు రెండు సార్లుగా తాగితే...
లిక్విడ్ డైయట్ తీసుకోవడం వల్ల ఇటు ఆరోగ్యంతో పాటు అటు అందం కూడా మీ సొంతం అవుతుంది. బరువు తగ్గి నాజూగ్గా అయ్యి. శరీరానికి తగ్గం రూపును సంతరించుకుంటుంది. లిక్విడ్స్ ను తీసుకోవడం వల్ల చర్మం సాధారణంగా కనబడుతుంది. అటువంటి పానీయాలు ఇక్కడ కొన్నింటిని మీకందిస్తున్నా అవి వద్యాప్య ఛాయలు రానియకుండా అందంగా యవ్వనంగా ఉండేలా కాపాడుతాయి.
1. నీళ్ళు: చర్మాన్ని తేమగా ఉంచాడానికి అద్భుతంగా ఉపయోగపడేది నీళ్ళు. అంతేకాదు ఆరోగ్యం కూడా. ఈ విషయాన్ని ఇటు బ్యూటీషియన్స్ వద్ద అటు డాక్టర్స్ వద్ద వింటూనే ఉంటాం. నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యానికి మంచిదని. శరీరంలోని విషాలను బయటకు పంపి చర్మాన్ని మెరుస్తుండేలా చేస్తుంది. వృద్యాప్య ఛాయలను రానివ్వదు. జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేయడానికి చాలా బాగా ఉపయోగపడి చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.
2. గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పానీయం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్నికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ చాలా మంది డైయటేరియన్స్ గ్రీన్ టీ ను తప్పనిసరిగా రెండు నుండి నాలుగు కప్పులు టీని తాగుతున్నారు. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎక్స్ ట్రా కొవ్వును తొలగిస్తుంది. మరియు గ్రీన్ టీ లో ఫాలీఫినాల్స్ మరియు యాంటీ యాక్సిడెంట్స్ ఉండటం చేత ఇటు చర్మానికి అటు జుట్టుకు ఆరోగ్యకరం. దీన్ని తీసుకోవడం వల్ల నాజూగ్గా తయారవ్వడమే కాకుండు ఒత్తైన కురులు, మంచి షైనింగ్ తో చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
3. టమోటో జ్యూస్: టమోటోలో యాంటిఆక్సిడెంట్ అదికంగా ఉంటాయి. బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. బరువును తగ్గించే గుణము : టమాటో లు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు . టమాటో లు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను తక్కువగా తింటారు . టమాటో లు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు ... కాబట్టి ఆకలి మీద నియంత్రణ , తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు పెరగరు .
4. హాట్ కోకా: కెఫిన్ తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు బ్రేవ్డ్ హాట్ కోకా తాగడం వల్ల హెల్తీ హార్ట్ తో పాటు మెరిసే చర్మ సౌందర్యం సొంతం అవుతుంది. చాలా పరిశోధనల తర్వాత కాఫీ, టీ మరియు రెడ్ వైన్ లలో కెఫిన్ కంటే కోకాలో వున్న యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉపయోగకరమైనదిగా ఆరోగ్యకరమైనదిగా హాట్ కోలా డ్రిక్ తేల్చారు. కాబట్టి దీన్ని సేవించడం వల్ల ఇటు తీపి కోరిక తీరినట్లు ఉంటుంది. ఆరోగ్యానికి అందాన్ని పెంచుకొన్నట్లు అవుతుంది.
5. రెడ్ వైన్: రెడ్ వైన్ లో కూడా ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ప్రతిరోజూ కొద్దిపాటి రెడ్ వైన్ మహిళలైతే ఒక సారి, పురుషులు రెండు సార్లుగా తాగితే, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రెడ్ వైన్ రోజుకు 30 మి.లీ. తీసుకుంటే గుండెకు కూడా మంచిది. రెడ్ వైన్ లో వుండే రిసర్వేటల్ అనే పదార్ధం రక్తనాళాలలోని అడ్డంకులను తగ్గించటంలో, పొత్తి కడుపు భాగంలోని కొవ్వు నిల్వలను కరిగించటంలో బాగా ప్రయోజనకారి. దాంతో యవ్వనంగా కనబడటమే కాకుండా జీవితకాలాన్ని పెంచుతుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచి, చర్మాన్ని అందంగా మెరుస్తుండేలా చేస్తుంది. కాబట్టి ఈ హెల్తీ డ్రిక్స్ ను తాగి మీ ఆరోగ్యాన్ని.. అందాన్ని కాపాడుకోండి..



Click it and Unblock the Notifications