Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
అందమైన చర్మ సౌందర్యం..యవ్వనత్వాన్ని పెంచే ఆహారాలు
మహిళలకు అందమైన మోముంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి.
చర్మ సౌందర్యానికి సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తీసుకునే చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ప్రొటీన్లు గల చేపలు, పౌల్ట్రీ, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం వంటివి తీసుకోండి.

అవొకాడో: అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైతే ముఖానికి అప్లై చేస్తామో అప్పటి నుండి చర్మం తేమగా మారి కాంతి వంతంగా మారుతుంది. అందుకు అవొకాడో పండును తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ముఖంమీద అలాగే అప్లై చేయడం వల్ల ముఖంలోని మచ్చలను, ముడుతలను తొలగిస్తుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీతో బరువు తగ్గడమే కాదు.. చర్మ కాంతిని కూడా పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రెష్ గా, తేమగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి రోజులు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీకి తాగడానికి అవకాశం ఇవ్వండి.

టమోటో: టమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి టమోటో గుజ్జును ఆలివ్ ఆయిల్ తో చేర్చి ముఖానికి పది వారాల పాటు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. టమోటోల్లోని యాంటిఆక్సిడెంట్స్, లైకోపిన్, హైకెరోటినాయిడ్స్ వంటివి ఫీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

సాల్మన్: సాల్మన్ ఫిష్ ను వారానికి ఒక సారి తినడం వల్ల వయస్సు పైబడనియ్యకుండా కాపాడుతుంది. సాల్మన్ ఫిష్ లోని కెరోటినాయిడ్స్ స్కిన్ ఎలాసిటీన్ వృద్దిచేస్తుంది.

గుడ్డు: ఫీరాడికల్స్ డామేజ్ వల్ల చర్మ సమస్యలను కాపాడటానికి గుడ్డులోని ప్రోటీన్స్ బాగా పనిచేస్తాయి. గుడ్డులో అధిక శాతంలో ప్రోటీలు కలిగి ఉంటాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కావల్సిన బయోటిన్, ఎసెన్సియల్స్ విటమిన్స్ కలిగి ఉండి వయస్సు పైబడనియ్యకుండా.. చర్మం పొడిబారినియ్యకుండా కాపాడుతుంది.

దానిమ్మ: చర్మ సంరక్షణలో మరొక ఆరోగ్యకరమైన ఆహారం దానిమ్మ. దానిమ్మ గింజలను పేస్ట్ చేసి ముఖానికి రాయడం వల్ల ఇందులోని యాంటిఆక్సిడెంట్ చర్మ పగుళ్ళ నుండి కాపాడి, చర్మాన్ని ఎల్ల వేళలా తేమగా ఉంచుతుంది.

వాల్ నట్స్: ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక్క ఫిష్ లో మాత్రమే కాదు వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో వాల్ నట్స్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల చర్మం నునుపుగా మారడమే కాకుండా కురులకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. దాంతో యంగ్ గా కనబడేలా చేస్తుంది.

బీన్స్: మరో ప్రోటీన్ ఆహారం బీన్స్ . చీక్కుళ్ళలో ఫ్రీరాడికల్ నుండి పాడైన చర్మ కణాలను తిరిగీ ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది. అమినో యాసిడ్స్ పాడైన చర్మ కణాలను పునరుత్పత్తిని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications