Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
వర్షా కాలంలోనూ చర్మంలో నునుపుదనమే...!
వర్షానికి తడిస్తే మొట్టమొదటి ప్రభావం పడేది చర్మం మీద, వెంట్రుకల మీద. ఈ రెంటి గురించీ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాలానుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో తడి వాతావరణం చర్మంతో పాటు కళ్లపై ప్రభావం చూపుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు వానాకాలంలో రోజూ రెండు, మూడు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రపరచుకోవాలి.

ఎక్కువగా క్రీమ్‌లను వాడకుండా ముఖాన్ని తరచూ మెత్తటి గుడ్డతో రుద్దుకోవాలి. చల్లటి నీరుకు బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మంపై జిడ్డు వదులుతుంది. పాలలో కాస్త శనగపిండిని కలుపుకుని వంటికి పట్టించి స్నానం చేస్తే చర్మంపై జిడ్డుదనం పోతుంది. పొడి చర్మం ఉన్నవారు మంచి మాయిశ్చరైజర్లను వాడితే చర్మంలోని పైపొరలకు చేరి నునుపుదనం వస్తుంది.
మృదువైన చర్మం ఒక టీ స్ఫూన్ కమలారసంలో తేనె కలుపుకొని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలాగి కడిగేయాలి. తేనె అన్ని రకాల చర్మతత్వాలకూ సరిపోతుంది. ముఖం జిడ్డుగా మొటిమలతో ఉన్నట్టయితే ఒక టీ స్ఫూన్ తేనె, ఒక టీ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు కలిపి అప్లై చేసి 20 నిమిషాలాగి కడిగేయాలి. పొడిచర్మం ఈ కాలంలో చర్మతత్వాన్ని అనుసరించి దానికి తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. ఒక టేబుల్‌స్ఫూన్ చల్లని పాలు, రెండు చుక్కలు ఏదో ఒక వెజిటబుల్ ఆయిల్, ఆలివ్, నువ్వుల నూనె లేదా సన్‌ఫ్లవర్ కలిపి శుభ్రమైన దూది దానిలో ముంచి చర్మానికి అప్లై చేయాలి.
ఒకవేళ వానలో తడిచినా ఇంటికి రాగానే తలస్నానం చేయాలి. 'వానలో తడిచాం కదా. ఇంకా ఇదెందుకు?' అనుకుంటే పొరబాటే. ముందే చెప్పుకున్నాంకదా. బయట రోడ్లమీద నీళ్లు ఎంత మురికిగా వుంటాయో! అందుకన్నమాట. తల, శరీరం పొడిగా తుడుచుకోవాలి. శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ.
వానలో తడిసిన తరువాత కళ్లను చల్లని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానానికి ముందు కాళ్లు, చేతులకు డెటాల్ సబ్బు రాసుకోవాలి
మహిళలు సున్ని పిండిలోనూ చిటికెడు పసుపు చేర్చి పూసుకోవాలి. నీటిలో వేపాకుల్ని మరగపెట్టి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఈ సీజన్‌లో ఔషధ గుణాలు ఉన్న సబ్బులనే ప్రతి ఒక్కరూ వాడాల్సి ఉంటుంది. టేబుల్ స్పూన్ పాలలో రెండు బాదం పలుకులు నానపెట్టి పొట్టుచేసి ముఖానికి పట్టించాలి
గ్లిజరీన్ లేదా రోజ్‌వాటర్‌ను కొద్దిగా నీటిలో కలిపి స్నానం చేస్తే పొడి చర్మానికి నిగారింపు వస్తుంది. చర్మం పొడిగా, అక్కడక్కడ జిడ్డుదనం ఉంటే ఈ రెండింటినీ అధిగమించేలా జాగ్రత్తలు పాటించాలి. చర్మం పొడిగా ఉన్నచోట తరచూ శుభ్రమైన నీటితో కడగడంతో పాటు తగిన మాయిశ్చరైజర్‌ను వినియోగించాలి. జిడ్డు చర్మం ఉన్న చోట వేన్నీళ్లతో కడిగి, గట్టిగా మర్దనా చేయాలి.
తల ఎక్కువ సేపు తడిగా వుంటే చుండ్రు సమస్య పట్టుకుంటుంది. వెంట్రుకలు రాలిపోతాయి. మరీ ముఖ్యంగా పాదాలను పొడిగా వుంచుకోవాలి. పాచి పట్టకుండా జాగ్రత్త పడాలి. బయట తడిచినప్పుడు ఇంటికి వచ్చాక విధిగా స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. బట్టలు ఎప్పుడూ పొడిగా వుండాలి. డయాబెటిక్ రోగులు పాదాల విషయంలో మరింత శ్రద్ధగా వుండాలి. వేళ్ల మధ్య తడి లేకుండా తుడుచుకోవాలి.



Click it and Unblock the Notifications