Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో శరీరానికి చల్లదనం..చర్మానికి నిగారింపు...!

1. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది.
2. పెరుగులో కొద్దిగా పంచదార కానీ లేదా ఉప్మారవ్వగానీ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
3. పెరుగులో శనగపిండి కలిపి నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే చర్మం, ముఖం మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.
4. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే మంచి క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.
5. 5 టీ ప్పూన్లు పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయి.
6. ఎండలో తిరిగి బయటి నుండి ఇంటికి తిరిగి రాగానే ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది.
7. రెండు స్సూన్ల పెరుగులో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను గోధుమ పిండి కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చెమట పొక్కులు పోయి మొహం తేటగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు గోధుమపిండి బదులు శెనగపిండి కలుపుకోవాలి.
8. ఎండవల్ల చర్మం కమిలిపోయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల టమోటారసంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి మొహానికి, చేతులకు పట్టించి పావుగంట తర్వాత చల్లటినీటితో కడగాలి. ఎర్రబడిన చర్మం చల్లబడి మెత్తగా ఉంటుంది.
ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పెరుగు అమోఘంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది కాబట్టి సౌందర్య పోషకులు చాలామంది దీన్ని అందాన్ని పెంచేందుకు సౌందర్య వర్ధినిగా వాడుతారు. ఎండదెబ్బతిని వాడిపోయిన చర్మానికి సహజ కాంతిని కలిగిస్తుంది. పెరుగుతో శరీరంపై మర్దనా చేయడంవల్ల మంచి కాంతి, తెలుపు వస్తుంది. అలాగే కేశాలు(వ్రెంటుకల)రక్షణకు పెరుగును వాడుతారు. పెరుగును తలకు పట్టించి, గంట తరువాత తలస్నానం చేయడం వల్ల కేశాలు నిగనిగలాడడమే కాకుండా ఒత్తుగా మారుతాయి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగి, జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications