Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఆకర్షించే అందమైన జాలువారే కురులు
కురుల సిరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జుట్టు తీరును బట్టి ముఖానికి అందం వస్తుంది. కొందరి జుట్టు ఎంతో సిల్కీగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మరి కొందరి జుట్టులో ఏమాత్రం గ్లో ఉండదు. చూడగానే ఇలా అనుకుంటాం గానీ అసలు కురులు అందంగా ఉండటానికి, లేకపోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో మనకు తెలీదు. కేశాల విషయంలో శ్రద్ద తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియల్లో స్తబ్ధత. కొన్ని రకాల ఇన్ఫక్షన్లు, చుండ్రుకు కారణమవుతాయి. అదిక చెమట, అపరశుభ్రత, అలర్జీ, ఒత్తిడి, ఆందోళన, అధిక తీపి, కొవ్వు పధార్థాలను తినడం. పోషకాహారలోపం వంటివి చుండ్రు సమస్యకు దారితీస్తాయి.

శిరోజాలకు సౌందర్య ఉత్పత్తులను అధికంగా వినియోగించడం, ఎలక్ట్రిక్ మెషియన్లను ఉపయోగించడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి. చుండ్రును నివారించాలంటే కుదుళ్లలో ఉండే అసిడీక్ ఫీహెచ్ స్థాయి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆరు స్పూన్ల నీళ్లను రెండు స్పూన్ల వెనిగర్ తో కలిపి దూదితో శిరోజాల మొదళ్లలో చర్మం పై రాసుకోవాలి. ఇలా వారనికో రోజు నిద్రించడానికి ముందుగా రాసుకుని మార్నాడు ఉదయం వెనిగర్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. రెండు గుడ్ల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కలుపుకోవాలి.
తలను నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని తలపై రాసుకుని మర్థన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలేసమస్య తగ్గిపోతుంది. గోరువెచ్చని కొబ్బరి నూనె లేక ఆముదాన్ని వారానికి రెండుసార్లు రాత్రి నిద్రించడానికి ముందుగా తలకు పట్టేంచుకోవాలి. తర్వాత వేళ్లతో తలపై గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తలపొడిగా మారకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
