Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
మట్టితో ముఖ సౌందర్యం మెరిసే మెరిసే....!

1. మట్టితో ప్యాక్ లు వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం. మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు.
2. నెలలో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వయస్సును బట్టి ఉంటుంది. పదిహేనేళ్లలోపు అమ్మాయిలు అస్సులు వాడకూడదు. మరీ తప్పనిసరైతే నెలకోసారి ప్రయత్నించాలి. ఇరవై ఐదేల్ళు దాటిన వాళ్ళు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోవాలి. ముఫ్పై అయిదేళ్లు దాటిని వాళ్లు నెలకు రెండుమూడుసార్లు మాత్రమే ఈ పూతలు వేసుకోలి. ముప్పై అయిదేళ్లు దాటిన స్త్రీలు నెలకు నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. యాభై పైబడిన వాళ్ళు ఇలాంటివి వేసుకోకపోవడమే మంచిది.
3. ముఖ్యంగా మెటిమలు ఉన్నచోట ఈ ప్యాక్ వేయకూడదు. కళ్ల అడుగున, కనురెప్పలపైన రాయకూడదు.
మరి మట్టితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం: పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్ మట్టి, గ్రీన్ క్టే, బ్లాక్ క్లే..వంటి రాకాల్లో దొరుకుతుంది. దీన్ని చర్మం తత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
1. జిడ్డు చర్మతత్వం కలవారు: ఒక టీస్పూను ముల్తానీ మంట్టి, ఒక టీస్పూనునిమ్మరసం, అరచెంచా తేనె, పావు చెంచా పుదీనా పొడి చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు
ఉంటుంది.
2. చైనా క్లేఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాషన్ చెంచా, కమలాఫలం తొక్కల పొడి, తేనె అరచెంచా చొప్పున తీసుకుని వీటన్నింటినీ రోజ్ వాటర్ తో మిశ్రమంలా చేసుకుని ముఖానికీ పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
3. సహజ చర్మ తత్వం కలవారు: ముల్తానీ మట్టి ఒక టీస్పూను, పాలమీగడ లేదా పాలు ఒక టీస్పూను, గులాబీ రేకులపొడి అరచెంచా, తేనె ఒక టీస్పూను తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి.
4. పొడిబారిన చర్మ తత్వానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్న వాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కు సేపు ఉంచుకోకూడదు. ఈ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..వండర్ క్లే కలబంద గుజ్జు ఒక టీస్పూనుచొప్పున, విటమిన్ ఇ మాత్రం ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications