Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మగవారికీ ఉన్నాయి ఫెయిర్ నెస్ టిప్స్...!

అయితే పురుషుల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానకి ఎక్కువ ఘాడత కలిగిన ఉత్పత్తులును వాడనవసరం లేదు. మీ చర్మసౌందర్యాన్ని తాజాగా ఉంచుకోవడానికి సాధారణ హోం మేడ్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...
1. ముఖ్యంగా మగవారి చర్మం తాజాగా ఉండాలంటే ఉదయం పూట షేవింగ్ చేయడం మానేయాలి. వీలైతే రాత్రి సమయంలో షేవింగ్ చేసుకోవడం మంచిది. దాంతో రాత్రి షేవింగ్ చేసిన తర్వతా ముఖ చర్మం పునరావస్తకు చేరుకుని ఉదయాన్నే చూడ్డానికి ఫ్రెష్ గా కనిపిస్తుంది.
2. చర్మం పాలిపోకుండా దృడంగా ఉండటానికి హైడ్రోక్వినోన్, మెర్క్యురీ లేదా స్టెరాయిడ్ వంటి ఉత్పత్తులు చర్మానికి హాని కలుగజేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. చర్మ ఛాయను పెంచుకోవడానికి కొన్ని పద్దతులను ఎక్కువ కాలం పాటించాల్సి ఉంటుంది.
3. ముఖాన్ని మృదువుగా, సున్నితంగా ఉండేట్లు చూడాలంటే ఇంట్లో తయారు చేసుకొనే పద్దతి : బాగా పండిన అరటి పండును గుజ్జులా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మ సౌందర్యం తాజాదనంతో మెరుస్తుంటుంది. బాగా పండిన అరటిపండును ఉపయోగించడం వల్ల చర్మ కాంతిని రెట్టింపు చేస్తుంది.
4. కాంతివంతమైన చర్మసౌందర్యానికి బాదాం, వేప ఆకు, పసుపు, గంధం చెక్క మరియు గసగసాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. అరగంట తర్వాత ముఖాన్ని తడి చేసి క్లాక్ వైస్ టైప్ లో ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంగా కోమలంగా మెరుస్తుంటుంది.
5. సున్నితమైన చర్మ సౌందర్యానికి నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమభాగాల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి, మొత్తం శరీరానికి అప్లై చేసి అరగంట సేపు అలాగే వదిలేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం సున్నితంగా మారుతుంది.
6. షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మం సున్నితంగా ఉండేందుకు, చర్మాన్ని కాపేడేందుకు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
