Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.!
చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రమత్తుగా, నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంటుంది. కాసేపైనా కునుకు తీయాలనిపిస్తుంది. కానీ ఆఫీసులో, ఇతర పనుల్లో ఉన్నవారికి ఇది సాధ్యం కాని పని. అలాంటి పరిస్థితుల్లో మీరు లంచ్ తర్వాత యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉండాలంటే మీ భోజనంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం..

మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మంది నీరసంగా, మగతగా లేదా నిద్రమత్తుగా భావించడంతో వనిలో ఏకాగ్రత కష్టమవుతుంది. ఉదయం ఉన్నంత చురుగ్గా ఉండలేరు. ఈ పరిస్థితి అందరిలో ఒకేలా ఉండదు. లంచ్‌లో ఎక్కువగా తినడం, మసాలా ఎక్కువగా ఉన్న భోజనం చేయడం, జీర్ణక్రియ ప్రక్రియ వల్ల భారంగా అనిపించి చురుగ్గా ఉండలేరు. అందుకే మధ్యాహ్న భోజనం తర్వాత మీ ఆహారం, రోజువారీ అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఇది అలసట, నీరసాన్ని తగ్గించి శరీరానికి తగిన పోషకాలు అంది చురుగ్గా ఉండగలుగుతారు.
గ్లాసు మజ్జిగ
లంచ్ తర్వాత గ్లాసు మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరాన్ని చల్లబరిచి, తేలికగా, తాజాగా అనిపిస్తుంది. వేసవి కాలంలో భోజనం తర్వాత పొట్ట భారంగా ఉండకుండా ఉండేందుకు గ్లాసు మజ్జిగ తాగినట్లయితే యాక్టివ్‌గా, అలసట లేకుండా ఉంటారు.
సీజనల్ ఫ్రూట్స్
మధ్యాహ్న భోజనం తర్వాత ఆపిల్, నారింజ, బొప్పాయి, జామకాయల వంటి పండ్లను తీసుకోవడం ద్వారా మేలు చేస్తుంది. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. శక్తిని నిలుపుకోవడానికి దోహదపడుతుంది. దీంతో కడుపు తేలికగా ఉంటుంది.
మొలకెత్తిన పెసలు
లంచ్ అనంతరం పెసల మొలకలు తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇందులోని ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు శరీరానికి పోషణ అందించి శక్తిని అందిస్తుంది. తేలికగా ఉండటంతో మధ్యాహ్న భోజనం తర్వాత తిన్నట్లయితే పనులు చురుగ్గా చేసుకోగలుగుతారు.

గ్రీన్ టీ
మధ్యాహ్నం భోజనం అనంతరం 45 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగినట్లయితే శరీరానికి యాంటీ యాక్సిడెంట్లు అందుతాయి. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. బరువుగా అనిపించే భావనను తొలగించి పొట్టను తేలికగా ఉంచుతుంది.
వేయించిన శనగలు
లంచ్ చేశాక గుప్పెడు వేయించిన శనగలు తిన్నట్లయితే సరైన మోతాదులో ప్రొటీన్, ఫైబర్ శరీరానికి అందుతాయి. దీని ద్వారా ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండగలరు. దీంతో ఆకలి భావన తగ్గుతుంది. యాక్టివ్‌గా ఉండగలుగుతారు.
అయితే ఇలా తినడం లంచ్ చేసిన వెంటనే చేయకండి. మగతగా, అలసటగా అనిపించినప్పుడు ఒక 30 నుంచి 45 నిమిషాల తర్వాత ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి. దీని ద్వారా పోషక శోషణపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. తిన్న వెంటనే ఒక 10 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి. శరీరం హైడ్రేడెట్‌గా ఉండేలా చూసుకోండి. మితంగా భోజనం చేయండి. సరైన ఆహార వేళలు పాటించండి.
తిన్న తర్వాత ఎక్కువగా తీపి పదార్థాలు, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటి వాటి జోలికి వెళ్లకండి. సమతుల్య ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications