ముఖ చర్మంలో కాంతులు నింపే డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్..

సాధారణంగా చర్మ సంరక్షణలో సహజసిద్దమైన ఫేస్ ప్యాక్ లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలోని సహజమైన తత్వాలతో తయారైన ఈ ఫేస్ ప్యాక్ లు ముఖ సౌందర్యాన్ని సంరక్షిస్తూ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తాయి. వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

కయొలిన్ , వివిధ రకాల ఔషధాలతో పాటు కమలాపండ్ల తొక్కుతో తయారైంది ఈ ఫేస్ ప్యాక్. చర్మంలోని సహజసిద్ధమైన జిడ్డుగా చేసే లిల్లి స్కిన్

రోజ్ ఫేస్ ప్యాక్

రోజ్ ఫేస్ ప్యాక్

అన్ని కాలాల్లోనూ సౌందర్యపు పరిమళాలను వెదజల్లే రోజ్ ఫేస్ ప్యాక్ మంచి టోనర్ గా పని చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచి అందంగా ఉన్నామనే భావన కల్గిస్తుంది.

కుకుంబర్ ఫేస్ ప్యాక్

కుకుంబర్ ఫేస్ ప్యాక్

ఖీరా దోసకాయ గింజలు, ఇతర సహజ తత్వాలతో తయారైంది కుకుంబర్ ఫేస్ ప్యాక్. సహజసిద్దమైన క్లీన్సర్ గా మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మానికి చక్కని పోషణ అందిస్తుంది

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీలోని పోషకతత్వాలతో తయారైన క్లీన్సిగ్ ఫేస్ ప్యాక్ ఇది. పళ్లలోని సహజమైన నూనె, సుగందతత్వాలు కలిగి ఉంది. మృతకణాలను, మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రం చేసి మృదువుగా

యాంటీ పింపుల్ హెర్బల్ ఫేస్ ప్యాక్

యాంటీ పింపుల్ హెర్బల్ ఫేస్ ప్యాక్

వారంలో రెండుసార్లు ముఖానికి ఏదైనా హెర్బల్ ప్యాక్ వేసుకోవాలి. ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ సహజసిద్ధంగా చర్మాన్ని సంరక్షిస్తుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్: కయొలిన్, వివిధ రకాల ఔషధాలతో పాటు కమలాపండ్ల తొక్కుతో తయారైంది ఈ ఫేస్ ప్యాక్. చర్మంలోని సహజసిద్ధమైన జిడ్డుగా చేసే లిల్లి స్కిన్ కోసం ప్రత్యేకంగా తయారైంది చర్మంలోని అదనపు జిడ్డును, మచ్చలను ఇది తొలగిస్తుంది. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను ఆరెంజ్ జ్యూస్ లేదా ఎండిన తొక్కలతో పొడి చేసిన పదార్థాంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్,ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.

రోజ్ ఫేస్ ప్యాక్: అన్ని కాలాల్లోనూ సౌందర్యపు పరిమళాలను వెదజల్లే రోజ్ ఫేస్ ప్యాక్ మంచి టోనర్ గా పని చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచి అందంగా ఉన్నామనే భావన కల్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తో సహజమైన మెరుపు, తాజాదనం లభిస్తుంది. రోజ్ వాటర్ తో వేసుకొనే ఫేస్ ప్యాక్ లేదా రోజా పువ్వుల రేకులతో తయారు చేసే ప్యాక్ లను ముఖానికి గ్లో ఇస్తాయి. ముఖం తాజాగా ఉండేట్లు చేయడమే కాకుండా మెరుపును అందిస్తుంది.

కుకుంబర్ ఫేస్ ప్యాక్: ఖీరా దోసకాయ గింజలు, ఇతర సహజ తత్వాలతో తయారైంది కుకుంబర్ ఫేస్ ప్యాక్. సహజసిద్దమైన క్లీన్సర్ గా మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మానికి చక్కని పోషణ అందిస్తుంది. నల్లమచ్చలు, మొటిమలను ముడతలను నివారిస్తుంది. పొడి చర్మానికి తేమనిస్తుంది. అన్ని రకాల చర్మాలకు అనువుగా వుంటుంది. కీర ముక్కలు కళ్లు మీద పెట్టుకుంటే అలసతపోతుంది . కుకుంబర్ ఫేస్ ప్యాక్ కీరదోసను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టాలి. టేబుల్ స్పూన్ రసంలో టేబుల్ స్పూన్
పంచదార వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్: స్ట్రాబెర్రీలోని పోషకతత్వాలతో తయారైన క్లీన్సిగ్ ఫేస్ ప్యాక్ ఇది. పళ్లలోని సహజమైన నూనె, సుగందతత్వాలు కలిగి ఉంది. మృతకణాలను, మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రం చేసి మృదువుగా, తాజాగా ఉంచుతుంది. నార్మల్, ఆయిలీ స్కిన్ కు ఇది ఉత్తమమైనది. స్ట్రాబెరీలతో ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్ ప్రెష్ గా ఉంటుంది.

యాంటీ పింపుల్ హెర్బల్ ఫేస్ ప్యాక్: వారంలో రెండుసార్లు ముఖానికి ఏదైనా హెర్బల్ ప్యాక్ వేసుకోవాలి. ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ సహజసిద్ధంగా చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇది చర్మం కాంతులీనేలా చేయడంతో పాటు, మృదువుగా ఉంచి మొటిమలను నివారిస్తుంది. చర్మంలోని అదనపు జిడ్డు తత్వాలను తొలగించి అన్ని రకాల ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది. ఆయుర్వేద పద్ధతిలో శుద్ధి చేసి సున్నిపిండి, ఫేస్ ప్యాక్, హెయిరాయిల్, హెర్బల్ శాంపు, ఫేస్క్షికీమ్లను తయారుచేస్తున్నారు. ఇవన్నీ మానవుడి ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇనుమడింప జేసేవే.

Desktop Bottom Promotion