Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మేనిమెరుపుకు వంటింటి వస్తువులుండగా..కాస్మొటిక్స్ ఎందుకు..?

1. బేకింగ్ సోడా: మృదువైన, పట్టులాంటి చర్మం కావాలంటే స్నానానికి ముందు బేకింగ్ సోడాను ఒంటికి పట్టించి తర్వాత స్నానం చేస్తే మీ శరీరం మృదువుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇదే ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
2. పసుపు: మామూలుగా వంటింట్లో ఇది వాడనది ఏ వంటా పూర్తవ్వదు. పసుపు చేసే లాభాలు అందరికీ దాదాపు తెలిసిందే. కానీ పసుపు కంటికింద ఉండే నల్లటి చారల్ని, ఉబ్బును కూడా తొలగిస్తుందని చాలామందికితెలియదు. పగిలిన మడమలను బాగుచేస్తుంది. పిగ్మెంటేషన్, ముడుతల్ని పోగొడుతుంది. చర్మానికి మెరుపునిస్తుంది..ఇన్ని సుగుణాలున్న పసుపును ప్రతి రోజూ ఉపయోగిస్తే సౌందర్యం మీ చెంతే ఉంటుంది.
3. కీరదోస: వేసవిలో అరుదుగా లభించే కీరదోసకాయ, పైనాపిల్, నిమ్మరసాలు ప్రకృతి ఇచ్చిన యాస్ట్రింజెంట్లు. ఇంట్లో వీటిని వాడే ముందు ముఖానికి ఆవిరిపట్టాలి. ఇలాచేయడం వల్ల ముఖంపై రంధ్రాలు తెరుచుకుని శుభ్రమవుతాయి. దీనివల్ల పోషకాలు సులభంగా చర్మంలోకి ప్రవేశించే వీలుంటుంది.
4. వంటింట్లో ఉపయోగించే మెంతులు, కందిపప్పుల్ని పొడిని గుడ్డులోని తెల్లసొనతో కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మం పై రాసుకుంటే జిడ్డు తొలగిపోతుంది. చర్మానికి మెరుపునిస్తుంది.
5. తేనెలో నిమ్మరసాన్ని, వేరుశనగ పప్పు పొడిని వేసి పేస్ట్ లా చేసి స్క్రబ్బింగ్ గా ఉపయోగిస్తే చక్కటి మెరుపు సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications
