Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ముడతలు..జిడ్డు సమస్య కి మట్టితో నివారణ...

1. జిడ్డు చర్మం కలవారు: టీ స్పూన్ ముల్తానీమట్టి, నిమ్మరసం, తేనె, పుదీనా పొడి సమపాళ్ళలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలో ఎంతో మార్పు ఉంటుంది.
2. చైనా క్లే ఒకటిన్నర చెంచా, గ్రీన్ టీ డికాక్షన్ టీస్పూన్, కమలాఫలం తొక్కల పొడి, తేనె సమంగా తీసుకుని వీటన్నింటినీ రోజ్‌వాటర్ తో మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంటతర్వాత కడిగేయాలి. చర్మం మరీ జిడ్డుగా ఉంటే.. ఐదు రోజులకోసారి వేసుకోవచ్చు. జిడ్డు తక్కువగా ఉంటే.. నెలకు మూడుసార్లు రాసుకోవచ్చు. చర్మంలో మొటిమలు, జిడ్డు తగ్గడమే కాదు.. అందంగానూ మారుతుంది.
3. సహజ చర్మం కలవారు: ముల్తానీమట్టి టీస్పూన్ లో, పాలమీగడ లేదా పాలు టీస్పూన్, గులాబీ రేకలపొడి టీస్పూన్, తేనె టీస్పూన్తీసుకుని పాలు లేదా సోయా పాలతో కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. వండర్ క్లే బాదం పొడి టీస్పూన్, పాలు రెండు టీస్పూన్ , మామిడిగుజ్జుటీస్పూన్ తీసుకుని వీటన్నింటినీ కలిపి చర్మానికి పూతలా రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
5. ముల్తానీమట్టి, టమాటాగుజ్జు, కీరదోస రసం చెంచా చొప్పున తీసుకుని అరచెంచా తేనె కలిపి రాసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేస్తే చాలు.
6. పొడిబారిన చర్మానికి: ఈ తరహా చర్మ తత్వం ఉన్నవాళ్లు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. వండర్ క్లే, కలబంద గుజ్జు చెంచా చొప్పున, విటమిన్ ఇ మాత్ర ఒకటి తీసుకుని చిక్కని పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే మోము మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications
