Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
కాలానికి అనుగుణంగా చర్మాన్ని కాపాడుకుంటున్నారా....?
మసాజ్: నాలుగేసి చుక్కల చొప్పున చందనం రోజ్ వాటర్ లను ఒక్కో చెంచా చొప్పున స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఆలివ్ ఆయిల్ తో కలిపి శరీరానికి మసాజ్ చేసుకుంటే చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది.

ఫేస్‌వాష్: తగినన్ని నీళ్ళు తీసుకొని ఆ నీటిలో క్యాబేజీ ఉడికించి చల్లారాక ఈ నీటిని ఫేస్ వాష్ గా ఉపయోగించాలి. క్యారెట్ తురుమును స్క్రబ్‌గా వాడుకోవచ్చు. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్ ఈ కాలం సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
ఆయిల్ స్కిన్ ఫేష్ వాష్: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన, ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా స్ట్రాబెరీ జ్యూస్ అన్నీ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్ళతో బాగా మర్దన చేయాలి. అలాగే అరగంట పాటు వదిలేసి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అవసరం అయితే కొన్ని రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు.
డ్రై స్కిన్ ఫేష్ వాస్: మిక్సింగ్ బౌల్ లో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ బాదాం నూనె, రెండు టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసి , తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పొడి బట్టతో తుడిచుకొని తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేసుకోవాలి.
ఫేస్ మాస్క్: పొడిచర్మం కలవారు అర టీస్పూన్ తేనె, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, ఒక టీస్పూన్ పాలపొడి కలిపి పేస్టు మాదిరిగా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అరటి, యాపిల్, బొప్పాయి, కమలాలవంటి పండ్లను చిదిమిముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది అన్నిరకాల చర్మతత్వం వారికీ పనిచేస్తుంది. బొప్పాయిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటే అరటి చర్మాన్ని టైట్ చేస్తుంది. యాపిల్ లోని పెక్టిన్ చర్మాన్ని క్లెన్స్ చేస్తుంది. కమలా ఫలంలో ఉండే సి విటమిన్ సాధారణ యాసిడ్ ఆల్కలైన్‌ని సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
మృదువైన చర్మం: ఒక టీ స్ఫూన్ కమలారసంలో తేనె కలుపుకొని ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. తేనె అన్ని రకాల చర్మతత్వాలకూ సరిపోతుంది. ముఖం జిడ్డుగా మొటిమలతో ఉన్నట్టయితే ఒక టీ స్ఫూన్ తేనె, ఒక టీ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు కలిపి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి.
పొడిచర్మం: ఈ వర్షా కాలంలో చర్మతత్వాన్ని అనుసరించి దానికి తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. ఒక టేబుల్‌స్ఫూన్ చల్లని పాలు, రెండు చుక్కలు ఏదో ఒక వెజిటబుల్ ఆయిల్, ఆలివ్, నువ్వుల నూనె లేదా సన్‌ఫ్లవర్ కలిపి శుభ్రమైన దూది దానిలో ముంచి చర్మానికి అప్లై చేయాలి.
బ్లీచింగ్ ఎజెంట్స్: ఫేషియల్, బ్లీచ్ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్ కార్నియమ్) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే 'కాస్మోటిక్ ఇన్‌టాలరెన్స్ సిండ్రోమ్ వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.
బ్లీచ్‌కోసం: రకరకాల ప్రూట్ పీల్స్, ఫ్రూట్‌యాసిడ్స్ వాడటం వల్ల మొటిమలు, చీము పొక్కులు చాలా ఎక్కువగా వస్తుం టాయి. పీల్స్ గాఢంగా ఉంటే చర్మం నలుపు తిరిగే అవకాశమూ ఉంటుంది. అలాగే పీల్స్ చేయించుకోగానే ఎండలోకి వెళితే నల్లబారే అవకాశంఎక్కువ. కాబట్టి ఈ కాలంలో బ్లీచింగ్ లకు దూరంగా ఉండటమే మంచిది.



Click it and Unblock the Notifications
