Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సమ్మర్ ఫ్రూట్స్ తో స్ర్కబింగ్...!

1. బొప్పాయి గింజలు-తేనె: చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగించడంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది. అదే ఎలాఅంటే బొప్పాయి గింజల్లో అంతటి స్వభావం కలిగి ఉంది. ఎండ వేడికి పొడిబారిన చర్మాన్ని, చర్మం మీద ఏర్పడే దద్దర్లు పోగొట్టి, చర్మాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి గింజలపేస్టుతో స్ర్కబ్ చేయడం ద్వారా మృతకణాలను తెరచుకొనేలా చేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా గుప్పెడు బొప్పాయి గింజలు, కొంచెం పండిన బొప్పాయిని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి రాసి బాగా మర్ధన చేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మనికి చక్కటి మాస్క్ లాంటిది.
2. అరటిపండు-ఓట్ మీల్ స్ర్కబ్: అరటిపండులో కూడా గింజలు ఉంటాయి. అయితే అవి చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి. అందుకు అరటిండుకు ఓట్ మీల్ పొడిని చేర్చి మెత్తని పేస్టులా తయారు చేసుకొని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.
రెండు టేబుల్ స్పూన్ల అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఓట్ మీల్ పొడి వేసి బాగా కలిపి మొత్తని పేస్టులా తయారైన తర్వాత ముఖానకి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత బాగా రుద్ది చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో తాజాదనం వస్తుంది.
3. మామిడి -బాదం స్ర్కబ్: ఎక్కువ పోషక విలువలున్న ఈ రెండూ చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతాయి. బాగా మాగిన మామిడి పండు గుజ్జులో బాదం పప్పు తురుమును కలిపి ముఖానికి స్క్రబ్ చేయెచ్చు.రెండు టేబుల్ స్పూన్ల బాదం తురుములో అరకప్పు మామిడిపండు గుజ్జుతీసుకొని బాగా మెత్తగా పేస్ట్ తయారు చేసి ముఖానికి మెడకు అప్లై చేసి, ఇరవై నిమిషాల తర్వాత బాగా మర్ధన చేసి, శుభ్రం చేస్తే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా బాదం ఆయిల్ తో చర్మానికి కావలసిన విటిమిన్ ఇ అందుతుంది.
4. పనసపండు-పంచదార స్ర్కబ్: పనసపండు వేసవిలో అరుదుగా దొరికేటటువంటిది. గింజలు తీసేసి మొత్తని పదార్థానికి పంచదారను కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖాని రాసి బాగా రుద్దాలి. పదినిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మన్ని మృదువుగా..ప్రకాశవంతంగా చేస్తుంది.
మీరు సహజపద్దతుల్లో గనుక సౌందర్య చిట్కాలను ఉపయోగించాలనుకొన్నప్పుడు ఈ హోంమేడ్ పద్దతుల పాటించవచ్చు. ఎటువంటి రసాయనాలను లేని ఈ పదార్థాలు చర్మానికి బాగా పనిచేస్తాయి..



Click it and Unblock the Notifications
