Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
హనీ లిప్ బామ్ తో పింక్ కలర్ లిప్స్ మీ సొంతం.
హనీ(తెనె)చాలా సాధారణంగా ఉపయోగించేటటువంటి వంటింటి వస్తువు. తేనే ప్రక్రుతి సిద్దంగా దొరికే అపురాపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపములో మనకి అందిస్తున్నాయి. తేనెను తరచు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అంతే కాదు చర్మసంరక్షణలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పెదాలు పగుళ్ళను చర్మ పగుళ్ళను అరికడుతుంది. ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మెరిసేలా చేస్తుంది. తేనె చర్మానికి సహజసిద్దమైనటువంటి మాయిశ్చరైజర్.
తేనెతో బరువు తగ్గడం పక్కన పెడితే, చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుందనడానికి ఓ నిదర్శనం హనీ లిప్ బామ్. ఇది చాలా పాపులర్ అయినటువంటి బ్యూటీ ప్రొడక్ట్. పెదాలను పొడబారనీయకుండా తేమగా, మంచి మెరుపు నిచ్చే అద్భుతమైన గుణాలు తేనెలో అధికంగా ఉన్నాయి. అందుకే మృదువైన పెదాలకు తేనెతో తయారు చేసిన లిప్ బామ్ అంత్య ప్రాచుర్యం పొందింది. అంతే కాదు చాలా రకాలైనటువంటి సౌందర్య సాధానాల్లో తేనెను విరివిగా ఉపయోగిస్తుంటారు కూడా...

మరి హనీ లిప్ బామ్ ఉపయోగాలేంటో చూద్దాం...
1. ఇది సహజసిద్దంగా ప్రకతిలో లభించేటటువంటి వస్తువు. ఇది పగిలిన పెదాలకు, రఫ్ గా ఉన్న పెదాలకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి మృదువుగా మారేలా చేస్తుంది
2. తేనెలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ చర్మ ఇన్ఫెక్షన్ కి దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అందుకు దోహదం చేసే క్రిములను సంహరిస్తుంది.
3. చర్మం పగుళ్లు: మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.
4. పెదాల సంరక్షణలో బాదాం ఆయిల్, ఎసెన్సియల్ ఆయిల్స్ ఎలా అద్భుతంగా పనిచేస్తాయో అలాగే హనీ లిప్ బామ్ కూడా బెస్ట్ ప్రొడక్ట్. ఎందుకంటే దీన్ని తేనె రాయడం వల్ల పెదాలకు వేసిన లిప్ స్టిక్స్ లేదా లిప్ గ్లాస్ ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేస్తుంది.
5. పగిలిన పెదాలు లేకపోయినా..తేనెను అప్లై చేయడం వల్ల పొడి బారిన పెదాలు సున్నితంగా తేమగా మారుతాయి. కాబట్టి చలికాలంలో తేనెను పెదాలకు, ముఖానికి అప్లై చేయడం చాలా మంచిది..
పెదాలు పింక్ కలర్ లో సున్నితంగా ఉండాలంటే అందుకు హనీ లిప్ బామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె తీసుకొని అందులో బాదాం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి నిద్రపోవడానికి ముందు పెదాలకు అప్లై చేయాలి.
2. దీన్ని పగలు పూట కూడా పెదాలకు అప్లై చేయడం వల్ల పెదాలు గ్లాసీగా మెరుస్తుంటాయి.
3. దీన్ని లిప్స్ కు రోజులో ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు.
4. రాత్రి సమయంలో పెదాలకు ఎక్కువ మోతాదులో అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ గాపనిచేస్తుంది.
5. దీన్ని మూత ఉన్న డబ్బాలో భద్రపరిచి రెండు వారాల పాటు ఉపయోగించుకోవచ్చు.
జాగ్రత్తలు: తేనె ఆరోగ్యానికి, సౌందర్యానికి దివ్వ ఔషదం అయినా... కొంత మందికి మాత్రం అలెర్జీగా ఉంటుంది. దీన్ని ఉపయోగించేటప్పుడు దురద, అసౌకర్యంగా ఉన్నా వెంటనే తేనె మిశ్రమాన్ని రాయడం నిలిపివేయాలి.



Click it and Unblock the Notifications