Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిత్యం యవ్వనంతో ఆకర్షణీయంగా...!

ముఖానికి, చేతులు, మెడకీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు.
చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మౄఎదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్‌స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.
1. జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసు పు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.
2. నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది.
3. కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్‌ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
4. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్‌ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
5. నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
6. చెంచాచొప్పున వెనిగర్, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.
7. ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.
9. చెంచాచొప్పున తేనె, ఓట్ మీల్ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
10. నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications